ఓటీటీలో దూసుకుపోతున్న తెలుగు క్రైమ్ కామెడీ థ్రిల్లర్- 120 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ దాటి నయా రికార్డ్- 7.6 రేటింగ్!
ఓటీటీలో తెలుగు క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీ చౌర్య పాఠం దూసుకుపోతోంది. ఏకంగా 120 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్‌ను దాటేసి కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. బ్యాంకు చోరీ చేసే చిన్న ముఠా నేపథ్యంలో వచ్చిందీ సినిమా. అలాగే, 7.6 ఐఎమ్‌డీబీ రేటింగ్ సాధించుకున్న చౌర్య పాఠం ఓటీటీ స్ట్రీమింగ్‌పై లుక్కేద్దాం.
ఓటీటీలో ఎన్నో సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుంటాయి. అయితే, వాటిలో కొన్ని మూవీస్ మాత్రమే ఓటీటీ ఆడియెన్స్ ఆదరణ పొందుతాయి. అలాగే, కంటెంట్ ఉండి కూడా థియేటర్లలో అంతగా గుర్తింపు తెచ్చుకోలేని సినిమాలు ఓటీటీలో దుమ్ముదులుపుతుంటాయి.

నలుగురు క్రిమినల్స్
అలాంటి సినిమానే చౌర్య పాఠం. తెలుగులో క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీగా వచ్చిన చౌర్య పాఠం ఓటీటీలో దూసుకుపోతోంది. నలుగురు క్రిమినల్స్ ప్రశాంతమైన గ్రామంలో బ్యాంక్ దొంగతనం చేయడానికి ప్రయత్నిస్తే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్‌తో తెరకెక్కింది ఈ సినిమా.
ఈ విలేజ్‌లో బ్యాంక్ రాబరీ చేయడానికి ఈ చిన్న ముఠా చేసే ప్రయత్నాలు, ఎదురయ్యే సమస్యలు కామెడీతో ఎంటర్‌టైనింగ్ అండ్ థ్రిల్లింగ్‌గా చూపించారు. ఈ ఏడాది ఏప్రిల్ 25న థియేటర్లలో విడుదలైన చౌర్య పాఠంపై పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ పెద్దగా ఆశించిన ఫలితం అందుకోలేకపోయింది.
అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో
ఆ తర్వాత చౌర్య పాఠం ఓటీటీ రిలీజ్ అయి సత్తా చాటింది. అమెజాన్ ప్రైమ్‌లో చౌర్య పాఠం ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ప్రైమ్ వీడియోలో చౌర్య పాఠం సరికొత్త సంచలన రికార్డ్ క్రియేట్ చేసింది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో చౌర్య పాఠం ఏకంగా 120 మిలియన్ స్ట్రీమింగ్ మినట్స్ మైలురాయిని దాటేసింది.
డిజిటల్ వరల్డ్‌లో తనదైన ముద్ర వేసుకుని ఓటీటీలో చౌర్య పాఠం సత్తా చాటుతోంది. థియేటర్లలో సైలెంట్‌గా వచ్చిన ఈ సినిమా ఓటీటీలో టాప్ ట్రెండింగ్‌లో దూసుకుపోతుంది. ఇక ఐఎమ్డీబీ సంస్థ నుంచి పదికి 7.9 రేటింగ్ సొంతం చేసుకుంది చౌర్య పాఠం.
కథతోనే
చౌర్య పాఠంలో ఇంద్ర రామ్, పాయల్ రాధాకృష్ణ, మస్తీ అలీ, సుప్రియ ఐసోల, రాజీవ్ కనకాల తదితరులు నటించారు. స్టార్ల హంగామా, భారీ సెట్టింగుల ఆర్భాటం లేకుండా ఈ సినిమా కథతోనే ఆడియన్స్‌ను కట్టిపడేసింది. కొత్త దర్శకుడు నిఖిల్ గొల్లమారి టేకింగ్ బాగుండటంతో సినిమాపై ఆకట్టుకుంటోంది.
కథలోని నిజాయితీ, నటీనటుల అద్భుతమైన సహజ నటన అలరిస్తోంది. ఈ చిత్రంలో వేదాంత్ రామ్ పాత్రలో కనిపించిన ఇంద్ర రామ్, తొలి సినిమా అయినా బాగా నటించి మెప్పించాడు. చౌర్య పాఠం మూవీలో తన మొదటి సినిమాను నిర్మించాలనే తీవ్రమైన ఆకాంక్షతో, నిధుల కోసం ధనపల్లి అనే గ్రామంలోని బ్యాంకును దోచుకోవడానికి ఒక చిన్న ముఠాతో కలిసి పథకం వేసే దర్శకుడిగా అతడి నటన ఆకట్టుకుంటుంది.
వివిధ భాషల్లో
దొంగతనం చుట్టూ తిరిగే కథే అయినా నిజాయితీ, ధైర్యం, మానవ సంబంధాలలోని సున్నితమైన అంశాలను టచ్ చేస్తూ, ప్రతి ఒక్కరి గుండెను తట్టేలా ఉంది. నక్కిన నరేటివ్స్ బ్యానర్‌పై డైరెక్టర్ త్రినాధరావు నక్కిన, వి. చూడామణి ఈ సినిమాను నిర్మించారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ వంటి ఐదు భాషల్లోనూ అమెజాన్ ప్రైమ్‌లో చౌర్య పాఠం ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper



