చైల్డ్ ఆర్టిస్ట్‌గా 70 సినిమాలు చేశాను.. హీరోగా ఇదే నా మొదటి మూవీ.. నిఖిల్ దేవాదుల కామెంట్స్

బాల నటుడిగా పలు సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్ దేవాదుల హీరోగా ఎంట్రీ ఇస్తున్న సినిమా ఘటికాచలం. హారర్ జోనర్‌లో రూపొందిన ఈ సినిమాకు అమర్ కామెపల్లి దర్శకత్వం వహించారు. రీసెంట్‌గా జరిగిన ఘటికాచలం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో నిఖిల్ దేవాదుల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

May 26, 2025, 06:44:12 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలుగులో అనేక సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా చేసిన నిఖిల్ దేవాదుల హీరోగా నటించిన సినిమా "ఘటికాచలం". ఈ చిత్రానికి కథను అందిస్తూ ఒయాసిస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ ఎం.సి. రాజు నిర్మించారు. "ఘటికాచలం" చిత్రాన్ని ఇంటెన్స్ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందించారు దర్శకుడు అమర్ కామెపల్లి.

చైల్డ్ ఆర్టిస్ట్‌గా 70 సినిమాలు చేశాను.. హీరోగా ఇదే నా మొదటి మూవీ.. నిఖిల్ దేవాదుల కామెంట్స్
చైల్డ్ ఆర్టిస్ట్‌గా 70 సినిమాలు చేశాను.. హీరోగా ఇదే నా మొదటి మూవీ.. నిఖిల్ దేవాదుల కామెంట్స్

ఘటికాచలం ట్రైలర్ లాంచ్

ఈ ఘటికాచలం సినిమాను మాస్ మూవీ మేకర్స్‌పై ప్రముఖ దర్శకుడు మారుతి, సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ ఎస్‌కేఎన్ రిలీజ్ చేస్తున్నారు. ఈ నెల అంటే మే 31న ఘటికాచలం సినిమా థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఘటికాచలం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరోగా ఎంట్రీ ఇస్తోన్ననిఖిల్ దేవాదుల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

హీరోగా మొదటి మూవీ

హీరో నిఖిల్ దేవాదుల మాట్లాడుతూ.. "నేను చైల్డ్ ఆర్టిస్టుగా 70 సినిమాల వరకు చేశాను. ఇది హీరోగా నా మొదటి మూవీ. చాలా ఎఫర్ట్స్ పెట్టి ఘటికాచలం సినిమాకు వర్క్ చేశాం. టెక్నికల్‌గా, స్క్రిప్ట్ పరంగా ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకున్నాం" అని అన్నాడు.

పర్‌ఫెక్ట్ షాట్ వచ్చేవరకు

"ఈ క్యారెక్టర్ నాకు ఛాలెంజింగ్‌గా అనిపించింది. తను ఒక్కో మూడ్‌ను బట్టి ఒక్కోలా బిహేవ్ చేస్తుంటాడు. షాట్ పర్‌ఫెక్ట్‌గా వచ్చేవరకు మా డైరెక్టర్ గారు కాంప్రమైజ్ కాలేదు. ఈ క్యారెక్టర్‌లో పర్‌ఫార్మెన్స్ చూసుకున్నాక సంతృప్తిగా అనిపించింది. మా మూవీ టీజర్‌ను లైక్ చేశారు. ఇప్పుడు ట్రైలర్ కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాం" అని నిఖిల్ దేవాదుల తెలిపాడు.

ఏం చేసిన వాళ్లకోసమే

"ఘటికాచలం చిత్రాన్ని రిలీజ్ చేస్తున్న ఎస్కేఎన్ గారికి, మారుతి గారికి థ్యాంక్స్. నాతో పాటు వర్క్ చేసిన కో ఆర్టిస్టులు అందరికీ థ్యాంక్స్. నా, ఫ్రెండ్స్, మా పేరెంట్స్ ఇక్కడే ఉన్నారు. నేనేం చేసినా వాళ్ల కోసమే. ఘటికాచలం సినిమాను ఈ నెల 31న థియేటర్స్‌లో చూసి సపోర్ట్ చేయాలని కోరుతున్నా" అని హీరో నిఖిల్ దేవాదుల తన స్పీచ్ ముగించాడు.

కంటెంట్ బాగున్న చిత్రాలను

ఇదే ఈవెంట్‌లో నటుడు జోగి నాయుడు మాట్లాడుతూ.. "ఘటికాచలం మంచి కంటెంట్ ఉన్న సినిమా. కంటెంట్ బాగున్న చిత్రాలను తెలుగు ఆడియెన్స్ తప్పకుండా ఆదరిస్తారు. ఈ చిత్రంలో నేనొక చిన్న రోల్ చేశాను. పాత్ర చిన్నదైనా నాకు మంచి గుర్తింపు దక్కుతుందని ఆశిస్తున్నా. ఈ నెల 31న థియేట్రికల్ రిలీజ్‌కు వస్తున్న ఘటికాచలం చిత్రాన్ని మీరంతా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా" అని అన్నారు.

నాలుగో తెలుగు సినిమా

"తెలుగులో నేను చేసిన నాలుగవ చిత్రమిది. ఆఫీసర్, ఓమ్ బీమ్ భుష్, తండేల్ చిత్రాల్లో నన్ను తెలుగు ఆడియెన్స్ ఆదరించారు. ఘటికాచలం సినిమాలో మంచి క్యారెక్టర్ చేశాను. ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన డైరెక్టర్ అమర్ గారికి థ్యాంక్స్" అని యాక్టర్ షాన్ తెలిపారు.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More