జాన్వీతో ఒక సినిమా చేస్తాను.. ఆమెను చూస్తే సౌందర్య గుర్తుకొచ్చింది.. మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్

మెగాస్టార్ చిరంజీవి జాన్వీతో ఒక సినిమా చేస్తాను అని నవ్వుతూ చెప్పారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున, రష్మిక మందన్నా నటించిన కుబేర సక్సెస్ మీట్‌ను రీసెంట్‌గా నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా పాల్గొన్న చిరంజీవి ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు.

Published on: Jun 23, 2025 1:30 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న నటించిన కుబేర సక్సెస్ మీట్‌ను రీసెంట్‌గా నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన మెగాస్టార్ చిరంజీవి ఇంట్రెస్టింగ్ విశేషాలు పంచుకున్నారు.

జాన్వీతో ఒక సినిమా చేస్తాను.. ఆమెను చూస్తే సౌందర్య గుర్తుకొచ్చింది.. మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్
జాన్వీతో ఒక సినిమా చేస్తాను.. ఆమెను చూస్తే సౌందర్య గుర్తుకొచ్చింది.. మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్

సౌందర్య గుర్తుకొచ్చింది

"కుబేర సినిమాలో ప్రతి ఒక్కరికి న్యాయం జరిగింది. రష్మిక ఫెంటాస్టిక్‌గా పర్ఫార్మ్ చేసింది. తన ఫస్ట్ సినిమా వచ్చినప్పుడు నేను గెస్ట్‌గా వచ్చాను. తను నేషనల్ కాదు ఇంటర్నేషనల్ క్రష్ అయిపోయింది. తన క్యారెక్టర్‌లో ఇంటెన్సిటీ ఈ సినిమాలో కనిపించింది" అని చిరంజీవి అన్నారు.

"కుబేర సినిమాలో సమీరా క్యారెక్టర్ చూసినప్పుడు చూడాలని ఉంది మూవీలో సౌందర్య గుర్తుకొచ్చింది. ఈ సినిమా మొత్తంలో తన క్యారెక్టర్ ట్రాన్స్‌ఫర్మేషన్ అద్భుతంగా ఉంది. ఈ సినిమాలో హృదయానికి హత్తుకుపోయిన క్యారెక్టర్ దేవ. ఈ క్యారెక్టర్‌ని ధనుష్ తప్ప ఇంకెవరూ చేయలేరు. అంత స్టార్ ఇమేజ్ ఉండి ఇలాంటి క్యారెక్టర్ చేయగలిగే యాక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది ఇండియాలో ధనుష్ ఒక్కరే. అంత నేచురల్‌గా క్యారెక్టర్‌లో ఇమిడిపోయారు" అని చిరు తెలిపారు.

నేషనల్ అవార్డుకు అర్థమే లేదు

"ఈ సినిమాతో తనకి (ధనుష్) బెస్ట్ యాక్టర్ అవార్డు రావాలి. తనకు అడ్వాన్స్ కంగ్రాజులేషన్స్ చెప్తున్నాను. ఆయనకు రాకపోతే అసలు నేషనల్ అవార్డు అనే దానికి అర్థమే లేదు. తనకి ఈ సినిమాకి అవార్డు వస్తే కనుక ప్రతి ఒక్కరికి గర్వకారణం" అని చిరంజీవి అభిప్రాయపడ్డారు.

"నిర్మాత సునీల్ గారి నాన్న గారు నారాయణ దాస్ చాలా హానెస్ట్ పర్సన్. ఈ సినిమా బిజినెస్‌లో అంత నిజాయితీగా ఉండే వ్యక్తులు మరొకరు లేరు. ఆయన వారసులుగా సునీల్, థర్డ్ జనరేషన్ లో జాన్వీ (నిర్మాత జాహ్నవి నారంగ్) ముందుకు వెళ్లడం అనేది చాలా ఆనందంగా ఉంది. జాన్వీతో ఒక సినిమా చేస్తాను (నవ్వుతూ). వారు కుబేర లాంటి మరెన్నో సక్సెస్‌ఫుల్ సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను" అని చిరు చెప్పారు.

యంగ్‌స్టర్స్ రావాలి

"డిఓపి నికేత్ ఫెంటాస్టిక్ జాబ్. సినిమా చాలా రిచ్‌గా ఉంది. ఇక్కడ యంగ్‌స్టర్స్‌ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఇండస్ట్రీ ముందుకు వెళ్లాలంటే ఇలాంటి యంగ్‌స్టర్స్ ముందుకు రావాలి. ఇదే ఎనర్జీతో ఇండస్ట్రీ కళకళలాడాలని కోరుకుంటున్నాను" అని మెగాస్టార్ కోరారు.

"దేవి శ్రీ ప్రసాద్ నా బిడ్డ లాంటివాడు. నా కమ్ బ్యాక్‌లో కూడా అద్భుతమైన ఆల్బమ్స్ ఇచ్చాడు. తన ఎనర్జీ డే బై డే పెరిగిపోతుంది. దేశం మొత్తం తనని కీర్తిస్తోంది. సినిమా చాలా మ్యూజికల్‌గా ఉంది. దేవి శ్రీ రికార్డింగ్‌లో అద్భుతం చేశాడు. ఇందులో తల్లి మీద పాడిన పాట ఖైదీ 150లో నీరు నీరు పాటని మైమరిపించే లాగా అనిపించింది. ఈ సినిమాలో పనిచేసిన అందరికీ పేరుపేరునా అభినందనలు తెలియజేస్తున్నాను" అని చిరంజీవి తెలిపారు.

గగనం అయిపోతున్నాయి

"ఇలాంటి సినిమాలు రావాలి. సినిమా సక్సెస్ గగనం అయిపోతున్న రోజులువి. థియేటర్స్‌కి ఆడియన్స్ రప్పించడం గగనం అయిపోతున్న రోజులు ఇవి. ఇలాంటి సమయంలో ఇలాంటి కంటెంట్ ఉంటే ఆడియన్స్ థియేటర్స్‌కి వస్తారని భరోసా కల్పించిన సినిమా ఇది. ఈ క్రెడిట్ శేఖర్ కమ్ములకే దక్కుతుంది" అని చిరంజీవి పేర్కొన్నారు.

"కంటెంట్ బాగుంటే హ్యూమన్ ఎమోషన్స్‌ని టచ్ చేయగలిగితే ఆడియన్స్ థియేటర్స్‌కి వస్తారని కుబేర సినిమా నిరూపించింది. టీమ్‌కి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. లవ్ యు ఆల్" అని తన స్పీచ్ ముగించారు చిరంజీవి.

News/Entertainment/జాన్వీతో ఒక సినిమా చేస్తాను.. ఆమెను చూస్తే సౌందర్య గుర్తుకొచ్చింది.. మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్
News/Entertainment/జాన్వీతో ఒక సినిమా చేస్తాను.. ఆమెను చూస్తే సౌందర్య గుర్తుకొచ్చింది.. మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్