ప్రభాస్ స్పిరిట్ మూవీలో చిరంజీవి నటిస్తున్నాడా? క్లారిటీ ఇచ్చేసిన సందీప్ రెడ్డి వంగా
ప్రభాస్ స్పిరిట్ మూవీలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నాడా? కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్తలపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా స్పందించాడు. అలాంటిదేమీ లేదని స్పష్టం చేశాడు.
ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ స్పిరిట్. ఈ సినిమా నుంచి ఈ మధ్యే ఓ ఆడియో అప్డేట్ కూడా సందీప్ రిలీజ్ చేశాడు. అయితే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నాడని వస్తున్న వార్తలను మాత్రం అతడు ఖండించాడు. అందులో నిజం లేదని స్పష్టం చేశాడు.

చిరంజీవితో వేరే మూవీ చేస్తా
ప్రభాస్ లీడ్ రోల్లో నటిస్తున్న స్పిరిట్ మూవీలో చిరంజీవి నటించడం లేదని డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా వెల్లడించాడు. అవన్నీ ఉత్త పుకార్లే అని తేల్చి చెప్పాడు. ప్రభాస్ తండ్రి పాత్రగానీ, వేరే ఇతర ఏ పాత్రా చిరంజీవి పోషించడం లేదని సందీప్ తెలిపాడు. అయితే తాను చిరుతో కలిసి వేరే మూవీ చేస్తానని మాత్రం అతడు స్పష్టం చేశాడు. మరోవైపు స్పిరిట్ మూవీలో కొరియన్ యాక్టర్ డాన్ లీ విలన్ పాత్ర పోషించబోతున్నాడని కూడా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే దీనిపై మాత్రం సందీప్ స్పందించలేదు. దీంతో అతడు ఈ సినిమాలో నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
'స్పిరిట్' మూవీ గురించి..
‘స్పిరిట్’ ప్రభాస్ ప్రధాన పాత్రలో ఉన్న ఒక పోలీస్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో త్రిప్తి డిమ్రి, ప్రకాష్ రాజ్, వివేక్ ఒబెరాయ్ కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ నెల ప్రారంభంలో ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సినిమా 'సౌండ్ స్టోరీ'ని పంచుకున్నాడు. ఈ ఆడియో టీజర్ ప్రభాస్ వాయిస్ ద్వారా 'స్పిరిట్' ప్రపంచాన్ని పరిచయం చేసింది.
కానీ కథాంశం గురించి పెద్దగా వెల్లడించలేదు. ఈ చిత్రం 2026లో థియేటర్లలో విడుదల కానుంది. ఫిబ్రవరిలో సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అయితే స్క్రిప్ట్ సమయంలోనే బీజీఎం గురించి కూడా స్పష్టంగా చెప్పేసే సందీప్ రెడ్డి వంగా.. ఈ స్పిరిట్ మూవీ విషయంలో మాత్రం మరో అడుగు ముందుకేసి మొత్తం డైలాగ్స్ వెర్షన్ ను షూటింగ్ ప్రారంభం కాకముందే రికార్డ్ చేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.
ఆర్జీవీ కా బాప్ సందీప్
ఇక శివ మూవీ రీరిలీజ్ ప్రమోషన్లలో భాగంగా నాగార్జున, ఆర్జీవీతో కలిసి ఓ ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి వంగా కనిపించాడు. ఈ సందర్భంగా ప్రముఖ దర్శకుడు రాజమౌళి తనతో సందీప్ గురించి చేసిన కామెంట్స్ గురించి ఆర్జీవీ వెల్లడించాడు.
ఆర్జీవీలాంటి వాళ్లు ఎప్పుడో ఓసారి వస్తారని మొదట రాజమౌళి అన్నాడు.. అయితే యానిమల్ మూవీ చూసిన తర్వాత నాకు ఫోన్ చేసి సందీప్ ని నీతో పోల్చాను.. అది తప్పే.. అతడు ఆర్జీవీ కా బాప్ అని అన్నాడు అని ఆర్జీవీ చెప్పడంతో పక్కనే ఉన్న సందీప్ నవ్వుతూ కనిపించాడు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


