క్రిస్టొఫర్ నోలన్ ది ఒడిస్సీ ట్రైలర్ వచ్చేసింది.. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్.. గ్రీక్ వీరుడి స్టోరీతో..

హాలీవుడ్‌లో ఫెయిల్యూర్ ఎరగని డైరెక్టర్ క్రిస్టొఫర్ నోలన్ తాజాగా ది ఒడిస్సీ మూవీతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సోమవారం (డిసెంబర్ 22) ట్రైలర్ రిలీజ్ చేయగా.. వచ్చే ఏడాది జులైలో మూవీని రిలీజ్ చేయబోతున్నారు.

Published on: Dec 22, 2025, 21:13:34 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

'ఓపెన్‌హైమర్' మూవీతో ఆస్కార్ గెలుచుకున్న లెజెండరీ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్.. తన నెక్ట్స్ భారీ బడ్జెట్ మూవీ 'ది ఒడిస్సీ' (The Odyssey) ట్రైలర్‌ను విడుదల చేశాడు. గ్రీకు పురాణాల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మ్యాట్ డామన్, టామ్ హాలండ్, యాన్ హాత్వే వంటి స్టార్ నటీనటులు నటిస్తున్నారు. వచ్చే ఏడాది జులైలో ఈ సినిమా విడుదల కానుంది.

క్రిస్టొఫర్ నోలన్ ది ఒడిస్సీ ట్రైలర్ వచ్చేసింది.. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్.. గ్రీక్ వీరుడి స్టోరీతో..
క్రిస్టొఫర్ నోలన్ ది ఒడిస్సీ ట్రైలర్ వచ్చేసింది.. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్.. గ్రీక్ వీరుడి స్టోరీతో..

ది ఒడిస్సీ ట్రైలర్ రిలీజ్

క్రిస్టోఫర్ నోలన్ మూవీ వస్తుందంటే చాలు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఇప్పటి వరకూ ఇంటర్‌స్టెల్లార్, ఇన్‌సెప్షన్, డన్‌కిర్క్, ఓపెన్‌హైమర్ లాంటి సినిమాలను అతడు అందించాడు. అసలు ఫెయిల్యూర్ తెలియని డైరెక్టర్.

అలాంటి క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కిస్తున్న కొత్త సినిమా 'ది ఒడిస్సీ' మొదటి ట్రైలర్ విడుదలైంది. 'ఓపెన్‌హైమర్' (Oppenheimer) ఘనవిజయం తర్వాత నోలన్ చేపట్టిన ప్రాజెక్ట్ కావడంతో దీనిపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

ది ఒడిస్సీ ట్రైలర్ ఎలా ఉందంటే?

రెండు నిమిషాల నిడివి గల ఈ ట్రైలర్ ప్రేక్షకులను అద్భుతమైన గ్రీకు పురాణ ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ట్రోజన్ యుద్ధం (Trojan War) ముగిసిన తర్వాత గ్రీకు వీరుడు ఒడిస్సియస్ (మ్యాట్ డామన్) తన సైన్యంతో ఇంటికి తిరిగి వెళ్ళే ప్రయాణమే ఈ కథ.

యుద్ధంలో నరకం చూసిన వారికి.. తిరుగు ప్రయాణం కూడా అంత సులభంగా ఉండదని.. రాక్షసులు, విధి ఆడే వింత నాటకాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ట్రైలర్లో చూపించారు. నోలన్ మార్క్ భారీ విజువల్స్, యుద్ధ సన్నివేశాలు కళ్లు చెదిరేలా ఉన్నాయి.

హాలీవుడ్ స్టార్ నటీనటులు ఈ సినిమాలో భాగమయ్యారు. మ్యాట్ డామన్ ఇందులో వీరుడు ఒడిస్సియస్ పాత్రలో నటించాడు. ఇక యాన్ హాత్వే ఒడిస్సియస్ భార్య పెనెలోప్‌గా కనిపించనుంది. టామ్ హాలండ్ వీరి కుమారుడు టెలిమాకస్ పాత్రలో నటించగా.. జెండయా, రాబర్ట్ ప్యాటిన్సన్ కూడా ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ది ఒడిస్సీ రిలీజ్ ఎప్పుడు?

యూనివర్సల్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ ది ఒడిస్సీ మూవీని.. జులై 17, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఇప్పుడే అడ్వాన్స్ బుకింగ్స్ కోసం టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. తాజాగా రిలీజైన ట్రైలర్ పై ఫ్యాన్స్ ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు.

"మా జనరేషన్‌లో అత్యంత ప్రభావవంతమైన దర్శకుడు నోలన్. ఈ సినిమా కోసం వెయిట్ చేయలేకపోతున్నాం" అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. "థియేటర్లో సినిమా చూడటానికి ఇప్పుడే వెళ్లి కూర్చున్నాను.. వాళ్ళు నన్ను బయటకు గెంటేశారు" అని ఒక నెటిజన్ ఫన్నీగా యూట్యూబ్‌లో రాసుకొచ్చారు. హోమర్ (Homer) రాసిన ప్రముఖ నవల 'ది ఒడిస్సీ' ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More