The Odyssey Twitter review: ఎన్ని ఆస్కార్లు ఇచ్చినా తక్కువే.. క్లైమాక్స్ చూస్తే మైండ్ బ్లాక్: ది ఒడిస్సీ ట్విటర్ రివ్యూ

The Odyssey Twitter review: క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ది ఒడిస్సీ మూవీ చూసి ఫ్యాన్స్ మైండ్ బ్లాక్ అవుతోంది. ఎక్స్ (ట్విటర్) ద్వారా తమ రివ్యూలు షేర్ చేస్తూ.. ఈ సినిమాకు ఆస్కార్స్ ఖాయమని, బెస్ట్ ఎవర్ మూవీ అని ప్రశంసలు కురిపిస్తున్నారు.

Published on: Jul 17, 2026, 17:26:36 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

The Odyssey Twitter review: క్రిస్టోఫర్ నోలన్ నుంచి కొత్త సినిమా వస్తోందంటేనే వరల్డ్ సినిమా ఉత్సాహంతో ఊగిపోతుంది. ఆయన లేటెస్ట్ విజువల్ స్పెక్టకిల్ 'ది ఒడిస్సీ' (The Odyssey) థియేటర్లలోకి వచ్చి రాగానే బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనం సృష్టిస్తోంది. రాటెన్ టొమాటోస్‌లో 99% క్రిటిక్స్ స్కోర్, 96% ఆడియన్స్ స్కోర్‌తో ఈ సినిమా సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

The Odyssey Twitter review: ఎన్ని ఆస్కార్లు ఇచ్చినా తక్కువే.. క్లైమాక్స్ చూస్తే మైండ్ బ్లాక్: ది ఒడిస్సీ ట్విటర్ రివ్యూ
The Odyssey Twitter review: ఎన్ని ఆస్కార్లు ఇచ్చినా తక్కువే.. క్లైమాక్స్ చూస్తే మైండ్ బ్లాక్: ది ఒడిస్సీ ట్విటర్ రివ్యూ

క్లైమాక్స్ విజువల్స్ కి పిచ్చెక్కిపోతున్న ఆడియన్స్

'ది ఒడిస్సీ' చూసిన ఆడియన్స్ ట్విట్టర్ (X) వేదికగా తమ రివ్యూలను షేర్ చేస్తున్నారు. ముఖ్యంగా మూవీ థర్డ్ యాక్ట్, క్లైమాక్స్ విజువల్స్ చూసి ప్రేక్షకులు షాక్ అవుతున్నారు. నోలన్ కెరీర్‌లోనే ఇది అత్యద్భుతమైన, ఎంతో హైప్ క్రియేట్ చేసిన క్లైమాక్స్ అని ఫ్యాన్స్ చెబుతున్నారు.

ప్రతి సీన్ మేకింగ్, అత్యద్భుతమైన విజువల్స్ థియేటర్లలో విపరీతమైన గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయని టాక్. మొదటి షోల నుంచే వర్డ్ ఆఫ్ మౌత్ పాజిటివ్‌గా రావడంతో సినిమాకు భారీ ఓపెనింగ్స్ నమోదవుతున్నాయి.

హోమర్ ఇతిహాసానికి ఎమోషనల్ టచ్

హోమర్ రాసిన ప్రాచీన గ్రీకు ఇతిహాసం ఆధారంగా క్రిస్టోఫర్ నోలన్ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ట్రోజన్ వార్ తర్వాత తన సొంత రాజ్యమైన ఇథాకాకి తిరిగి వెళ్లడానికి కింగ్ ఒడిసియస్ (మ్యాట్ డామన్) చేసిన 10 ఏళ్ల సుదీర్ఘమైన, ప్రమాదకరమైన పోరాటమే ఈ కథ.

కేవలం రాక్షసులు, మైథలాజికల్ క్రియేచర్స్‌తో చేసే అడ్వెంచరస్ ఫైట్స్ మాత్రమే కాకుండా, కథలో ఉన్న ఎమోషనల్ డెప్త్ ప్రతీ ఒక్కరినీ కట్టిపడేస్తోంది. ఒక వైభవోపేతమైన నాగరికత కూలిపోతున్నప్పుడు కలిగే బాధను నోలన్ చాలా హృద్యంగా ఆవిష్కరించారు.

మ్యాట్ డామన్, టామ్ హాలండ్ పర్ఫార్మెన్స్ పీక్స్

మ్యాట్ డామన్ కింగ్ ఒడిసియస్ క్యారెక్టర్‌లో జీవించేశారని నెటిజన్లు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఒడిసియస్, ఆయన భార్య పెనెలోప్ (ఆన్ హాత్వే) మధ్య వచ్చే ఒక సీన్ ఐకానిక్ అని, నోలన్ ఫిల్మోగ్రఫీలోనే మోస్ట్ ఎమోషనల్ సీన్ ఇదని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

మరోవైపు ఒడిసియస్ కొడుకు టెలిమాకస్ పాత్రలో టామ్ హాలండ్ తన క్యారెక్టర్ వేరియేషన్స్ తో మెప్పించాడు. తండ్రి లేని లోటులో పెరిగి, తండ్రి కథలను వింటూ తానూ ఒక పవర్ ఫుల్ వ్యక్తిని అని ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేసే క్యారెక్టర్‌లో టామ్ హాలండ్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని ఆడియన్స్ ప్రశంసిస్తున్నారు.

ఆస్కార్ రేసులో నిలవడం ఖాయమంటున్న ఫ్యాన్స్

ఆస్కార్ విన్నర్ మ్యూజిక్ డైరెక్టర్ లుడ్విగ్ గోరాన్సన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్‌లో ఉందంటున్నారు. థియేటర్లలో ఆయన ఇచ్చిన బీజీఎం ప్రతీ సీన్‌ను ఎలివేట్ చేశాయని ఆడియన్స్ కొనియాడుతున్నారు.

'ఇప్పటి నుంచే ఆస్కార్ లను ఒక పక్కన తీసి ఉంచండి' అని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అకాడమీ అవార్డ్స్‌లో ది ఒడిస్సీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని ఆడియన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

భారీ స్టార్ కాస్టింగ్.. నోలన్ విజన్

ఈ సినిమాలో రాబర్ట్ ప్యాటిన్సన్, జెండయా, లుపిటా న్యోంగో, చార్లిజ్ థెరాన్, సమంతా మోర్టన్ లాంటి హాలీవుడ్ టాప్ స్టార్స్ కీలక పాత్రల్లో నటించారు. అసలు తాము ఏ రోల్స్ చేస్తున్నామో కూడా తెలియకుండానే కేవలం క్రిస్టోఫర్ నోలన్ విజన్‌పై ఉన్న నమ్మకంతో వీళ్లంతా ఈ ప్రాజెక్ట్‌కి సైన్ చేయడం విశేషం.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More