Chuttamalle Song Lyrics: చుట్టమల్లే చుట్టేస్తాందె తుంటరి చూపు.. దేవర సెకండ్ సింగిల్ లిరిక్స్ ఇవే

Chuttamalle Song Lyrics: దేవర నుంచి వచ్చిన సెకండ్ సింగిల్ చుట్టమల్లే చుట్టేస్తాందే సాంగ్ ఇన్‌స్టాంట్ హిట్ గా నిలిచింది. ఈ రొమాంటిక్ మెలోడియస్ సాంగ్ మైమరిపిస్తోంది. మరి ఆ సాంగ్ లిరిక్స్ ఇక్కడ చూసేయండి.

Published on: Aug 5, 2024, 21:29:08 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Chuttamalle Song Lyrics: జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ నటించిన దేవర మూవీ నుంచి చుట్టమల్లే చుట్టేస్తాందె అంటూ సాగిపోయే సెకండ్ సింగిల్ సోమవారం (ఆగస్ట్ 5) రిలీజైన విషయం తెలిసిందే. ఈ పాటలో అందరి కళ్లూ తారక్, జాన్వీ మీద ఉండగా.. బ్యాక్‌గ్రౌండ్లో వచ్చే లిరిక్స్, మ్యూజిక్ కూడా ఎంతో ఆకట్టుకునేలా ఉన్నాయి.

చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు.. దేవర సెకండ్ సింగిల్ లిరిక్స్ ఇవే
చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు.. దేవర సెకండ్ సింగిల్ లిరిక్స్ ఇవే

చుట్టమల్లే సాంగ్ లిరిక్స్

తన కలల రాకుమారుడి కోసం ప్రతి అమ్మాయి పాడుకునేలా ఉన్న ఈ చుట్టమల్లే చుట్టేస్తాందె సాంగ్ లిరిక్స్ ఇక్కడ ఇస్తున్నాం. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించిన ఈ పాటను బాలీవుడ్ సింగర్ శిల్పా రావ్ పాడగా.. రామజోగయ్య శాస్త్రి రాశాడు. ఎన్టీఆర్, జాన్వీ జోడీ తెరపై ఎంతో అందంగా కనిపిస్తోంది.

ఈ సినిమా ద్వారానే తొలిసారి తెలుగులోకి అడుగుపెడుతున్న జాన్వీ.. తన తల్లి శ్రీదేవిలాగే అందంతో ఇక్కడి ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉందని ఈ పాట చూస్తే తెలుస్తోంది. దేవర మూవీ నుంచి వచ్చిన ఈ సెకండ్ సింగిల్ ఇన్‌స్టాంట్ హిట్ గా నిలిచింది. ఈ పాట తెగ ట్రెండ్ అవుతోంది. తారక్, జాన్వీ కెమెస్ట్రీ చూసి ఒకప్పటి ఎన్టీఆర్, శ్రీదేవి జోడికి గుర్తుకు వస్తోందంటూ కొందరు కామెంట్ చేయడం విశేషం. ఈ దేవర పార్ట్ 1 మూవీ సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది. మరి ఈ చుట్టమల్లె సాంగ్ లిరిక్స్ ఇక్కడ చూసేయండి.

లిరిక్స్ ఇవే..

చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు

ఊరికే ఉండదు కాసేపూ....

అస్తమానం నీ లోకమే నా మైమరపు

చేతనైతే నువ్వే నన్నాపు

రా నా నిద్దర కులాసా నీ కలలకిచ్చేశా

నీ కోసం వయసు వాకిలి కాశా....

రా నా ఆశలు పోగేశా నీ గుండెకు అచ్చేశా

నీ రాకకు రంగం సిద్ధం చేశా

ఎందుకు పుట్టిందో పుట్టింది

ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది

పుడతానే నీ పిచ్చి పట్టింది

నీపేరు పెట్టింది.. వయ్యారం

ఓణీ కట్టింది గోరింట పెట్టింది

సామికి మొక్కులు కట్టింది

చుట్టమల్లే చుట్టేస్తాంది.. హా చుట్టేస్తాంది.. చుట్టమల్లే చుట్టేస్తాంది..

చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు

ఊరికే ఉండదు కాసేపూ....

మత్తుగా మెలేసింది నీ వరాల మగసిరి

హత్తుకోలేవా మరి సరసన చేరీ..

వాస్తుగా పెంచానిట్టా వందకోట్ల సొగసిరి

ఆస్తిగా అల్లేసుకో కొసరి కొసరీ..

చెయ్యరా ముద్దుల దాడి

ఇష్టమేలే నీ సందడి

ముట్టడించి ముట్టేసుకోలేవ

ఓసారి చెయిజారి

రా ఏ బంగరు నక్లీసు.. నా ఒంటికి నచ్చట్లే

నీ కౌగిలితో నను సింగారించు

రా ఏ వెన్నెల జోలాలి నను నిద్దర పుచ్చట్లే

నా తిప్పలు కొంచెం ఆలోచించు

ఎందుకు పుట్టిందో పుట్టింది

ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది

పుడతానే నీ పిచ్చి పట్టింది

నీపేరు పెట్టింది వయ్యారం

ఓణీ కట్టింది గోరింట పెట్టింది

సామికి మొక్కులు కట్టింది

చుట్టమల్లే చుట్టేస్తాంది.. హా చుట్టేస్తాంది.. చుట్టమల్లే చుట్టేస్తాంది..

చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు

ఊరికే ఉండదు కాసేపూ....

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More