అమ్మవారి కథతో చండీ దుర్గమా.. ముఖ్య అతిథిగా కమెడియన్ అలీ.. సౌందర్య అమ్మోరు తర్వాత అంటూ డైరెక్టర్ మైను ఖాన్ కామెంట్స్

టాలీవుడ్‌లో అమ్మవారి కథతో తెరకెక్కుతోన్న కొత్త సినిమా చండీ దుర్గమా. ఈ సినిమాకు డైరెక్టర్ మైను ఖాన్ దర్శకత్వం వహించారు. ఇవాళ (జూన్ 9) చండీ దుర్గమా సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కమెడియన్ అలీ విచ్చేశారు. ఈ సందర్భంగా అలీ, మైను ఖాన్ కామెంట్స్ చేశారు.

Published on: Jun 9, 2025, 17:03:02 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మంచి ఆర్టిస్టులతో పాటు నూతన నటీనటులను పరిచయం చేస్తూ హెచ్ బీజే క్రియేషన్స్, మదర్ అండ్ ఫాదర్ పిక్చర్స్ నిర్మిస్తున్న సినిమా చండీ దుర్గమా. ఈ సినిమాకు జయశ్రీ వెల్ది నిర్మాత. ఒలి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. చండీ దుర్గమా సినిమాకు మైను ఖాన్ ఎండీ దర్శకత్వం వహిస్తున్నారు.

అమ్మవారి కథతో చండీ దుర్గమా.. ముఖ్య అతిథిగా కమెడియన్ అలీ.. సౌందర్య అమ్మోరు తర్వాత అంటూ డైరెక్టర్ మైను ఖాన్ కామెంట్స్
అమ్మవారి కథతో చండీ దుర్గమా.. ముఖ్య అతిథిగా కమెడియన్ అలీ.. సౌందర్య అమ్మోరు తర్వాత అంటూ డైరెక్టర్ మైను ఖాన్ కామెంట్స్

ముఖ్య అతిథిగా అలీ

చండీ దుర్గమా సినిమా పూజా కార్యక్రమాలతో ఈ రోజు (జూన్ 9) హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. ప్రముఖ కమెడియన్ అలీ ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ ఇచ్చారు. నటుడు చిట్టి కెమెరా స్విచ్ ఆన్ చేయగా, ముహూర్తపు సన్నివేశానికి రఘు కారుమంచి దర్శకత్వం వహించారు.

ఈ సందర్భంగా కమెడియన్ అలీ మాట్లాడుతూ.. "చండీ దుర్గమా సినిమా ప్రారంభోత్సవానికి అతిథిగా రావడం సంతోషంగా ఉంది. అమ్మవారి కథతో వస్తున్న సినిమా కాబట్టి మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా. ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. సినిమా కూడా ప్రేక్షకుల ఆదరణ పొందాలి. ప్రొడ్యూసర్ జయశ్రీ గారికి, డైరెక్టర్ మైను ఖాన్‌తో సహా టీమ్ అందరికీ మంచి పేరు తీసుకువస్తుందని ఆశిస్తున్నా. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్" అని అన్నారు.

అమ్మోరు, చండీ తర్వాత

డైరెక్టర్ మైను ఖాన్ ఎండీ మాట్లాడుతూ.. "ఈ రోజు మా చండీ దుర్గమా చిత్ర ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చి క్లాప్ కొట్టిన అలీ గారికి థ్యాంక్స్ చెబుతున్నాం. రఘు కారుమంచి, చిట్టి కూడా మాకు సపోర్ట్ చేసేందుకు ఇక్కడికి రావడం సంతోషంగా ఉంది" అని అన్నారు.

"ఇటీవల అమ్మవారి నేపథ్యంగా సినిమాలు రూపొందడం లేదు. సౌందర్య గారి అమ్మోరు, విజయశాంతి గారి చండీ సినిమా తర్వాత అమ్మవారి కథతో సినిమా రాలేదు. ఇప్పటి ట్రెండ్‌కు అనుగుణంగా, ఈతరం ప్రేక్షకులకు నచ్చేలా డార్క్ థీమ్‌లో సరికొత్త స్క్రీన్ ప్లే, కాన్సెప్ట్‌తో చండీ దుర్గమా చిత్రాన్ని రూపొందిస్తున్నాం" అని డైరెక్టర్ మైను ఖాన్ తెలిపారు.

థియేటర్స్‌కు రప్పించేలా

"ప్రస్తుతం థియేటర్స్‌కు ప్రేక్షకులు రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో థియేటర్స్‌కు ఆడియెన్స్‌ను రప్పించేలా చండీ దుర్గమా సినిమా మేకింగ్‌ను డిజైన్ చేస్తున్నాం. కో ప్రొడ్యూసర్ ఒలీ గారు చెప్పిన ఒక పాయింట్ ఆధారంగా ఈ చిత్ర కథను నేను రాశాను. ఇటీవల కాలంలో ఇలాంటి కాన్సెప్ట్ రాలేదు. చండీ దుర్గమా సినిమా ఒక మాస్టర్ పీస్ అవ్వాలని కోరుకుంటున్నా" అని దర్శకుడు మైను ఖాన్ ఆశించారు.

అలాగే, నిర్మాత జయశ్రీ వెల్ది మాట్లాడుతూ.. "అమ్మవారినేపథ్యంతో ఒక మంచి కథతో చండీ దుర్గమా సినిమాను నిర్మించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. మన తెలుగు ఆడియెన్స్ అమ్మవారి నేపథ్యంగా వచ్చిన చిత్రాలను ఎంతో ఆదరించారు. మా సినిమాకు కూడా అలాంటి సక్సెస్ ఇస్తారని ఆశిస్తున్నాం. హై క్వాలిటీ మేకింగ్‌తో మంచి ప్యాడింగ్ ఆర్టిస్టులు, ప్రతిభ గల కొత్త నటీనటులతో చండీ దుర్గమా సినిమాను మీ ముందుకు తీసుకొస్తాం" అని వెల్లడించారు.

విజువల్స్ పరంగా

"చండీ దుర్గమా సినిమా ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. మా మూవీని విజువల్స్ పరంగా కొత్తగా స్క్రీన్ మీద ప్రెజెంట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. మీ అందరి సపోర్ట్ ఉంటుందని నమ్ముతున్నాం" అని సినిమాటోగ్రాఫర్ వైఎస్ కృష్ణ పేర్కొన్నారు.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More