నాలుగేళ్లపాటు కామెడీ నుంచి బ్రేక్ తీసుకున్న పాపులర్ కమెడియన్.. హైదరాబాద్ షోలోనే అనౌన్స్‌మెంట్.. కారణం ఇదే

ప్రముఖ స్టాండ్-అప్ కమెడియన్ జాకీర్ ఖాన్ కామెడీ నుంచి సుదీర్ఘ విరామం తీసుకోనున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్‌లో జరిగిన తన లైవ్ షోలో ఈ విషయాన్ని వెల్లడిస్తూ, ఆరోగ్యం, వ్యక్తిగత కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ బ్రేక్ 2030 వరకు కూడా ఉండొచ్చని చెప్పడంతో ఫ్యాన్స్ ఆవేదన చెందుతున్నారు.

Published on: Jan 20, 2026, 22:27:04 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

"సక్త్ లౌండా"గా (Sakht Launda) యువతలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న స్టాండ్-అప్ కమెడియన్ జాకీర్ ఖాన్ తన అభిమానులకు ఒక బ్యాడ్ న్యూస్ చెప్పాడు. తన కామెడీ ప్రదర్శనలకు చాలా కాలం పాటు విరామం ప్రకటించారు. ప్రస్తుతం తన ‘పాపా యార్’ టూర్‌లో భాగంగా హైదరాబాద్‌లో నిర్వహించిన షోలో అతడు ఈ విషయాన్ని వెల్లడించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నాలుగేళ్లపాటు కామెడీ నుంచి బ్రేక్ తీసుకున్న పాపులర్ కమెడియన్.. హైదరాబాద్ షోలోనే అనౌన్స్‌మెంట్.. కారణం ఇదే
నాలుగేళ్లపాటు కామెడీ నుంచి బ్రేక్ తీసుకున్న పాపులర్ కమెడియన్.. హైదరాబాద్ షోలోనే అనౌన్స్‌మెంట్.. కారణం ఇదే

3 నుంచి 5 ఏళ్లు బ్రేక్..

హైదరాబాద్‌లోని ఆడిటోరియం కిక్కిరిసి ఉండగా కమెడియన్ జాకీర్ ఖాన్ మైక్ పట్టుకుని ఎమోషనల్ అయ్యారు. "నా ఆరోగ్యాన్ని చూసుకోవడానికి, కొన్ని వ్యక్తిగత పనులను చక్కబెట్టుకోవడానికి నేను 3, 4 లేదా 5 ఏళ్లు బ్రేక్ తీసుకుంటున్నాను. అంటే నేను మళ్లీ 2028, 2029 లేదా 2030లో తిరిగి రావచ్చు. ఈ రోజు ఇక్కడ ఉన్న మీరందరూ నాకు చాలా ప్రత్యేకం. మీ అందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటాను" అని జాకీర్ పేర్కొన్నారు.

అసలు కారణం ఏంటి?

గత కొన్నేళ్లుగా విరామం లేకుండా టూర్లు, ప్రదర్శనలు ఇవ్వడం వల్ల తన ఆరోగ్యం దెబ్బతిన్నట్లు జాకీర్ గతంలోనే (గతేడాది సెప్టెంబర్‌లో) తెలిపారు. నిద్రలేని రాత్రులు, సరిగ్గా భోజనం లేకపోవడం, వరుస ప్రయాణాలు తనపై తీవ్ర ప్రభావం చూపాయని చెప్పారు. దాదాపు ఏడాది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నా, స్టేజ్ మీద ఉన్న ప్రేమతో షోలు చేస్తూ వచ్చానని, కానీ ఇప్పుడు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయలేనని ఆయన స్పష్టం చేశారు.

జూన్ 20 వరకే..

తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందిస్తూ.. జూన్ 20 వరకు ఉన్న కమిట్‌మెంట్స్ అన్నీ పూర్తి చేస్తానని, ఆ షోలన్నీ ఒక సెలబ్రేషన్‌లా ఉంటాయని తెలిపారు. ఆ తర్వాత తన స్పెషల్‌ను రికార్డ్ చేసి, పూర్తిగా కోలుకోవడానికి లాంగ్ బ్రేక్ తీసుకుంటానని వెల్లడించారు. ఈసారి ఎక్కువ నగరాల్లో పర్యటించడం లేదని కూడా క్లారిటీ ఇచ్చారు. స్టాండప్ కమెడియన్ తోపాటు పలు వెబ్ సిరీస్ లలోనూ జాకిర్ ఖాన్ నటించాడు. అతని కామెడీ టైమింగ్ కు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అయితే తాజాగా అతడు చేసిన అనౌన్స్‌మెంట్ మాత్రం ఫ్యాన్స్ కు మింగుడు పడనిదే.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More