ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న ఈ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ చూశారా.. ఒకేచోట ఫన్, థ్రిల్

ఓటీటీలోకి ఈమధ్యే క్రైమ్ కామెడీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు వచ్చింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ థ్రిల్, ఫన్ ఒకేసారి పంచుతోంది. జియోహాట్‌స్టార్ ఓటీటీలో ఉన్న ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో చూడండి.

Published on: Jun 30, 2025, 16:33:04 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మిస్టరీ థ్రిల్లర్ స్టోరీకి కాస్త కామెడీని కూడా జోడించి ఓటీటీలోకి వచ్చిన వెబ్ సిరీస్ మిస్త్రీ (Mistry). ఈ హిందీ వెబ్ సిరీస్ జియోహాట్‌స్టార్ ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఓసీడీ (ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్)తో బాధపడుతూ సస్పెన్షన్ కు గురయ్యే ఓ పోలీస్ ఆఫీసర్ పరిష్కరించే వివిధ కేసుల చుట్టూ తిరిగే స్టోరీ ఇది.

ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న ఈ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ చూశారా.. ఒకేచోట ఫన్, థ్రిల్
ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న ఈ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ చూశారా.. ఒకేచోట ఫన్, థ్రిల్

మిస్త్రీ వెబ్ సిరీస్ స్టోరీ ఏంటంటే?

మిస్త్రీ వెబ్ సిరీస్ అర్మాన్ మిస్త్రీ (రామ్ కపూర్) అనే ఓ మాజీ పోలీస్ ఆఫీసర్, అతడు చిటికెలో పరిష్కరించే కేసుల చుట్టూ తిరుగుతుంది. తన కళ్ల ముందే ఓ బాంబు పేలుడులో తన భార్య మరణించడంతో ఓసీడీ (అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్) బారిన పడతాడు. ఓవైపు తన భార్య హత్యకు కారణమేంటో తెలుసుకునే ప్రయత్నం చేయడంతోపాటు కఠినమైన కేసులను పరిష్కరించడంలో పోలీస్ డిపార్ట్‌మెంట్ కు కన్సల్టెంట్ గా పని చేస్తుంటాడు.

ఓసీడీ.. అంటే చేసిన పనినే మళ్లీ మళ్లీ చేస్తుండటం, అన్నీ పర్ఫెక్ట్‌గా ఉండాలనుకోవడంలాంటి లక్షణాలతో అతడు బాధపడుతుంటాడు. దీనివల్లే పోలీసు ఉద్యోగాన్ని కోల్పోతాడు. అయినా క్లిష్టమైన మర్డర్ కేసులను కూడా తన ప్రతిభతో పరిష్కరిస్తుంటాడు. 8 ఎపిసోడ్ల ఈ సిరీస్ లో ఒక్కో ఎపిసోడ్లో మిస్త్రీ ఒక్కో కేసును ఎలా పరిష్కరిస్తాడో చూపించారు. ఓవైపు తాను పరిష్కరించకుండా మిగిలిపోయిన తన భార్య హత్య కేసుపై పని చేస్తూనే మరోవైపు పోలీసు శాఖకు కేసుల పరిష్కారంలో సాయం చేస్తుంటాడు.

ఓసీడీతో బాధపడుతున్న అతడు చేసే పనులు ఓవైపు నవ్వు తెప్పిస్తుంటాయి. మరోవైపు కేసుల ఇన్వెస్టిగేషన్ మంచి థ్రిల్ అందిస్తాయి. ఇలా ఈ రెండింటినీ కలిపి ఈ మిస్త్రీ వెబ్ సిరీస్ రూపొందించారు. అర్మాన్ మిస్త్రీ తిరిగి తన ఉద్యోగం పొందుతాడా? తన భార్య హత్య వెనుక ఉన్నదెవరో తెలుసుకుంటాడా? అన్నదే ఈ మిస్త్రీ స్టోరీ.

మిస్త్రీ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?

మిస్త్రీ అనే క్రైమ్ కామెడీ వెబ్ సిరీస్ ను రిషబ్ సేఠ్ డైరెక్ట్ చేశాడు. ఇతర మిస్టరీ, క్రైమ్ థ్రిల్లర్వెబ్ సిరీస్ లలో ఉండేంత సస్పెన్స్, మిస్టరీ, థ్రిల్ ను ఈ మిస్త్రీ నుంచి ఆశించలేం కానీ తన పరిధి మేర డైరెక్టర్ నవ్విస్తూనే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ లోని మజాను ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేశాడు.

అర్మాన్ మిస్త్రీగా ఓసీడీతో బాధపడే పాత్రలో రామ్ కపూర్ ఒదిగిపోయాడు. ఇక ఏసీపీ సెహమత్ పాత్రలో మోనా సింగ్ కూడా బాగానే నటించింది. సిరీస్ చాలా వరకూ ఈ రెండు పాత్రల చుట్టూనే తిరుగుతుంది. క్రైమ్ కామెడీ జానర్లో సాధారణంగా చాలా తక్కువగానే మూవీస్, వెబ్ సిరీస్ వస్తుంటాయి. ఇలాంటి జానర్ ఇష్టపడే వారికి మిస్త్రీ వెబ్ సిరీస్ నచ్చుతుంది.

ఇక చివరి ఎపిసోడ్లో ఇచ్చే ట్విస్ట్ తో రెండో సీజన్ కూడా ఉంటుందని మేకర్స్ స్పష్టం చేశారు. తన భార్య హత్య కేసు వెనుక ఉన్న మిస్టరీని మిస్త్రీ ఎలా ఛేదిస్తాడన్నది రెండో సీజన్లో చూపించే అవకాశం ఉంది. జియోహాట్‌స్టార్ లో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న ఈ హిందీ వెబ్ సిరీస్ ను టైమ్ ఉంటే తప్పకుండా చూడండి.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More