రక్తపాతం, ఊహకందని వయోలెన్స్- స్క్విడ్ గేమ్ తరహాలో కల్ట్ టీజర్- రవి బస్రూర్‌కు రోలెక్స్ వాచ్ గిఫ్ట్ ఇచ్చిన విశ్వక్ సేన్

Cult Teaser: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మరోసారి మెగాఫోన్ పట్టి టాలీవుడ్‌లో సరికొత్త ప్రయోగానికి తెరలేపారు. విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా కల్ట్ టీజర్ ఇవాళ (ఫిబ్రవరి 21) రిలీజ్ అయింది. ప్రస్తుతం విశ్వక్ సేన్ కల్ట్ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Feb 21, 2026, 19:54:58 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో విశ్వక్ సేన్ ఎప్పుడు డిఫరెంట్‌గా ప్రయోగాలు చేస్తుంటాడు. హీరోగానే కాకుండా ఈసారి డైరెక్టర్‌గా అదరగొట్టేందకు రెడీ అయ్యాడు. ఇదివరకే విశ్వక్ సేన్ డైరెక్టర్‌గా తెరకెక్కిన ఫలక్‌నూమా దాస్ సూపర్ హిట్ అయింది. ఇక దాస్ కా ధమ్కీ పర్వాలేదనిపించుకుంది.

రక్తపాతం, ఊహకందని వయోలెన్స్- స్క్విడ్ గేమ్ తరహాలో కల్ట్ టీజర్- రవి బస్రూర్‌కు రోలెక్స్ వాచ్ గిఫ్ట్ ఇచ్చిన విశ్వక్ సేన్
రక్తపాతం, ఊహకందని వయోలెన్స్- స్క్విడ్ గేమ్ తరహాలో కల్ట్ టీజర్- రవి బస్రూర్‌కు రోలెక్స్ వాచ్ గిఫ్ట్ ఇచ్చిన విశ్వక్ సేన్

ఇప్పుడు విశ్వక్ సేన్ మరోసారి దర్శకుడిగా అవతారం ఎత్తిన సినిమా ‘కల్ట్’ (CULT). ఈ సినిమాతో టాలీవుడ్‌లో సరికొత్త ‘స్లాషర్’ (Slasher) జానర్‌ను పరిచయం చేస్తున్నాడు విశ్వక్ సేన్. తాజాగా ఇవాళ (ఫిబ్రవరి 21) కల్క్ టీజర్ రిలీజ్ అయింది. ఈ టీజర్‌లో రక్తపాతం తారా స్థాయిలో కనిపించింది.

టీజర్ టాక్: వణుకు పుట్టించే వయోలెన్స్!

సుమారు 2 నిమిషాల 33 సెకన్ల నిడివి ఉన్న ఈ కల్ట్ టీజర్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. గోవాలోని ఒక అండర్ గ్రౌండ్ పార్టీ నేపథ్యంలో మొదలైన ఈ కథ, ఒక్కసారిగా రక్తపాతంగా మారిపోతుంది.

డ్రగ్స్, పార్టీలు, నియమాలు లేని ప్రపంచంలో ఒక రహస్య హోలోగ్రామ్ ఇచ్చే డెడ్లీ గేమ్ నేపథ్యంలో సాగే కల్ట్ టీజర్, హాలీవుడ్ మూవీ ‘స్క్విడ్ గేమ్’ లేదా ‘హిట్ 3’ తరహాలో వణుకు పుట్టిస్తోంది. కల్ట్ టీజర్ చివరలో విశ్వక్ సేన్ ఎంట్రీ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. అత్యంత వయోలెంట్‌గా సాగిన కల్ట్ టీజర్ ఆకట్టుకునేలానే ఉంది.

వంద మంది కొత్త ముఖాలతో భారీ ప్రయోగం

ఇకపోతే కల్ట్ సినిమా ద్వారా ఏకంగా 100 మంది కొత్త నటీనటులను వెండితెరకు పరిచయం చేస్తూ విశ్వక్ సేన్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. ‘ఫలక్‌నుమా దాస్’, ‘దాస్ కా ధమ్కీ’ సినిమాల తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తున్న మూడవ సినిమా ఇది. ఈ చిత్రానికి ఆయన ప్రాణ స్నేహితుడు, ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ అదిరిపోయే డైలాగులు అందించడం విశేషం.

రవి బస్రూర్‌కు రోలెక్స్ వాచ్ గిఫ్ట్!

హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగిన కల్ట్ టీజర్ లాంచ్ వేడుకలో ఒక ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఈ సినిమాకు ‘కేజీఎఫ్’ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందించారు. కల్ట్ టీజర్‌కు ఆయన ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు ఫిదా అయిన విశ్వక్ సేన్, వేదికపైనే రవి బస్రూర్‌కు ఖరీదైన రోలెక్స్ వాచ్‌ను బహుమతిగా ఇచ్చి సర్‌‌ప్రైజ్ చేశారు. "రవి గారి మ్యూజిక్ ఈ సినిమాకు ప్రాణం పోసింది" అని విశ్వక్ సేన్ ఈ సందర్భంగా భావోద్వేగానికి లోనయ్యారు.

గ్లోబల్ మార్కెట్‌పై కన్ను

తారక్ సినిమాస్ బ్యానర్‌పై సందీప్ కాకరాల నిర్మిస్తున్న కల్ట్ చిత్రం కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, ఇంగ్లీష్, జపనీస్, స్పానిష్ వంటి అంతర్జాతీయ భాషల్లోనూ విడుదల కానుంది. ఇండియాలోనే మొట్టమొదటి ప్రాపర్ ‘స్లాషర్’ చిత్రంగా వస్తున్న ‘కల్ట్’ త్వరలోనే థియేటర్లలో విధ్వంసం సృష్టించనుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More