డియర్ డాడీ రివ్యూ - ఈటీవీ విన్ ఓటీటీలో రిలీజైన ఫ్యామిలీ డ్రామా మూవీ - రన్ టైమ్ 48 నిమిషాలే!
ఫ్యామిలీ డ్రామా కథాంశంతో రూపొందిన డియర్ డాడీ మూవీ ఇటీవల ఈటీవీ విన్ ఓటీటీలో రిలీజైంది. శరణ్య ప్రదీప్, వైష్ణవి,రవివర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీకి శ్రీకాంత్ దేవరకొండ దర్శకత్వం వహించాడు.
శరణ్య ప్రదీప్, వైష్ణవి,రవివర్మ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ డియర్ డాడీ. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీకి శ్రీకాంత్ దేవరకొండ దర్శకత్వం వహించాడు. ఈటీవీ విన్ ఓటీటీలో రిలీజైన ఈ మూవీ ఎలా ఉందంటే?

తండ్రి ప్రేమ కోసం...
రవి (శశిధర్), చంద్రిక (శరణ్య ప్రదీప్) ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. వారికి కూతురు విస్మయ ఉంటుంది. అన్యోన్యంగా సాగిన వారి కాపురంలో కలతలు మొదలవుతాయి. విడాకులు తీసుకుంటారు. రవి నుంచి విడిపోయిన చంద్రిక ...అశోక్(రవివర్మ)తో కొత్త జీవితాన్ని మొదలుపెడుతుంది. చంద్రిక చనిపోవడంతో కొన్నాళ్లు తండ్రి రవి దగ్గర ఉండిపోవాలని బెంగళూరు వస్తుంది విస్మయ.
కూతురే ప్రపంచంగా బతికిన రవి...విస్మయను ద్వేషించడం మొదలుపెడతాడు. తండ్రి నుంచి తాను ఆశించిన ప్రేమ విస్మయకు దక్కదు. రవి మారిపోవడానికి కారణం ఏమిటి? తండ్రి దగ్గరే ఉండిపోవాలని వచ్చిన విస్మయ ఎలాంటి నిర్ణయం తీసుకుంది? రవి, చంద్రిక ఎందుకు విడిపోయారు? అశోక్ అంటే విస్మయకు ఎందుకు ఇష్టం ఉండదు? అన్నదే ఈ మూవీ కథ.
తండ్రి ప్రేమ మారదు...
తండ్రి ప్రేమ గొప్పతనం, ఔన్నత్యాన్ని చూపిస్తూ డియర్ డాడీ మూవీని రూపొందించారు దర్శకుడు శ్రీకాంత్ దేవరకొండ. జీవితంలో ఎన్ని మారినా తండ్రి ప్రేమ మాత్రం మారదనే పాయింట్‌ను ఎమోషనల్‌గా ఈ మూవీలో చూపించాడు. ఆడపిల్లలకు తండ్రితో ఉన్న అటాచ్‌మెంట్‌ను హృద్యంగా విస్మయ, అశోక్ పాత్రల ద్వారా ఆవిష్కరించారు.
మెసేజ్ బాగుంది...
మనస్పర్థలు, గొడవలు పడి తల్లిదండ్రులు విడాకులు తీసుకుంటే...ఆ ప్రభావం పిల్లలపై ఎలా ఉంటుంది? కన్నవారికి దూరమై వారు పడే మనోవేదనను ఆలోచనాత్మకంగా ఈ మూవీలో చూపించారు. అశోక్ పాత్ర ద్వారా ఇచ్చిన మెసేజ్ బాగుంది. తండ్రిగా బాధ్యతలు తీసుకోవడానికి రక్త సంబంధమే ఉండాల్సిన పనిలేదని చూపించిన విధానం ఆకట్టుకుంటుంది.
డైరీని కథలో బాగం చేసిన తీరు దర్శకుడి ప్రతిభకు అద్దంపడుతుంది. విస్మయ డైరీ రాసే సీన్‌తో సినిమాను మొదలుపెట్టి...చంద్రిక డైరీలో నిజాలు బయటపడే పడే సన్నివేశంతో ఎండ్ చేయడం ఆకట్టుకుంటుంది. తాను ప్రేమించిన రవి...అంకుల్ అని విస్మయ ఎందుకు పిలిచింది? తాను ద్వేషించిన అశోక్‌ను తండ్రిగా ఎలా అంగీకరించిందనే ఎమోషనల్ క్లైమాక్స్తో ఈ సినిమాను ఎండ్ చేశారు.
ప్రశ్నలతో మొదలుపెట్టి...
రవి, విస్మయ అనుబంధాన్ని చూపిస్తూ డియర్ డాడీ మూవీ మొదలవుతుంది. నువ్వే తప్ప నాకు వేరే ప్రపంచం లేదని అన్న తండ్రి రవి... విస్మయకు ఎలా దూరమయ్యాడు? రవి స్థానంలో వచ్చిన అశోక్‌ను విస్మయ ద్వేషిస్తూ వెళ్లే సీన్స్‌తో సినిమా సాగుతుంది. ప్రశ్నలతో సినిమాను మొదలుపెట్టి...వాటికి సమాధానాలు ఇస్తూ కన్వీన్సింగ్‌గా ఎండ్ చేశారు.
మంచి మెసేజ్‌తో దర్శకుడు కథను రాసుకున్నాడు. తాను చెప్పాలనుకున్న పాయింట్‌ను నిజాయితీగా స్క్రీన్‌పై ఆవిష్కరించాడు. అనవసరపు కమర్షియల్ హంగుల జోలికి పోకుండా సినిమాను తెరకెక్కించడం బాగుంది.
ఏకాంతం అంటే మనం కోరుకునేది...
ఇళ్లంటే బతికున్నప్పుడు మనుషులు, చనిపోయిన తర్వాత జ్ఞాపకాలతో నిండిపోయే ఓ అందమైన ప్రదేశం, ఏకాంతం అంటే మనం కోరుకునేది...ఒంటరితనం అంటే మనకు వచ్చేది అనే డైలాగ్స్ మెప్పిస్తాయి.
నాలుగు పాత్రలతో...
సినిమా మొత్తం నాలుగు పాత్రలతోనే సాగుతుంది. నటీనటుల ఎంపిక బాగుంది. తల్లి పాత్రలో శరణ్య ప్రదీప్, విస్మయగా వైష్ణవి సహజ నటనను కనబరిచారు. ఎమోషనల్ రోల్‌లో రవి వర్మ మెప్పించాడు. పాజిటివ్‌గా కనిపించే నెగెటివ్ క్యారెక్టర్‌లో శశిధర్ యాక్టింగ్ ఓకే. చిన్ననాటి విస్మయ పాత్రలో బేబీ సహస్ర ఒదిగిపోయింది. సినిమా రన్టైమ్ కేవలం 48 నిమిషాలు మాత్రమే. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు.
రేటింగ్: 2.75/5
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

E-Paper


