...
...
Next Story

అల్లు అర్జున్-అట్లీ సినిమాలో హీరోయిన్‌గా దీపికా పదుకొణె.. స్పెషల్ వీడియో రిలీజ్.. విజయం వైపు మహారాణి అంటూ!

అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో భారీ ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటి దీపికా పదుకొణె ఫిక్స్ అయింది. దీనికి సంబంధించిన స్పెషల్ వీడియోను మేకర్స్ ఇవాళ (జూన్ 7) రిలీజ్ చేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Published on: Jun 07, 2025 11:54 AM IST
By , , Hyderabad
Prefer HTon Google
Advertisement

ఇదివరకు జవాన్‌లో

అల్లు అర్జున్-అట్లీ సినిమాలో హీరోయిన్‌గా దీపికా పదుకొణె.. స్పెషల్ వీడియో రిలీజ్.. విజయం వైపు మహారాణి అంటూ!
అల్లు అర్జున్-అట్లీ సినిమాలో హీరోయిన్‌గా దీపికా పదుకొణె.. స్పెషల్ వీడియో రిలీజ్.. విజయం వైపు మహారాణి అంటూ!

ఇకపోతే ఇదివరకు డైరెక్టర్ అట్లీ కుమార్ దర్శకత్వం వహించిన షారుక్ ఖాన్ జవాన్ మూవీలో ఓ హీరోయిన్‌గా దీపికా పదుకొణె నటించింది. ఇప్పుడు రెండోసారి డైరెక్టర్ అట్లీతో దీపికా పదుకొణె పనిచేస్తుంది.

పుష్ప 2 ది రూల్ తర్వాత ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ భారీ ప్రాజెక్ట్ మూవీ చేస్తున్నాడు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఏఏ22ఏ6 మూవీ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి.

అల్లు అర్జున్ వీడియో

ఇందుకోసం హాలీవుడ్ ప్రముఖ టెక్నీషియన్స్ పని చేస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి విడుదలైన చేసిన అల్లు అర్జున్ మేకింగ్ వీడియో ఫుల్ వైరల్ అయింది. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఆ వీడియోను రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో క్రేజీ అప్డేట్ ఇచ్చింది నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్.

అల్లు అర్జున్-అట్లీ సినిమాలో హీరోయిన్ ఎవరనేది అధికారికంగా రివీల్ చేశారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటి దీపికా పదుకొణె హీరోయిన్‌గా చేస్తోంది. దీనికి సంబంధించిన 'ది ఫేస్ ఆఫ్ AA22xA6' పేరుతో దీపికా పదుకొణె స్పెషల్ వీడియోను సన్ పిక్చర్స్ సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది.

ఫేస్ చూపించకుండా

"విజయం దిశగా వెళ్తున్న మహారాణి. దీపికా పదుకొణెకు స్వాగతం" అంటూ మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియోలో దీపికా పదుకొణె మొహం చూపించకుండా డైరెక్టర్ అట్లీ స్టోరీ, నెరేషన్ వినిపిస్తున్నట్లుగా చూపించారు. తర్వాత కాసేపటికి దీపికా పదుకొణె ఫేస్ రివీల్ చేస్తూ చూపించే షాట్ బాగుంది.

ఇక మధ్యలో కొన్ని పెయింటింగ్స్, యోధురాలిగా, సూపర్ ఉమెన్‌గా దీపికా పదుకొణె కత్తి పట్టి యాక్షన్ చేసే కొన్ని సీన్స్, పిక్స్, చూపించారు. ఇలా ఆద్యంతం చాలా ఇంట్రెస్టింగ్‌గా దీపికా పదుకొణె వీడియో సాగింది. ఇదిలా ఉంటే, ఇటీవలే ప్రభాస్ స్పిరిట్ మూవీ నుంచి దీపికా పదుకొణె తప్పుకున్న విషయం తెలిసిందే.

దీపికా పదుకొణె పెట్టిన కండిషన్స్ కారణంగానే ఆమెను డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తప్పించినట్లు టాక్ నడిచింది కూడా. మరి స్పిరిట్ మూవీని వద్దనుకును అల్లు అర్జున్ చిత్రాన్ని దీపికా చేయడానికి గల కారణాలేంటో అని నెటిజన్స్ ఆరా తీస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe