వారం వారం ఓటీటీలోకి సినిమాలు వస్తూనే ఉంటాయి. అందులో డిఫరెంట్ జోనర్ మూవీస్ ఉంటాయి. కొన్ని థ్రిల్లర్లు ఆడియన్స్ ను బాగా ఎంగేజ్ చేస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకునేది అలాంటి ఓ సినిమా గురించే. గ్రామంలో జరిగే హత్యల వెనుక ఉన్నది ఎవరో కనిపెట్టే కథతో, గ్రిప్పింగ్ స్టోరీ లైన్ తో సాగే ‘డిటెక్టివ్ ఉజ్వలన్’ సినిమా ఈ రోజు (జూలై 11) ఓటీటీలోకి వచ్చేసింది.
ఏ ఓటీటీలో అంటే?

మలయాళ థ్రిల్లర్ సినిమా ‘డిటెక్టివ్ ఉజ్వలన్’ ఓటీటీలోకి అడుగుపెట్టింది. శుక్రవారం నుంచే ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్అవుతోంది. ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది. జూలై 11 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అయితే కేవలం మలయాళం భాషలోనే ఈ సినిమా ఓటీటీ ఆడియన్స్ కు అందుబాటులోకి వచ్చింది. మే 23, 2025న థియేట్రికల్ రిలీజ్ తో డిటెక్టివ్ ఉజ్వలన్ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ప్రదర్శన చేసింది.
మిస్టరీ థ్రిల్లర్
డిటెక్టివ్ ఉజ్వలన్ మూవీ మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కింది. మలయాళంలోనే వచ్చిన టోవినో థామస్ సూపర్ హీరో మూవీ ‘మిన్నల్ మురళి’ తో డిటెక్టివ్ ఉజ్వలన్ కు కనెక్షన్ ఉందనే టాక్ వినిపించింది. అయితే అదే ఫిక్షనల్ వరల్డ్ నుంచి.. వీకెండ్ సినిమాటిక్ యూనివర్స్ (డబ్ల్యూసీయూ)లో భాగంగా ఈ మూవీ తెరకెక్కింది. గ్రిప్పింగ్ స్టోరీ లైన్ తో ఆకట్టుకుంది ఈ సినిమా.
కథ ఏమిటంటే?
ప్లాచిక్కావు అనే గ్రామంలో కథ జరుగుతుంది. నేరాలు లేని ఊరు ఇది. క్రైమ్ రేట్ చాలా తక్కువ. డిటెక్టివ్ ఉజ్వలన్ గ్రామంలో బకెట్లు, బిందెలు లాంటి చిన్న చిన్న వస్తువులు పోతే కనిపెట్టి చెప్తాడు. అలాంటి గ్రామంలో హత్యలు జరుగుతుంటాయి. గ్రామంలో మొదటి హత్య జరగడంతో అందరూ ఉలిక్కి పడతారు. హంతకుడు ఎవరూ అనేది కనిపెట్టడానికి డిటెక్టివ్ ఉజ్వలన్ సాయం తీసుకుంటారు పోలీసులు. ఈ క్రమంలో వచ్చే కామెడీ మంచి ఫన్ అందిస్తుంది.
అయితే సినిమా సాగుతున్నా కొద్దీ సీరియస్ గా మారిపోతుంది. మంచి థ్రిల్ ను పంచుతుంది. మాస్కు వేసిన మనిషి ఎవరు? హత్యలు ఎవరు ఛేస్తున్నారనే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అయితే డిటెక్టివ్ ఉజ్వలన్ హత్యలు చేస్తున్నాడేమో అనే అనుమానం కూడా వస్తుంది. మరి మాస్కు వెనుక ఉన్న మనిషి ఎవరు? అనేది సినిమా చూస్తే తెలుస్తుంది.
{{/usCountry}}అయితే సినిమా సాగుతున్నా కొద్దీ సీరియస్ గా మారిపోతుంది. మంచి థ్రిల్ ను పంచుతుంది. మాస్కు వేసిన మనిషి ఎవరు? హత్యలు ఎవరు ఛేస్తున్నారనే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అయితే డిటెక్టివ్ ఉజ్వలన్ హత్యలు చేస్తున్నాడేమో అనే అనుమానం కూడా వస్తుంది. మరి మాస్కు వెనుక ఉన్న మనిషి ఎవరు? అనేది సినిమా చూస్తే తెలుస్తుంది.
{{/usCountry}}ఇంద్రనీల్ గోపీకృష్ణన్, రాహుల్ జి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ధ్యాన్ శ్రీనివాసన్, సిజు విల్సన్, కొట్టయం నజీర్ తదితరులు నటించారు.