నేరాలు లేని గ్రామంలో హత్య జరిగితే.. ఓటీటీలోకి వచ్చేసిన మలయాళం మిస్టరీ థ్రిల్లర్.. నవ్విస్తూనే థ్రిల్ పంచే మూవీ
ఓటీటీలోకి మరో మలయాళ మిస్టరీ థ్రిల్లర్ వచ్చేసింది. ఓ వైపు కామెడీతో నవ్విస్తూనే, మరోవైపు థ్రిల్ ను పంచే డిటెక్టివ్ ఉజ్వలన్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ రోజే ఓటీటీలో అడుగుపెట్టింది ఈ సినిమా.
వారం వారం ఓటీటీలోకి సినిమాలు వస్తూనే ఉంటాయి. అందులో డిఫరెంట్ జోనర్ మూవీస్ ఉంటాయి. కొన్ని థ్రిల్లర్లు ఆడియన్స్ ను బాగా ఎంగేజ్ చేస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకునేది అలాంటి ఓ సినిమా గురించే. గ్రామంలో జరిగే హత్యల వెనుక ఉన్నది ఎవరో కనిపెట్టే కథతో, గ్రిప్పింగ్ స్టోరీ లైన్ తో సాగే ‘డిటెక్టివ్ ఉజ్వలన్’ సినిమా ఈ రోజు (జూలై 11) ఓటీటీలోకి వచ్చేసింది.

ఏ ఓటీటీలో అంటే?
మలయాళ థ్రిల్లర్ సినిమా ‘డిటెక్టివ్ ఉజ్వలన్’ ఓటీటీలోకి అడుగుపెట్టింది. శుక్రవారం నుంచే ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్అవుతోంది. ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది. జూలై 11 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అయితే కేవలం మలయాళం భాషలోనే ఈ సినిమా ఓటీటీ ఆడియన్స్ కు అందుబాటులోకి వచ్చింది. మే 23, 2025న థియేట్రికల్ రిలీజ్ తో డిటెక్టివ్ ఉజ్వలన్ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ప్రదర్శన చేసింది.
మిస్టరీ థ్రిల్లర్
డిటెక్టివ్ ఉజ్వలన్ మూవీ మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కింది. మలయాళంలోనే వచ్చిన టోవినో థామస్ సూపర్ హీరో మూవీ ‘మిన్నల్ మురళి’ తో డిటెక్టివ్ ఉజ్వలన్ కు కనెక్షన్ ఉందనే టాక్ వినిపించింది. అయితే అదే ఫిక్షనల్ వరల్డ్ నుంచి.. వీకెండ్ సినిమాటిక్ యూనివర్స్ (డబ్ల్యూసీయూ)లో భాగంగా ఈ మూవీ తెరకెక్కింది. గ్రిప్పింగ్ స్టోరీ లైన్ తో ఆకట్టుకుంది ఈ సినిమా.
కథ ఏమిటంటే?
ప్లాచిక్కావు అనే గ్రామంలో కథ జరుగుతుంది. నేరాలు లేని ఊరు ఇది. క్రైమ్ రేట్ చాలా తక్కువ. డిటెక్టివ్ ఉజ్వలన్ గ్రామంలో బకెట్లు, బిందెలు లాంటి చిన్న చిన్న వస్తువులు పోతే కనిపెట్టి చెప్తాడు. అలాంటి గ్రామంలో హత్యలు జరుగుతుంటాయి. గ్రామంలో మొదటి హత్య జరగడంతో అందరూ ఉలిక్కి పడతారు. హంతకుడు ఎవరూ అనేది కనిపెట్టడానికి డిటెక్టివ్ ఉజ్వలన్ సాయం తీసుకుంటారు పోలీసులు. ఈ క్రమంలో వచ్చే కామెడీ మంచి ఫన్ అందిస్తుంది.
అయితే సినిమా సాగుతున్నా కొద్దీ సీరియస్ గా మారిపోతుంది. మంచి థ్రిల్ ను పంచుతుంది. మాస్కు వేసిన మనిషి ఎవరు? హత్యలు ఎవరు ఛేస్తున్నారనే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అయితే డిటెక్టివ్ ఉజ్వలన్ హత్యలు చేస్తున్నాడేమో అనే అనుమానం కూడా వస్తుంది. మరి మాస్కు వెనుక ఉన్న మనిషి ఎవరు? అనేది సినిమా చూస్తే తెలుస్తుంది.
ఇంద్రనీల్ గోపీకృష్ణన్, రాహుల్ జి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ధ్యాన్ శ్రీనివాసన్, సిజు విల్సన్, కొట్టయం నజీర్ తదితరులు నటించారు.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper



