...
...
Next Story

Devara Fear Song Lyrics: దేవర మూవీ ఫియర్ సాంగ్ లిరిక్స్ ఇవే.. అదరగొడుతున్న అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్

Devara Fear Song Lyrics: దేవర మూవీ నుంచి ఫియర్ సాంగ్ పేరుతో ఫస్ట్ సింగిల్ వచ్చిన సంగతి తెలుసు కదా. ప్రస్తుతం టాప్ ట్రెండింగ్ లో ఉన్న ఈ సాంగ్ లిరిక్స్ ఇక్కడ చూడండి.

Published on: May 20, 2024, 16:34:06 IST
By , , Hyderabad
Prefer HTon Google
Advertisement

Devara Fear Song Lyrics: జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ ప్రస్తుతం యూట్యూబ్ ను ఊపేస్తోంది. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించిన ఈ పాట తెలుగు ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని అందిస్తోంది.

దేవర మూవీ ఫియర్ సాంగ్ లిరిక్స్ ఇవే.. అదరగొడుతున్న అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్
దేవర మూవీ ఫియర్ సాంగ్ లిరిక్స్ ఇవే.. అదరగొడుతున్న అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్

నిజానికి ఈ పాటకు మిక్స్‌డ్ రియాక్షన్ వచ్చింది. హోరెత్తించే మ్యూజిక్ లో లిరిక్స్ సరిగా వినపడలేదన్న విమర్శలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఫియర్ సాంగ్ లిరిక్స్ ఇక్కడ చూడండి.

దేవర ఫియర్ సాంగ్ లిరిక్స్

దేవర మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ఫియర్ సాంగ్ కు తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించడమే కాకుండా పాట కూడా పాడాడు. ఇక ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి మ్యూజిక్ అందించాడు. జూనియర్ ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ కు తగినట్లుగా చాలా పవర్ ఫుల్ లిరిక్స్తో ఈ పాట సాగిపోయింది. దేవర పాత్ర ఎంత బలమైనదో చెప్పే ఈ సాంగ్ లిరిక్స్ ఇక్కడ చూసేయండి.

అగ్గంటుకుంది సంద్రం.. దేవ..

భగ్గున మండె ఆకసం

అరాచకాలు భగ్నం.. దేవ..

చల్లారె చెడు సాహసం

జగడపు దారిలో

ముందడుగైన సేనాని

జడుపును నేర్పగా

అదుపున ఆపే సైన్యాన్ని

దూకే ధైర్యమా జాగ్రత్త

రాకే తెగబడి రాకే

దేవర ముంగిట నువ్వెంత దాక్కోవే

కాలం తడబడెనే

పొంగే కెరటములాగెనే

ప్రాణం పరుగులయీ..

కలుగుల్లో దూరేలే..

దూకే ధైర్యమ జాగ్రత్త..

పోవే.. పో ఎటుకైనా..

దేవర ముంగిట నీవెంత..

పోవెందుకే.. దేవర..

జగతికి చేటు చేయనేల

దేవర వేటుకందనేల

పదమే కదమై దిగితే ఫెళ ఫెళ

కనులకు కానరాని లీల

కడలికి కాపయ్యిందివేళ

విధికే ఎదురై వెళితే విల విలా

అలలయే ఎరుపు నీళ్లే..

ప్రళయమై అతడి రాకే

దడ దడ దడ దండోరా

దేవర మౌనమే

సవరణ లేని హెచ్చరిక

రగిలిన కోపమే

మృత్యువుకైన ముచ్చెమట

దూకే ధైర్యమా జాగ్రత్త

రాకే తెగబడి రాకే

దేవర ముంగిట నువ్వెంత దాక్కోవే

కాలం తడబడెనే

పొంగే కెరటములాగెనే

ప్రాణం పరుగులయీ

కలుగుల్లో దూరేలే..

దూకే ధైర్యమ జాగ్రత్త..

పోవే.. పో ఎటుకైనా..

దేవర ముంగిట నీవెంత..

పోవెందుకే.. దేవర..

లిరిక్స్‌పై విమర్శలు

ఇక దేవర ఫస్ట్ సింగిల్ ఫియర్ సాంగ్ లిరిక్స్ పైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ కు తగినట్లుగా ఉన్నా కూడా.. రామజోగయ్య శాస్త్రి రాసిన లిరిక్స్ కొంచెం అతిగా అనిపిస్తున్నట్లు సోషల్ మీడియాలో కొందరు పోస్టులు చేస్తున్నారు. దూకె ధైర్యమ జాగ్రత్త, మృత్యువుకే ముచ్చెమట లాంటి పదాలు అతిశయంగా ఉన్నట్లుగా చెబుతున్నారు. మరికొందరైతే లిరిక్స్ అసలు సరిగా వినిపించడం లేదన్న ఫిర్యాదులు చేస్తున్నారు. హోరెత్తేలా అనిపిస్తున్న మ్యూజిక్ కూడా కొందరికి నచ్చలేదు.

దేవర మూవీలో జూనియర్ ఎన్టీఆర్ తోపాటు జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పాన్ ఇండియా మూవీ అక్టోబర్ 10న రిలీజ్ కానుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ నటిస్తున్న సినిమా ఇది. దీంతో కొరటాల శివ మరింత పవర్ ఫుల్ గా ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నాడు.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe