ఓటీటీలో ఇవాళ 7 భాషల్లో ట్రెండ్ అవుతోన్న తెలుగు కామెడీ హారర్ థ్రిల్లర్.. 8.4 రేటింగ్.. ఇక్కడ చూసేయండి!
ఓటీటీలో ఇవాళ ఏకంగా 7 భాషల్లో తెలుగు కామెడీ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ దేవిక అండ్ డానీ ట్రెండింగ్ అవుతోంది. దేవిక అండ్ డానీ ఓటీటీ రిలీజ్ అయిన మరుసటి రోజు నుంచే ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. 8.4 రేటింగ్ సాధించిన తెలుగు సిరీస్ దేవిక అండ్ డానీ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
పెళ్లి చూపులు సినిమాతో హీరోయిన్‌గా మంచి క్రేజ్ తెచ్చుకున్న తెలుగు బ్యూటి రీతు వర్మ ఓటీటీలోకి ఇటీవల ఎంట్రీ ఇచ్చింది. రీతు వర్మ ఓటీటీ ఎంట్రీ ఇచ్చిన తెలుగు కామెడీ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ దేవిక అండ్ డానీ. ఈ వెబ్ సిరీస్‌లో రీతు వర్మతోపాటు సూర్య వశిష్ట, హీరో శివ కందుకూరి, సుబ్బరాజు ప్రధాన పాత్రలు పోషించారు.

ఏడు భాషల్లో
జూన్ 6న జియో హాట్స్టార్లో దేవిక అండ్ డానీ ఓటీటీ రిలీజ్ అయింది. అది కూడా తెలుగు, తమిళం, మలయాళం, మరాఠి, బెంగాలీ, కన్నడ, హిందీ వంటి ఏడు భాషల్లో దేవిక అండ్ డానీ ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చింది. ఓటీటీ రిలీజ్ అయిన మరుసటి రోజు నుంచే జియో హాట్‌స్టార్ ఓటీటీలో ట్రెండ్ అవుతోంది ఈ సిరీస్.
డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చిన రెండో రోజు (జూన్ 7) నుంచి ఇవాళ్టీ (జూన్ 8) వరకు జియో హాట్‌స్టార్‌లో ఏడు భాషల్లో దేవిక అండ్ డానీ ఓటీటీ ట్రెండింగ్ అవుతోంది. అంటే, ఇవాళ ఆదివారం హాట్‌స్టార్‌లో వివిధ ఓటీటీ ట్రెండింగ్ స్థానాల్లో దేవిక అండ్ డానీ ట్రెండ్ అవుతు దూసుకుపోతోంది.
ఒక్కో భాషలో టాప్
జియో హాట్‌స్టార్‌లోని తెలుగు కంటెంట్‌లో టాప్ 1 ప్లేసులో దేవిక అండ్ డానీ ఓటీటీ ట్రెండింగ్ అవుతోంది. అలాగే, హిందీలో పదో స్థానంలో, మలయాళంలో 3వ ప్లేసులో, తమిళంలో ఐదో స్తానంలో, కన్నడ భాషలో నాలుగో ప్లేసులో ఇవాళ దేవిక అండ్ డానీ ఓటీటీ ట్రెండింగ్ అవుతోంది.
వీటితోపాటు బెంగాలీ, మరాఠి భాషల్లో కూడా తెలుగు హారర్ థ్రిల్లర్ దేవిక అండ్ డానీ ఓటీటీ ట్రెండ్ అవడం విశేషంగా మారింది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (జియో హాట్‌స్టార్) ఓటీటీ మరాఠి కంటెంట్‌లో దేవిక అండ్ డానీ 8వ స్థానంలో ట్రెండ్ అవుతోంది. ఇక బెంగాలీలో ఆరో ప్లేసులో ఈ తెలుగు సిరీస్ దూసుకుపోతోంది.
8.4 రేటింగ్
ఇలా ఓటీటీ రిలీజ్ అయిన ఏడు భాషల్లో రెండో రోజు నుంచే దేవిక అండ్ డానీ సిరీస్ ట్రెండింగ్ అవడం విశేషంగా మారింది. అంతేకాకుండా ఈ వెబ్ సిరీస్‌కు ఐఎమ్డీబీలో పదికి ఏకంగా 8.4 రేటింగ్ (ప్రస్తుతం) ఉంది. ఇన్ని విశేషాలు ఉన్న దేవిక అండ్ డానీ సిరీస్‌ను జియో హాట్‌స్టార్‌లో ఎంచక్కా చూసేయండి మరి.
ఇదిలా ఉంటే, బి. కిశోర్ దర్శకత్వం వహించిన దేవిక అండ్ డానీలో ముఖ్యపాత్రలో పాటు కోవై సరళ, సోనియా సింగ్, గోకరాజు రమణ, శివన్నారాయణ, వివా హర్ష, షణ్ముఖ్, అభినయ శ్రీ, మౌనికా రెడ్డి, ఈశ్వర్య వుల్లింగల ఇతర కీలక పాత్రలు పోషించారు.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper



