Kara OTT Release Date: అఫీషియల్.. ధనుష్ ‘కర’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఐదు భాషల్లో స్ట్రీమింగ్

Kara OTT Release Date: ఓటీటీలోకి మరో మూడు రోజుల్లోనే ధనుష్ హీస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కర స్ట్రీమింగ్ కు వస్తోంది. ఈ విషయాన్ని సోమవారం (మే 25) నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా అనౌన్స్ చేసింది. ఐదు భాషల్లో ఈ మూవీని చూసే వీలు కలగనుంది.

Published on: May 25, 2026, 13:22:34 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Kara OTT Release Date: ధనుష్ హీరోగా నటించిన తాజా హీస్ట్ థ్రిల్లర్ 'కర' (Kara) ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో మే 28 నుండి స్ట్రీమింగ్ కానుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. తాజాగా ఓటీటీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకునే మరో క్రేజీ అప్‌డేట్‌ను నెట్‌ఫ్లిక్స్ సంస్థ వెల్లడించింది.

Kara OTT Release Date: అఫీషియల్.. ధనుష్ కర ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఐదు భాషల్లో స్ట్రీమింగ్
Kara OTT Release Date: అఫీషియల్.. ధనుష్ కర ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఐదు భాషల్లో స్ట్రీమింగ్

ఐదు భాషల్లో కర స్ట్రీమింగ్

'కర' మూవీ మే 28 నుంచి కేవలం తమిళంలోనే కాకుండా ఒకేసారి తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా అందుబాటులోకి రానుంది. థియేటర్లలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన ఈ సినిమాకు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై మాత్రం మంచి ఆదరణ లభించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. థియేట్రికల్ విడుదలైన నాలుగు వారాల విండో కాలపరిమితి తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి వస్తోంది.

'పోర్ తోళిల్' (Por Thozhil) సినిమాతో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు విఘ్నేష్ రాజా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. 'ప్రేమలు' సినిమాతో సౌత్ ఇండియాలో సెన్సేషన్‌గా మారిన మమితా బైజు ఈ చిత్రంలో కథానాయికగా నటించింది.

ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో సూరజ్ వెంజరమూడు, కేఎస్ రవికుమార్, జయరామ్ కీలక పాత్రలు పోషించారు. వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఇషారి కె. గణేష్, థింక్ స్టూడియోస్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. జి.వి. ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి స్వరాలు అందించారు.

కర మూవీ ఎలా ఉందంటే?

కర మూవీ ఒక హీస్ట్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా. బ్యాంక్ రాబరీ నేపథ్యంలో యాక్షన్, ఎమోషన్, మెసేజ్ అంశాలతో తెరకెక్కించారు డైరెక్టర్ విఘ్నేశ్ రాజా. దొంగతనాలు మానేసి సాధారణ జీవితం గడపాలనుకున్న వ్యక్తి మళ్లీ బ్యాంక్ చోరీలు ఎందుకు చేశాడన్నదే మెయిన్ ప్లాట్. విఘ్నేశ్ రాజా సినిమాను ప్రారంభించిన తీరు అద్భుతంగా ఉంది. ముఖ్యంగా తొలి 15 నిమిషాల సన్నివేశాలు ప్రేక్షకులను సీట్లకు కట్టేస్తాయి.

వర్షం కురుస్తున్న రాత్రి ఒక ఎమ్మెల్యే ఇంట్లో దొంగతనం చేసే సీన్, ఆ తర్వాత పోలీస్ లాకప్ నుంచి తప్పించుకోవడం వంటి దృశ్యాలను చాలా సహజంగా చిత్రీకరించారు. లైటింగ్, సౌండ్ డిజైన్ సినిమాకు వెన్నెముకలా నిలిచాయి. కేవలం దొంగతనం మాత్రమే కాకుండా, అప్పటి సామాజిక పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపించారు.

ఇందులో కరస్వామి అనే పాత్రలో ధనుష్ నటించాడు. అతని భార్య మల్లి పాత్రలో మమితా బైజు నటించింది. భార్య కోసం దొంగతనాలు మానేసి బుద్ధిగా బతికే కర.. మళ్లీ దొంగతనాల వైపు ఎందుకు మళ్లాడన్నది ఈ మూవీ స్టోరీ. రూ.100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించినా.. బాక్సాఫీస్ దగ్గర కేవలం రూ.41 కోట్లు వసూలు డిజాస్టర్ గా మిగిపోయిన ఈ సినిమాకు ఓటీటీలో ఏమేర ఆదరణ దక్కుతుందో చూడాలి.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. ధనుష్ నటిస్తున్న 'కర' సినిమా ఏ ఓటీటీలో విడుదల కానుంది?

ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో విడుదల కానుంది.

2. 'కర' ఓటీటీ విడుదల తేదీ ఎప్పుడు, ఏయే భాషల్లో అందుబాటులో ఉంటుంది?

ఈ సినిమా మే 28 నుండి స్ట్రీమింగ్ కానుంది. ఒరిజినల్ తమిళ వెర్షన్‌తో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ ఆడియోలలో కూడా ఒకేసారి అందుబాటులోకి రానుంది.

3. ఈ చిత్రానికి దర్శకుడు, హీరోయిన్ ఎవరు?

'పోర్ తోళిల్' ఫేమ్ విఘ్నేష్ రాజా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. టాలెంటెడ్ బ్యూటీ మమితా బైజు కథానాయికగా నటించింది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More