Netflix vs JioHotstar: నెట్‌ఫ్లిక్స్ జియో హాట్‌స్టార్ ఓటీటీ వార్- ఒకేరోజు రెండింట్లో ధురంధర్ అన్‌కట్ వెర్షన్‌తో మొదలు!
Netflix Vs JioHotstar Dhurandhar Raw And Undekha Streaming: రణ్‌వీర్ సింగ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్ ఓటీటీ పోరుకు సిద్ధమైంది. మే 22న ధురంధర్ రా అండ్ అన్‌కట్ వెర్షన్ ఒకేసారి నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్‌లలో ఓటీటీ స్ట్రీమింగ్ కానుండటంతో రెండింటి మధ్య పోటీ నెలకొంది. పూర్తి వివరాల్లోకి వెళితే..!
Netflix Vs JioHotstar Dhurandhar Raw And Undekha Release: థియేటర్లలో సాగిన వసూళ్ల యుద్ధం ముగిసింది. ఇప్పుడు అసలైన సమరం ఓటీటీ తెరపై మొదలైంది. రణ్‌వీర్ సింగ్ నటించిన బ్లాక్ బస్టర్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్ ఓటీటీ రిలీజ్ చుట్టూ ఇండస్ట్రీలో ఒక ఊహించని సరికొత్త చర్చ నడుస్తోంది. ధురంధర్ మొదటి భాగానికి సంబంధించిన రా అండ్ అన్‌కట్ వెర్షన్ ఒకే రోజు రెండు దిగ్గజ ప్లాట్‌ఫామ్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ కావడం టాలీవుడ్, బాలీవుడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.

ఏదో ఒక ఓటీటీలోనే
సాధారణంగా మన తెలుగు రాష్ట్రాల్లో భారీ క్రేజ్ ఉన్న హిందీ సినిమాలు ఏదో ఒక ఓటీటీలోనే రిలీజ్ అవుతుంటాయి. కానీ, ధురంధర్ రా అండ్ అన్‌దేఖా వెర్షన్ రెండు వేర్వేరు ఓటీటీల్లో ఒకేసారి రానుండటంతో డిజిటల్ మార్కెట్ లెక్కలు మారుతున్నాయి.
ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'రా అండ్ అన్‌దేఖా' (Unseen Version) ఎడిషన్ మే 22 అంటే రేపటి నుంచి నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్ లలో ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో కత్తెర పడిన ఎన్నో అద్భుతమైన యాక్షన్ సీన్లు, ఎమోషనల్ డ్రామా ఈ స్పెషల్ కట్‌లో ఉంటాయని మేకర్స్ ప్రకటించారు. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ ఈ వెర్షన్ ఒకేసారి ఓటీటీ రిలీజ్ అవనుంది.
గందరగోళంలో ఫ్యాన్స్.. క్రేజీ డీల్ వెనుక రహస్యమేంటి?
సాధారణంగా ఒక సినిమా ఓటీటీ హక్కులను ఏదో ఒక ఓటీటీ ప్లాట్‌ఫామ్ మాత్రమే భారీ ధర చెల్లించి దక్కించుకుంటుంది. కానీ 'ధురంధర్' విషయంలో రెండు ప్రత్యర్థి సంస్థలు ఒకే రోజు, ఒకే రన్ టైమ్‌తో సినిమాను ఓటీటీ స్ట్రీమింగ్ చేస్తుండటంతో సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
"ఒకే సినిమా, ఒకే రోజు రెండు ఓటీటీల్లో రావడం ఏంటి? హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్ మధ్య అసలు ఎలాంటి డీల్ కుదిరింది?" అని ఒక నెటిజన్ ఎక్స్‌లో ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. రాబోయే రోజుల్లో లూప్‌హోల్స్ లేకుండా ఇలాంటి 'నాన్-ఎక్స్‌క్లూజివ్' స్ట్రీమింగ్ పార్ట్‌నర్‌షిప్స్ మరిన్ని చూసే అవకాశం ఉందనే సంకేతాలు ఈ నిర్ణయంతో స్పష్టమవుతున్నాయి.
బాక్సాఫీస్ వద్ద రెండు భాగాల కలెక్షన్ల సునామీ
ఇదిలా ఉంటే, గత ఏడాది డిసెంబర్ 5, 2025న విడుదలైన 'ధురంధర్' పార్ట్ 1 ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 1307 కోట్ల భారీ కలెక్షన్స్ సాధించింది. ఇక ఈ ఏడాది మార్చి 19న రిలీజ్ అయిన సీక్వెల్ 'ధురంధర్ 2' అంతకుమించి రూ. 1798 కోట్ల కలెక్షన్లతో బాక్సాఫీస్‌ను షేక్ చేసింది.
జస్కీరాత్ సింగ్ రంగీ (అలియాస్ హంజా అలీ మజారీ) అనే భారతీయ ఏజెంట్ పాకిస్తాన్‌లోని లియారీలో ఉన్న ఒక ప్రమాదకరమైన ఉగ్రవాద నెట్‌వర్క్‌ను అంతమొందించడానికి బలోచ్ గ్యాంగ్‌లోకి ఎలా చేరాడు అనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ సినిమాలు రూపొందాయి. ఈ ఫ్రాంచైజీలో రణ్‌వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, రాకేష్ బేడీ, ఆర్ మాధవన్, సారా అర్జున్ వంటి నటీనటుల యాక్టింగ్ ఆడియెన్స్‌ను మెప్పించింది.
వివాదాలు.. ప్రొడ్యూసర్ల సర్‌ప్రైజ్ ప్లాన్
ఈ సినిమాలు భారీ వసూళ్లు సాధించినప్పటికీ, కథలో కొంత రాజకీయ అనుకూలత ఉందనే విమర్శలు వచ్చాయి. గత ప్రభుత్వాల విజయాలను తక్కువ చేసి చూపించారంటూ కొందరు దీనిని ప్రచార చిత్రంగా అభివర్ణించారు. అయితే అనుపమ్ ఖేర్, పీయూష్ మిశ్రా వంటి ప్రముఖులు ఈ చిత్రాలకు మద్దతుగా నిలిచారు.
జియో హాట్‌స్టార్ ఓటీటీలో
"ఈ ఏడాది చివర్లో ఈ సినిమాకు సంబంధించి ప్రేక్షకులకు ఒక భారీ సర్‌ప్రైజ్ ఉండనుంది" అని జియో స్టూడియోస్ అధినేత, చిత్ర నిర్మాత జ్యోతి దేశ్‌పాండే హింట్ ఇచ్చారు. 'ధురంధర్: ది రివెంజ్' (పార్ట్ 2) ఇప్పటికే మే 14న అంతర్జాతీయంగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. కాగా, ఈ రెండో భాగం అయిన ధురంధర్ 2 భారత్‌లో జూన్ 4 నుంచి జియో హాట్‌స్టార్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. 'ధురంధర్' రా అండ్ అన్‌కట్ వెర్షన్ ఏయే ఓటీటీలలో విడుదలవుతోంది?
ఈ చిత్రం మే 22 నుంచి ఒకేసారి నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్ ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్ కానుంది.
2. 'ధురంధర్' అన్‌కట్ వెర్షన్ ఏయే భాషల్లో అందుబాటులో ఉంటుంది?
హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ ఈ ప్రత్యేక వెర్షన్ ఒకే రోజు అందుబాటులోకి రానుంది.
3. 'ధురంధర్' రెండు భాగాల బాక్సాఫీస్ వసూళ్లు ఎంత?
అధికారిక నివేదికల ప్రకారం, మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా రూ. 1307 కోట్లు సాధించగా, రెండో భాగం రూ. 1798 కోట్లకు పైగా వసూలు చేసింది.
4. 'ధురంధర్' పార్ట్ 2 భారతదేశంలో ఎప్పుడు ఓటీటీలోకి వస్తుంది?
ఈ క్రేజీ ఫ్రాంచైజీ రెండో భాగం (Dhurandhar 2) జూన్ 4 నుంచి భారత్‌లో జియో హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


