అల్లు అర్జున్ కంటే ముందు కెరీర్ స్టార్ట్ చేశావ్, ఆయన రేంజ్‌కు వెళ్లలేకపోయావ్.. మరో హీరోపై దిల్ రాజు కామెంట్స్
టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. ఇటీవల ఆయన నిర్మాతగా రూపొందిన సినిమా తమ్ముడు. నితిన్ హీరోగా తెరకెక్కిన తమ్ముడు మూవీ జులై 4న థియేటర్లలో విడుదలయింది. తమ్ముడు రిలీజ్‌కు ముందు పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ రేంజ్‌కు వెళ్లలేకపోయావ్ అని మరో హీరోకు తాను చెప్పినట్లు దిల్ రాజు వెల్లడించారు.
టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాల తర్వాత దిల్ రాజు ప్రొడక్షన్ నుంచి వచ్చిన లేటెస్ట్ మూవీ తమ్ముడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాకు దిల్ రాజు, శిరీష్ నిర్మాతలుగా వ్యవహరించారు.

యాంకర్ అడిగిన ప్రశ్నలకు
వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన తమ్ముడు సినిమా జులై 4న థియేటర్లలో విడుదలైంది. తొలి రోజు నుంచే తమ్ముడు సినిమాకు మిశ్రమ స్పందన వస్తోంది. అయితే, తమ్ముడు రిలీజ్‌కు ముందు పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో దిల్ రాజు యాంకర్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
దిల్ రాజు కామెంట్స్ వైరల్
హీరో నితిన్ను అల్లు అర్జున్ రేంజ్‌కు వెళ్లలేకపోయావని తాను చెప్పినట్లుగా ఆ ఇంటర్వ్యూలో నిర్మాత దిల్ రాజు తెలిపారు. ఈ కామెంట్స్ తమ్ముడు రిలీజ్ సమయంలో వైరల్ అయ్యాయి.
అల్లు అర్జున్ కంటే ముందు
"నితిన్ రీసెంట్ ఇంటర్వ్యూలో తన గుడ్, బ్యాడ్ ఏంటో చెప్పండి అని అడిగితే.. నేను అల్లు అర్జున్ కంటే నువ్వు ముందు కెరీర్ స్టార్ట్ చేశావ్, ఆయన రేంజ్‌కు వెళ్లలేకపోయావ్ అని ఒక వెల్ విషర్‌గా చెప్పాను. మా మధ్య ఉన్న రిలేషన్‌తోనే అలా చెప్పాను. దాన్ని నెగిటివ్‌గా చూడొద్దు" అని యాంకర్‌కు చెప్పారు దిల్ రాజు.
12 వేల అప్లికేషన్స్ వచ్చాయి
"ప్రతిభ గల కొత్త వాళ్లకు అన్ని విభాగాల్లో అవకాశాలు ఇవ్వాలనే దిల్ రాజు డ్రీమ్స్ స్టార్ట్ చేశాం. మొదటి రోజునే మాకు 12 వేల అప్లికేషన్స్ వచ్చాయి. అందులో స్క్రూటినీ చేసి 1400 అప్లికేషన్స్ తీసుకున్నాం. ప్రొడ్యూసర్‌గా 81 అప్లికేషన్స్ వస్తే వాటిలో వాళ్ల కంపెనీ హిస్టరీ ఏంటీ అని డీటెయిల్స్ చూసి 7 అప్లికేషన్స్ తీసుకున్నాం" అని దిల్ రాజు తెలిపారు.
రెండు మోడల్స్ చేస్తున్నాం
"ఇందులో రెండు మోడల్స్ చేస్తున్నాం. ఒకటి కథ బాగుంటే మేమే ఫండింగ్ చేసి వాళ్లతో మూవీ చేయిస్తాం. రెండోది వాళ్లే సినిమా చేసుకుని మా ప్రెజెన్స్, మా గైడెన్స్‌లో రిలీజ్ చేస్తాం. ఈ క్రమంలో కొత్త నిర్మాతలు కూడా ఇండస్ట్రీకి వస్తారని ఆశిస్తున్నాం" అని తమ వెబ్సైట్ ప్లానింగ్ గురించి దిల్ రాజు పేర్కొన్నారు.
తమ్ముడు నటీనటులు
ఇకపోతే నితిన్ తమ్ముడు సినిమాలో వర్ష బొల్లమ్మ, కన్నడ బ్యూటి సప్తమి గౌడ హీరోయిన్స్‌గా నటించారు. తెలుగు సీనియర్ హీరోయిన్ లయ తమ్ముడు మూవీతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఇక మలయాళ ముద్దుగుమ్మ స్వాసిక సైతం తమ్ముడు సినిమాలో కీలక పాత్ర పోషించారు.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper













