Dil Raju Yash: యశ్‌కి పిచ్చెక్కిందా.. ఈమెతో సినిమా తీస్తున్నాడు అనుకున్నా: దిల్ రాజు షాకింగ్ కామెంట్స్

Dil Raju Yash: యశ్ టాక్సిక్ మూవీపై, అతని నిర్ణయంపై దిల్ రాజు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. కేజీఎఫ్ తర్వాత గీతూ మోహన్ దాస్ లాంటి డైరెక్టర్ తో సినిమా ఏంటి పిచ్చా అనుకున్నానని దిల్ రాజు అనడం గమనార్హం.

Published on: Aug 24, 2026, 06:05:57 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Dil Raju Yash: కేజీఎఫ్ లాంటి ఇండస్ట్రీ హిట్ కొట్టిన తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నిర్ణయం చూసి ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు మైండ్ బ్లాక్ అయిపోయింది. హైదరాబాద్‌లో జరిగిన 'టాక్సిక్: ఏ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో దిల్ రాజు స్టేజ్ మీదే సంచలన వ్యాఖ్యలు చేశారు. కేజీఎఫ్ 2 తర్వాత యశ్.. గీతు మోహన్‌దాస్‌తో సినిమా అనగానే అతనికి పిచ్చెక్కిందేమో అని అనుకున్నానని దిల్ రాజు ఓపెన్‌గా చెప్పారు.

Dil Raju Yash: యశ్‌కి పిచ్చెక్కిందా.. ఈమెతో సినిమా తీస్తున్నాడు అనుకున్నా: దిల్ రాజు షాకింగ్ కామెంట్స్
Dil Raju Yash: యశ్‌కి పిచ్చెక్కిందా.. ఈమెతో సినిమా తీస్తున్నాడు అనుకున్నా: దిల్ రాజు షాకింగ్ కామెంట్స్

'ముంబైలో విజువల్స్ చూశాక మైండ్ పోయింది!'

తెలుగు రాష్ట్రాల్లో 'టాక్సిక్' సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్న దిల్ రాజు ఈ ఈవెంట్‌లో తన మనసులోని మాటను బయటపెట్టారు. కేజీఎఫ్ తర్వాత యశ్ ఇంకా పెద్ద ప్రాజెక్ట్ చేస్తాడని ప్రతి ఒక్కరూ అనుకున్నారని, కానీ గీతు మోహన్‌దాస్ పేరు చెప్పగానే అందరికీ డౌట్ వచ్చిందని అన్నారు. అయితే ముంబైలో ఈ సినిమా విజువల్స్ చూశాక యశ్ విజన్ ఏంటో అర్థమైందని, అతని కాన్ఫిడెన్స్‌కు హ్యాట్సాఫ్ చెప్పక తప్పదని ప్రశంసించారు.

రాజమౌళి గారి తర్వాత ఇండియన్ సినిమాను పాన్ వరల్డ్ లెవెల్‌కు తీసుకెళ్తున్న దర్శకులు, హీరోలకు దిల్ రాజు థ్యాంక్స్ చెప్పారు. కేవలం విజన్, గట్స్ ఉన్నప్పుడే ఇలాంటి గ్రాండ్ సినిమాలు సాధ్యమవుతాయని అన్నారు. ప్రొడ్యూసర్లు ఎంత అడిగితే అంత ఇచ్చి మరీ తెలుగు స్టేట్స్‌లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నామని స్పష్టం చేశారు.

2,000 కోట్ల కలెక్షన్లు పక్కా.. గీతు మోహన్‌దాస్ ఎమోషనల్

ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ మిశ్రా 'టాక్సిక్' దాదాపు రూ.2,000 కోట్లు కలెక్ట్ చేస్తుందని చెప్పారని, అది టీమ్ కాన్ఫిడెన్స్‌కు నిదర్శనమని దిల్ రాజు చెప్పారు. త్వరలోనే యశ్ తో కలిసి పని చేయడానికి తాను వెయిట్ చేస్తున్నానని, ఆ కాంబినేషన్ అనౌన్స్‌మెంట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని వెల్లడించారు.

మరోవైపు ఈవెంట్‌లో డైరెక్టర్ గీతు మోహన్‌దాస్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అందరూ తన సామర్థ్యాన్ని అనుమానించిన టైమ్‌లో యశ్ తన కలపై నమ్మకం ఉంచి ప్రాజెక్ట్‌ను భుజాన వేసుకున్నాడని చెప్పారు. ఫ్యాన్స్ పెట్టుకున్న నమ్మకాన్ని 'టాక్సిక్' థియేటర్లలో ఖచ్చితంగా నిలబెట్టుకుంటుందని ఆమె నమ్మకంగా చెప్పారు.

తండ్రీ కొడుకులుగా యశ్ డబుల్ రోల్.. ట్రోల్స్‌పై క్లారిటీ

'టాక్సిక్: ఏ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్' ఒక పీరియడ్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కింది. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ, యశ్ స్వయంగా మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ ద్వారా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో యశ్ తండ్రీ కొడుకులుగా డబుల్ రోల్‌లో కనిపించనుండడం విశేషం. లేడీ సూపర్‌స్టార్ నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్ లాంటి భారీ తారగణం ముఖ్య పాత్రలు పోషించారు.

ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్‌పై సోషల్ మీడియాలో కొంత నెగెటివిటీ వచ్చినా టీమ్ తగ్గడం లేదు. టీజర్‌లో గ్లామర్ సీన్స్, 'తబాహీ' పాటలో కియారా అద్వానీ బోల్డ్ సీన్స్, ట్రైలర్‌లో మహిళలను చూపించిన విధానంపై వచ్చిన ట్రోల్స్‌కు యశ్ గట్టిగా ఆన్సర్ ఇచ్చారు. థియేటర్లలో సినిమా చూస్తున్నప్పుడు అమ్మాయిలు బాగా ఎంజాయ్ చేస్తారని యశ్ ధీమా వ్యక్తం చేశారు. ఈ క్రేజీ యాక్షన్ థ్రిల్లర్ ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More