గేమ్ ఛేంజర్ తీసి పెద్ద తప్పు చేశాను.. పెద్ద డైరెక్టర్‌తో సినిమా తీసి దెబ్బ తిన్నాను: దిల్ రాజు షాకింగ్ కామెంట్స్

గేమ్ ఛేంజర్ మూవీ చేయడం తన తప్పే అని, పెద్ద డైరెక్టర్ తో సినిమా వల్ల దెబ్బ తిన్నానని ప్రముఖ నిర్మాత దిల్ రాజు అన్నాడు. రామ్ చరణ్ మూవీపై అతడు చేసిన కామెంట్స్ షాక్ కు గురి చేస్తున్నాయి. అసలు అతడు ఎందుకలా అన్నాడో ఒకసారి చూద్దాం.

Jun 23, 2025, 21:01:43 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రామ్ చరణ్ లీడ్ రోల్లో నటించిన గేమ్ ఛేంజర్ మూవీ డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలుసు కదా. ఈ సినిమాపై తాజాగా ప్రొడ్యూసర్ దిల్ రాజు స్పందించాడు. తమ్ముడు మూవీ ప్రమోషన్లలో భాగంగా ఎం9 న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దిల్ రాజు ఆ సినిమాపై స్పందిస్తూ.. తాను తప్పు చేశానని అంగీకరించాడు.

గేమ్ ఛేంజర్ తీసి పెద్ద తప్పు చేశాను.. పెద్ద డైరెక్టర్‌తో సినిమా తీసి దెబ్బ తిన్నాను: దిల్ రాజు షాకింగ్ కామెంట్స్
గేమ్ ఛేంజర్ తీసి పెద్ద తప్పు చేశాను.. పెద్ద డైరెక్టర్‌తో సినిమా తీసి దెబ్బ తిన్నాను: దిల్ రాజు షాకింగ్ కామెంట్స్

గేమ్ ఛేంజర్ తప్పు నా వైఫల్యమే..

ఈ ఇంటర్వ్యూలో భాగంగా దిల్ రాజు గేమ్ ఛేంజర్మూవీపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. దిల్ రాజు అంటే ఇండస్ట్రీలో జడ్జిమెంట్, ఫిల్మ్ మేకింగ్ లో ఎక్స్‌పీరియన్స్ అనే బ్రాండ్ ఉంది.. మీరు తీసే సినిమాలో మీకు తెలియకుండా ఏమీ జరగదంటారు.. కానీ గేమ్ ఛేంజర్ విషయంలో అలా ఎందుకు జరిగింది అని యాంకర్ ప్రశ్నించారు. దీనిపై దిల్ రాజు ఇలా స్పందించాడు.

“పెద్ద సినిమాలు, పెద్ద డైరెక్టర్లతో చేసినప్పుడు 100 శాతం ఆ సమస్య ఉంటుంది. దిల్ రాజుకే కాదు.. అందరికీ ఆ సమస్య ఉంటుంది. సినిమాను 4.5 గంటలు తీశారని ఎడిటర్ ఇచ్చిన స్టేట్మెంట్ నిజం. పెద్ద డైరెక్టర్ సినిమా చేస్తున్నప్పుడు ఎక్కువగా జోక్యం చేసుకోలేం. అవుతే రోజూ కిచిడీ ఉంటుంది.. రోజూ కిచిడీ కావాలా.. మొత్తం అయిపోయాక ఒకేసారి చూసుకోవాలా అన్నది నిర్ణయించుకోవాలి. తప్పు జరిగినప్పుడు ప్రొడ్యూసర్ ఆపాలి. దానిని ఆపలేకపోయానంటే అది నా వైఫలమ్యే” అని దిల్ రాజు స్పష్టం చేశాడు.

పెద్ద డైరెక్టర్‌తో చేయడమే తప్పు

దీనిపై దిల్ రాజు మరిన్ని వివరాలు కూడా చెప్పాడు. “అలాంటి ప్రాజెక్టును నేను చేయకూడదు. నా కెరీర్లో 60 వరకు సినిమాలు తీశాను. కానీ ఎప్పుడూ పెద్ద డైరెక్టర్లతో సినిమాలు చేయలేదు. అందువల్ల నా మొదటి తప్పుడు నిర్ణయం అదే. పెద్ద డైరెక్టర్ తో తీస్తున్నప్పుడు ముందే కాంట్రాక్ట్ లో క్లియర్ గా నా పాయింట్లు పెట్టి సినిమాకు వెళ్లాలి.

అలా వెళ్లలేకపోయాను. అది నా తప్పు. ఆ తప్పును అంగీకరించి దానిని అక్కడితో వదిలేశాను. అది మన స్కూల్ కాదు. అలా కానప్పుడు దాని గురించి ఎక్కువ ఆలోచించడం వేస్ట్” అని దిల్ రాజు అన్నాడు. అయితే ఈ సినిమాను చివరి నిమిషం వరకూ చూడలేదన్న ఆరోపణలపైనా అతడు స్పందిస్తూ.. అది మాత్రం తప్పని, తాను ముందే సినిమా చూశానని చెప్పాడు.

ఇక ఇదే గేమ్ ఛేంజర్ మూవీపై మరో ప్రెస్ మీట్లోనూ దిల్ రాజు స్పందించాడు. తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.186 కోట్లు వసూలు చేసిందన్న పోస్టర్ మీరే వేశారా అని ప్రశ్నించగా.. మాకు కొన్ని బలహీనతలు ఉంటాయి కాబట్టి దీనిపై ఏమీ మాట్లాడలేమని అతడు అనడం గమనార్హం.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More