Diljit Dosanjh: ఈ సినిమా కోసం హీరో తీసుకున్న రెమ్యునరేషన్ ఒకే ఒక్క రూపాయి.. దీని వెనుక గుండె బరువెక్కించే అసలు నిజం ఇదే

Diljit Dosanjh: జీ5 ఓటీటీలోకి వచ్చి కేవలం 48 గంటల్లోనే నిషేధానికి గురైన మూవీ సత్లూజ్ (Satluj). అయితే ఈ సినిమా కోసం ఇందులో లీడ్ రోల్లో నటించిన దిల్జిత్ దోసాంజ్ కేవలం ఒకే ఒక్క రూపాయి మాత్రమే రెమ్యునరేషన్ గా తీసుకున్నాడన్న విషయం తెలుసా?

Published on: Jul 15, 2026, 20:48:11 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Diljit Dosanjh: పంజాబీ గ్లోబల్ స్టార్ దిల్జిత్ దోసాంజ్ లీడ్ రోల్ ప్లే చేసిన 'సత్లూజ్' (Satluj) సినిమా తెలుసు కదా. ఈ మూవీ కోసం ఆయన కేవలం ఒక్క రూపాయి మాత్రమే రెమ్యునరేషన్ తీసుకున్నారనే షాకింగ్ విషయాన్ని డైరెక్టర్ హనీ ట్రెహాన్ బయటపెట్టారు. మానవ హక్కుల ఉద్యమకారుడు జస్వంత్ సింగ్ ఖల్రా రియల్ లైఫ్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా చుట్టూ జరుగుతున్న వివాదాల మధ్య ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

Diljit Dosanjh: ఈ సినిమా కోసం హీరో తీసుకున్న రెమ్యునరేషన్ ఒకే ఒక్క రూపాయి.. దీని వెనుక గుండె బరువెక్కించే అసలు నిజం ఇదే
Diljit Dosanjh: ఈ సినిమా కోసం హీరో తీసుకున్న రెమ్యునరేషన్ ఒకే ఒక్క రూపాయి.. దీని వెనుక గుండె బరువెక్కించే అసలు నిజం ఇదే

జీ5 ఓటీటీ వివాదం.. 48 గంటల్లోనే తొలగింపు

భారీ అంచనాల మధ్య జులై 3, 2026 న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 (Zee5)లో ఈ సినిమా సైలెంట్‌గా రిలీజైంది. అయితే సెన్సార్ సర్టిఫికేషన్ వివాదాల కారణంగా కేవలం 48 గంటల్లోనే ఈ సినిమాను ప్లాట్‌ఫామ్ నుంచి తొలగించారు.

కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన అభ్యంతరాల వల్ల సినిమా స్ట్రీమింగ్ ఆగిపోయినప్పటికీ, ఈ ప్రాజెక్ట్ కోసం హీరో దిల్జిత్ దోసాంజ్ చూపించిన డెడికేషన్ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

దిల్జిత్ లేకుండా ఈ ప్రాజెక్ట్ సాధ్యం కాదు

సినిమా కాస్టింగ్ గురించి డైరెక్టర్ హనీ ట్రెహాన్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. దిల్జిత్ ఈ సినిమాలో నటించకపోయి ఉంటే అసలు ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కేదే కాదని స్పష్టం చేశారు. ఈ సినిమాకు పక్కా పంజాబీ సర్దార్ లుక్ ఉన్న నటుడే కావాలని, బాలీవుడ్ హీరోలను పెడితే ఆ ఒరిజినాలిటీ రాదని హనీ ట్రెహాన్ భావించారు. జస్వంత్ సింగ్ ఖల్రా సాహబ్ జీవితాన్ని, పంజాబ్ ప్రజలు అనుభవించిన బాధను కరెక్ట్‌గా తెరపై చూపించాలనే ఉద్దేశంతోనే ఆయన దిల్జిత్‌ను సంప్రదించారు.

30 నిమిషాల మీటింగ్.. 'వాహేగురు' అంటూ దండం పెట్టిన స్టార్

2021 లో హనీ ట్రెహాన్ ఈ సినిమా స్క్రిప్ట్ తో పాటు తన రిసెర్చ్ పేపర్స్‌ను దిల్జిత్ దోసాంజ్‌కు చూపించారు. జస్వంత్ సింగ్ ఖల్రా ఫోటోను చూడగానే దిల్జిత్ ఎమోషనల్ అయిపోయి సీట్ లోంచి లేచి నిలబడ్డారు. స్క్రిప్ట్‌ను తన నొసటికి తాకించుకుని "వాహేగురు" అని భక్తితో దండం పెట్టుకున్నారు.

"ఖల్రా లాంటి గొప్ప దేశభక్తుడి పాత్రలో నటిస్తూ నేను డబ్బులు ఎలా తీసుకోగలను? అది చాలా అవమానకరం" అంటూ ఉచితంగా చేయడానికి ఒప్పుకున్నారు. కానీ అగ్రిమెంట్ ఫార్మాలిటీస్ కోసం డైరెక్టర్ పట్టుబట్టడంతో కేవలం ఒక్క రూపాయి మాత్రమే ఫీజుగా తీసుకున్నారు.

ఎవరీ జస్వంత్ సింగ్ ఖల్రా?

పంజాబ్‌లో 1990ల కాలంలో జస్వంత్ సింగ్ ఖల్రా ఒక సాధారణ బ్యాంక్ క్లర్క్‌గా ఉండేవారు. ఆ తర్వాత ఆయన మానవ హక్కుల పోరాట యోధుడిగా మారి పంజాబ్‌లో అక్రమంగా దహనం చేసిన 25 వేల మంది వివరాలను సేకరించి సంచలనం సృష్టించారు.

ఈ క్రమంలోనే 1995 లో ఆయనను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు అపహరించి, పోలీస్ కస్టడీలోనే దారుణంగా హత్య చేశారు. ఈ చారిత్రక సత్యాల ఆధారంగానే 'సత్లూజ్' సినిమాను ఎంతో నిజాయితీగా తెరకెక్కించారు హనీ ట్రెహాన్.

షూటింగ్ సెట్ లో దిల్జిత్ చూపించిన పెద్ద మనసు

దిల్జిత్ కేవలం రెమ్యునరేషన్ విషయంలోనే కాకుండా షూటింగ్ లో కూడా చిత్ర యూనిట్‌కు ఎంతో సపోర్ట్ ఇచ్చారు. కొన్నిసార్లు ఉదయం 6 గంటలకే దిల్జిత్ మేకప్ వేసుకుని సెట్ లో రెడీగా ఉండేవారట. కానీ వేర్వేరు కారణాల వల్ల సాయంత్రం 4 గంటల వరకు ఆయన ఫస్ట్ షాట్ తీయడానికి కుదిరేది కాదు.

ఈ ఆలస్యానికి డైరెక్టర్ క్షమాపణలు చెప్పిన ప్రతిసారీ, "పాజీ.. పర్వాలేదు, మనం ఏం చేసినా సినిమా కోసమే కదా, నేను ఇక్కడ సపోర్ట్ చేయడానికే ఉన్నాను" అంటూ దిల్జిత్ కూల్‌గా సమాధానం చెప్పేవారని హనీ ట్రెహాన్ గుర్తు చేసుకున్నారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More