ఇద్దరు హీరోయిన్లతో రాజు గాని సవాల్ ట్రైలర్ రిలీజ్.. డింపుల్ హయాతి, రాశి సింగ్ ఏం చెప్పారంటే?
తెలుగులో ఫ్యామిలీ డ్రామా చిత్రంగా వస్తోన్న సినిమా రాజు గాని సవాల్. లెలిజాల రవీందర్, రితికా చక్రవర్తి హీరో హీరోయిన్లుగా నటించిన రాజు గాని సవాల్ ట్రైలర్‌ను శుక్రవారం (జులై 18) ఇద్దరు బ్యూటిఫుల్ హీరోయిన్స్ డింపుల్ హయాతి, రాశి సింగ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా డింపుల్ హయాతి, రాశి సింగ్ కామెంట్స్ చూద్దాం.
లెలిజాల రవీందర్, రితికా చక్రవర్తి హీరో హీరోయిన్‌లుగా నటిస్తున్న సినిమా "రాజు గాని సవాల్". ఈ చిత్రాన్ని లెలిజాల కమల ప్రజాపతి సమర్పణలో, ఎల్‌ఆర్ ప్రొడక్షన్ బ్యానర్‌పై లెలిజాల రవీందర్ నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు.

రాజు గాని సవాల్ రిలీజ్ డేట్
రాజు గాని సవాల్ సినిమా రక్షా బంధన్పండుగ సందర్భంగా ఆగస్టు 8న శ్రీ లక్ష్మి పిక్చర్స్ ద్వారా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. శుక్రవారం "రాజు గాని సవాల్" సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్స్ డింపుల్ హయాతి, రాశి సింగ్‌తోపాటు తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు భారత్ భూషణ్, ప్రొడ్యూసర్స్ దామోదర ప్రసాద్, తుమ్మలపల్లి రామ సత్య నారాయణ, ప్రసన్నకుమార్, గీత రచయిత గోరటి వెంకన్న, నటుడు డా. భద్రం ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
హీరోయిన్స్ కామెంట్స్
రాజు గాని సవాల్ ట్రైలర్‌ను హీరోయిన్స్ డింపుల్ హయాతి, రాశి సింగ్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా డింపుల్ హయాతి, రాశి సింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆ విశేషాలు చూద్దాం.
హీరోయిన్ డింపుల్ హయాతి మాట్లాడుతూ.. "రాజు గాని సవాల్ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా రావడం హ్యాపీగా ఉంది. ఈ మూవీ ట్రైలర్, సాంగ్స్ చాలా బాగున్నాయి. నేను కెరీర్ ప్రారంభించిన కొత్తలో కలిసిన, సినిమా మీద ప్రేమ ఉన్న ముగ్గురు వ్యక్తులు బాపిరాజు గారు, సునీల్ కుమార్ రెడ్డి గారు, రవీందర్ రెడ్డి గారు" అని అన్నారు.
మొదటి అవకాశం ఇచ్చారు
"ఈ అమ్మాయి బాగుంటుందని నాకు మొదటి సినిమా అవకాశం ఇచ్చారు ఈ ముగ్గురు. రాజు గాని సవాల్ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు మీరు వస్తారా అని బాపిరాజు గారు అడిగినప్పుడు తప్పకుండా వస్తా సార్ అని చెప్పాను" అని డింపుల్ హయాతి తెలిపింది.
"బాపిరాజు గారు సినిమాను సినిమాను రూపొందించడమే కాదు ప్రేక్షకుల దగ్గరకు రీచ్ అయ్యేలా చేస్తారు. రాజు గాని సవాల్ సినిమా సినిమా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. ఈ మూవీ రిలీజ్ కోసం నేనూ ఎదురుచూస్తున్నా" అని డింపుల్ హయాతి చెప్పుకొచ్చింది.
నమ్మకాన్ని నిలబెట్టాలి
హీరోయిన్ రాశీ సింగ్ మాట్లాడుతూ.. "ఈ ఈవెంట్‌కు వచ్చే ముందే రాజు గాని సవాల్ సినిమా ట్రైలర్ చూశాను. చాలా బాగుంది. ఇదొక ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా మూవీ. హీరో రవీందర్ గారితో పాటు రితిక, సంధ్య బాగా నటించారు" అని తెలిపింది.
"ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తున్న సందర్భంగా టీమ్ అందరికీ కంగ్రాట్స్ చెబుతున్నా. బాపిరాజు గారి నమ్మకాన్ని ఈ మూవీ నిలబెట్టాలి. రాజు గాని సవాల్ సినిమా ఘన విజయాన్ని సాధిస్తుందని ఆశిస్తున్నా" అని రాశి సింగ్ చెప్పింది.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper



