హీరోగా మారిన మరో కమెడియన్ ప్రవీణ్.. బకాసుర రెస్టారెంట్ ర్యాప్ సాంగ్ రిలీజ్.. ఐడియా బాగుందన్న డైరెక్టర్ అనిల్ రావిపూడి

టాలీవుడ్ కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రవీణ్ హీరోగా మారాడు. ప్రవీణ్ ప్రధాన పాత్రలో తెరకక్కిన సినిమా బకాసుర రెస్టారెంట్. టైటిల్ రోల్‌లో వైవా హర్ష చేస్తున్న బకాసుర రెస్టారెంట్ నుంచి టైటిల్ ర్యాంప్ సాంగ్‌ను డైరెక్టర్ అనిల్ రావిపూడి విడుదల చేశారు. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి కామెంట్స్ చేశారు.

Published on: Jul 6, 2025, 08:07:18 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టాలీవుడ్‌లో మరో కమెడియన్ హీరోగా మారాడు. తన నటనతో, డైలాగ్‌ డెలివరితో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాందించుకున్న క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌, కమెడియన్ ప్రవీణ్‌ ప్రధాన పాత్రలో హీరోగా రూపొందుతున్న చిత్రం 'బకాసుర రెస్టారెంట్‌'.

హీరోగా మారిన మరో కమెడియన్ ప్రవీణ్.. బకాసుర రెస్టారెంట్ ర్యాప్ సాంగ్ రిలీజ్.. ఐడియా బాగుందన్న డైరెక్టర్ అనిల్ రావిపూడి
హీరోగా మారిన మరో కమెడియన్ ప్రవీణ్.. బకాసుర రెస్టారెంట్ ర్యాప్ సాంగ్ రిలీజ్.. ఐడియా బాగుందన్న డైరెక్టర్ అనిల్ రావిపూడి

టైటిల్ రోల్‌లో వైవా హర్ష

బకాసుర రెస్టారెంట్ చిత్రంలో వైవా హర్ష టైటిల్‌ రోల్‌లో నటిస్తున్నారు. కృష్ణభగవాన్‌, షైనింగ్‌ ఫణి, కేజీఎఫ్ గరుడరామ్‌ ఇతర ముఖ్య పాత్రలో యాక్ట్‌ చేస్తున్నారు. ఎస్‌జే శివ దర్శకుడిగా పరిచయం కాబోతున్న ఈ చిత్రాన్ని ఎస్‌జే మూవీస్‌ పతాకంపై లక్ష్మయ్య ఆచారి, జనార్థన్‌ ఆచారి నిర్మిస్తున్నారు.

బకాసుర టైటిల్ ర్యాప్ సాంగ్

చిత్రీకరణ పూర్తిచేసుకున్న బకాసుర రెస్టారెంట్ విడుదలకు సిద్దమైంది. హంగర్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలోని బకాసుర టైటిల్‌ ర్యాప్‌ సాంగ్‌ను బ్లాక్‌ బస్టర్‌ మాస్‌ దర్శకుడు అనిల్‌ రావిపూడి విడుదల చేశారు. వికాస బడిస స్వరాలు సమాకూర్చిన ఈ పాటను ర్యాప్‌సింగర్రోల్‌ రైడా, వికాస బడిస ఆలపించారు.

చాలా కొత్తగా అనిపించింది

ఈ సందర్భంగా సంక్రాంతికి వస్తున్నాం డైరెక్టర్ అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ.. "బకాసుర రెస్టారెంట్‌ టైటిల్‌తో పాటు ఈ పాట కూడా బాగుంది. చాలా కొత్తగా అనిపించింది. ఈ సినిమా ఐడియా బాగుంది" అని అన్నారు.

ప్రవీణ్ హీరోగా

"నటుడు ప్రవీణ్‌ నాకు మొదట్నుంచి తెలుసు. ప్రవీణ్‌ హీరోగా రాబోతున్న ఈ చిత్రం మంచి సక్సెస్‌ కావాలి. తొలి చిత్ర దర్శకుడు ఎస్‌జే శివతో పాటు అందరికి ఈ చిత్రం మంచి పేరును తీసుకురావాలి" అని డైరెక్టర్ అనిల్ రావిపూడి ఆకాంక్షించారు.

థ్రిల్లింగ్‌తోపాటు వినోదం

అలాగే, ఈ సందర్బంగా దర్శకుడు ఎస్‌జే శివ మాట్లాడుతూ.. "హంగర్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రతి సన్నివేశం ఆడియన్స్‌కు థ్రిల్లింగ్‌తో పాటు వినోదాన్ని కూడా పంచుతుంది. ఓ ఇన్నోవేటివ్‌ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం తప్పకుండా అందర్ని అలరిస్తుందనే నమ్మకం ఉంది" అని అన్నారు.

త్వరలో బకాసుర రెస్టారెంట్ రిలీజ్ డేట్

"అతి త్వరలో బకాసుర రెస్టారెంట్ విడుదల తేదిని ప్రకటిస్తాం. అనిల్‌ రావిపూడి గారు మా సాంగ్‌ను విడుదల చేయడం సంతోషంగా ఉంది. తప్పకుండా ఈ చిత్రం అందరికి నచ్చుతుంది" అని నమ్మకంగా చెప్పారు దర్శకుడు ఎస్‌జే శివ.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More