మాలాంటి ఎంతోమంది డైరెక్టర్స్ అయ్యారంటే ఆయన పెట్టిన బిక్ష.. చిరంజీవి వాల్తేరు వీరయ్య డైరెక్టర్ బాబీ కామెంట్స్

చిరంజీవితో వాల్తేరు వీరయ్య వంటి సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన డైరెక్టర్ బాబీ అలియాస్ కేఎస్ రవీంద్ర. రవితేజ, డింపుల్ హయాతి, ఆషిక రంగనాథ్ హీరో హీరోయిన్లుగా నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన డైరెక్టర్ బాబీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Published on: Jan 13, 2026, 17:28:58 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మెగాస్టార్ చిరంజీవితో వాల్తేరు వీరయ్య వంటి సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన టాలీవుడ్ డైరెక్టర్ బాబీ కొల్లి అలియాస్ కేఎస్ రవీంద్ర. రవితేజ పవర్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన బాబీ జూనియర్ ఎన్టీఆర్‌తో జై లవకుశ, వెంకీ మామ, సర్దార్ గబ్బర్ సింగ్ వంటి సినిమాలు తెరకెక్కించాడు.

మాలాంటి ఎంతోమంది డైరెక్టర్స్ అయ్యారంటే ఆయన పెట్టిన బిక్ష.. చిరంజీవి వాల్తేరు వీరయ్య డైరెక్టర్ బాబీ కామెంట్స్
మాలాంటి ఎంతోమంది డైరెక్టర్స్ అయ్యారంటే ఆయన పెట్టిన బిక్ష.. చిరంజీవి వాల్తేరు వీరయ్య డైరెక్టర్ బాబీ కామెంట్స్

బాలకృష్ణతో డాకు మహారాజ్

అనంతరం చిరంజీవితో వాల్తేరు వీరయ్య, బాలకృష్ణతో డాకు మహారాజ్ మూవీస్ తీసి బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు డైరెక్టర్ బాబీ. అలాంటి బాబీ అతిథిగా భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరయ్యారు.

సంక్రాంతి సందర్భంగా రిలీజ్

మాస్ మహారాజా రవితేజ, డింపుల్ హయాతి, ఆషిక రంగనాథ్ హీరో హీరోయిన్లుగా నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాకు కిషోర్ తిరుమల దర్శకత్వం వహించారు. సంక్రాంతి సందర్భంగా ఇవాళ (జనవరి 13) థియేటర్లలో విడుదలైంది భర్త మహాశయులకు విజ్ఞప్తి.

ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో డైరెక్టర్ బాబీ

కామెడీ టాక్ బాగా తెచ్చుకుంటోన్న భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ఇటీవల జరిగింది. ఈ ఈవెంట్‌లో డైరెక్టర్ బాబీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు అవి వైరల్ అవుతున్నాయి.

అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్న మమ్మల్ని

డైరెక్టర్ బాబీ మాట్లాడుతూ.. "మాలాంటి ఎంతో మంది డైరెక్టర్స్ అయ్యారంటే అది రవితేజ గారు పెట్టిన బిక్ష. అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్న మమ్మల్ని డైరెక్టర్లను చేశారు. త్వరలోనే ఆయనతో సినిమా చేస్తాను" అని అన్నారు.

డైలాగ్స్ విషయంలో హెల్ప్ చేశారు

"రవితేజ గారు ఎన్నో డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్న సినిమాలు చేశారు. పవర్ సినిమా టైంలో డైరెక్టర్ కిషోర్ డైలాగ్స్ విషయంలో నాకు చాలా హెల్ప్ చేశారు. కచ్చితంగా తన నిజాయితీ తన హార్డ్ వర్క్ ఈ సినిమాకి పే చేస్తుంది. ఈ సినిమాల్లో పని చేసిన అందరికీ అభినందనలు" అని డైరెక్టర్ బాబీ తెలిపారు.

ఆయన చెబితే బ్లాక్ బస్టర్

"ప్రసాద్ మూరెళ్ల రవితేజ గారిని చాలా అందంగా చూపించారు. బీమ్స్ బ్లాక్ బస్టర్ సాంగ్స్ ఇచ్చాడు. ఈ సినిమా చాలా ఎక్స్‌ట్రార్డినరీగా ఉందని ఓ పర్సన్ చెప్పారు. ఆయనే చెబితే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్. అందరికీ ఆల్ ది బెస్ట్" అని దర్శకుడు కేఎస్ రవీంద్ర తన స్పీచ్ ముగించారు.

బీఎండబ్ల్యూ రైడ్‌కు

ఇదే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి మాట్లాడుతూ.. "జనవరి 13న మా బీఎండబ్ల్యూ(భర్త మహాశయులకు విజ్ఞప్తి) రైడ్‌కు వెళ్లండి. కచ్చితంగా అదిరిపోతుంది" అని అన్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More