...
...
Next Story

ప‌వ‌న్ క‌ల్యాణ్‌ ఫ్యాన్స్ కు కిక్కిచ్చే న్యూస్ చెప్పిన డైరెక్ట‌ర్‌.. హ‌రిహ‌ర వీర‌మ‌ల్లులో ఆ యాక్ష‌న్ సీక్వెన్స్ హైలైట్‌

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు రిలీజ్ మరోసారి వాయిదా పడిన సంగతి తెలిసిందే. కానీ ఈ మూవీ బజ్ మాత్రం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ సినిమా గురించి డైరెక్టర్ చేసిన కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి. యాక్షన్ సీక్వెన్స్ మరో రేంజ్ లో ఉన్నాయంటూ అంచనాలు పెంచేశారు.

Published on: Jun 7, 2025, 16:42:13 IST
By ,
Prefer HTon Google
Advertisement

హరిహర వీరమల్లు రిలీజ్ కోసం ఎంతో వెయిట్ చేసిన ఫ్యాన్స్ కు నిరాశ తప్పలేదు. జూన్ 12న రిలీజ్ కావాల్సిన మూవీ మరోసారి వాయిదా పడింది. థియేట్రికల్ రిలీజ్ పోస్ట్ పోన్ అయింది. అయినా ఈ మూవీ గురించి క్రేజీ బజ్ కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ మూవీపై అంచనాలను మరింత పెంచేసేలా హరిహర వీరమల్లు డైరెక్టర్ జ్యోతికృష్ణ‌ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

సీజ్ ద షిప్

హరిహర వీరమల్లులో పవన్ కల్యాణ్, నిధి అగర్వాల్ (x/ Mega Surya Production)
హరిహర వీరమల్లులో పవన్ కల్యాణ్, నిధి అగర్వాల్ (x/ Mega Surya Production)

జనసేన పార్టీ స్థాపించి రాజకీయాల్లోకి వచ్చిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కొన్ని నెలల కిందట కాకినాడ పోర్టులో బియ్యం అక్రమ రవాణాపై పవన్ మండిపడ్డారు. ఆ సందర్భంగా ‘సీజ్ ద షిప్’ అంటూ పవన్ చెప్పిన డైలాగ్ ఫేమస్ గా మారిన సంగతి తెలిసిందే. హరిహర వీరమల్లులోనూ ‘సీజ్ ద షిప్’ అనే మాటను రీ క్రియేట్ చేసినట్లు యాక్షన్ ఎపిసోడ్ ఉంటుందని జ్యోతికృష్ణ‌ తెలిపారు.

భారీ యాక్షన్ సీక్వెన్స్

మచిలీపట్నంలో జరిగిన బీచ్ ఫెస్టివల్ లో హరిహర వీరమల్లు డైరెక్టర్ జ్యోతికృష్ణ‌, హీరోయిన్ నిధి అగర్వాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మూవీలోని భారీ యాక్షన్ సీక్వెన్స్ గురించి జ్యోతికృష్ణ‌ చేసిన వ్యాఖ్యలు ఫ్యాన్స్ కు ఫుల్ కిక్కిచ్చేలా ఉన్నాయి. ‘‘బందరు పోర్ట్ కు సంబంధించి మన సినిమాలో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉంది. పోర్ట్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే ఈ సీక్వెన్స్ ను ప్రేక్షకులు ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. కథకు తగిన విధంగా సీజీలో ఈ పోర్ట్ రీ క్రియేట్ చేయడానికి రెండేళ్లు కష్టపడ్డాం’’ అని జ్యోతికృష్ణ‌ అన్నారు.

మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్

పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు మూవీని క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ‌ కలిసి డైరెక్ట్ చేశారు. ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్. మెగా సూర్య ప్రొడక్షన్ పై ఏఎం రత్నం ఈ మూవీని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకొంటున్న ఈ మూవీ బడ్జెట్ రూ.250 కోట్లు అని డైరెక్టర్ జ్యోతికృష్ణ‌ వెల్లడించారు.

‘‘పవన్ కల్యాణ్ తో వర్క్ చేసే అవకాశం దొరకడం నా లక్. ఎవరిలో టాలెంట్ ఉన్నా ఆయన గుర్తిస్తారు. ఒక్కసారి నమ్మితే ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. నన్ను నమ్మి నాతో సినిమా చేశారు. ఇప్పటికే ఆయన ఒక్కసారి కాదు మూడు సార్లు సినిమా చూశారు. నన్నెంతో మెచ్చుకుంటూ.. నాతో మరో సినిమా చేయాలనుందని చెప్పారు’’ అని జ్యోతికృష్ణ‌ చెప్పారు.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks