ప్రభాస్ ది రాజా సాబ్ 1000 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబడుతుంది.. బెట్టు కట్టిన డైరెక్టర్ మారుతి.. ఎందుకంటే?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ ది రాజా సాబ్. హారర్ కామెడీ జోనర్‌లో ది రాజా సాబ్ సినిమాను డైరెక్టర్ మారుతి తెరకెక్కించారు. ఈ ఏడాదే విడుదల కానున్న ది రాజా సాబ్ రూ. 1000 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబడుతుందని డైరెక్టర్ మారుతి నమ్మకంగా చెప్పారు. అందుకు గల కారణాలపై ఓ లుక్కేద్దాం.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుసపెట్టి సినిమాలతో జోరు మీద ఉన్నాడు. ఆదిపురుష్, సలార్, కల్కి 2898 ఏడీ సినిమాలతో అలరించిన ప్రభాస్ స్పిరిట్ మూవీతో బిజీగా ఉన్నాడు. అయితే, ప్రభాస్ నుంచి ఈ ఏడాది వచ్చే సినిమా ది రాజా సాబ్.

హారర్ కామెడీ జోనర్
హారర్ కామెడీ జోనర్‌లో ది రాజా సాబ్ సినిమాను డైరెక్టర్ మారుతి తెరకెక్కించారు. మొదటిసారిగా ఇలాంటి జోనర్‌లో ప్రభాస్ నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే, మారుతి-ప్రభాస్ కాంబినేషన్‌లో కూడా ఇదే మొదటి సినిమా. ఇక రీసెంట్‌గా జూన్ 16న ది రాజా సాబ్ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేయగా దానికి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.
ఎప్పుడు యాక్షన్, లవర్ బాయ్, సీరియస్ రోల్స్‌లో చూసిన ప్రభాస్ను చాలా కాలం తర్వాత కామెడీ టైమింగ్‌తో కనిపించేసరికి అటు అభిమానులు ఇటు ప్రేక్షకులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. దాంతో యూట్యూబ్లో ది రాజా సాబ్ మిలియన్స్‌లలో వ్యూస్ తెచ్చుకుంటోంది. వింటేజ్ ప్రభాస్ ఈజ్ బ్యాక్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇంట్రెస్టింగ్ సమాధానాలు
ఇదిలా ఉంటే, ఇటీవల మీడియాతో జరిగిన ఇంటర్వ్యూలో డైరెక్టర్ మారుతి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మీడియా అడిగిన ప్రశ్నలకు ఇంట్రెస్టింగ్ సమాధానాలు ఇచ్చారు దర్శకుడు మారుతి. ఈ క్రమంలోనే "ప్రభాస్ మునుపటి సినిమాల స్థాయిని ది రాజా సాబ్ చేరుకుంటుందా? అని డైరెక్టర్‌ను మీడియా ప్రశ్నించింది.
ప్రభాస్ గత సినిమాల కలెక్షన్ల దృష్ట్యా మీడియా అడిగిన ప్రశ్నకు డైరెక్టర్ మారుతి ఆసక్తికర సమాధానం ఇచ్చారు. "బాహుబలి ఫ్రాంచైజీ, కల్కి సినిమాలు బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్స్ రాబట్టాయి. అలాగే, ఎలాంటి సందేహం లేకుండా ఈ సినిమా (ది రాజా సాబ్) కూడా రూ. 1000 కోట్లు దాటుతుంది" అని బెట్టు కట్టినట్లుగా నమ్మకంగా చెప్పారు డైరెక్టర్ మారుతి.
మారుతి కామెంట్స్ వైరల్
దీంతో సోషల్ మీడియాలో దర్శకుడు మారుతి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అయితే, మారుతి చెప్పినట్లుగా ది రాజా సాబ్ వెయ్యి కోట్ల కలెక్షన్స్ దాటే అవకాశం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రభాస్‌కు మంచి మార్కెట్ ఉంది. కాబట్టి, భారత్‌లోనే కాకుండా ఇతర దేశాల్లో ది రాజా సాబ్ మంచి వసూల్లు రాబట్టే ఛాన్సు ఉందంటున్నారు.
ఇక ది రాజా సాబ్ టీజర్ చూస్తే కామెడీ కచ్చితంగా వర్కౌట్ అవుతుందనిపిస్తుంది. ముఖ్యంగా ప్రభాస్ కామెడీ టైమింగ్, డైలాగ్స్ అదిరిపోవడంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. అంతేకాకుండా ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ కూడా నటించాడు. ఆయనకున్న క్రేజ్, మార్కెట్ ది రాజా సాబ్‌కు కలిసి రానుంది.
బాక్సాఫీస్ కారణాలు
ఇవే కాకుండా ది రాజా సాబ్ మూవీలో ముగ్గురు హాట్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ సైతం అందాలతో అలరించనున్నారు. ఇలా చాలా అంశాలతో ది రాజా సాబ్ బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్లకుపైగా వసూళ్లు రాబట్టడానికి కారణాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు ట్రేడ్ నిపుణులు.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper



