...
...
Next Story

కేవలం పోలీస్ కథ మాత్రమే కాదు.. మహిళలకు బాగా కనెక్ట్ అవడం సంతోషం.. డైరెక్టర్ రాఘవ్ ఓంకార్ శశిధర్ కామెంట్స్

మొగలి రేకులు సీరియల్‌తో మంచి పేరు తెచ్చుకున్న ఆర్కే సాగర్ చాలా కాలం గ్యాప్ తర్వాత హీరోగా నటించిన సినిమా ది 100. ఈ మూవీకి డైరెక్టర్ రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహించారు. జూలై 11న థియేటర్లలో విడుదలైన ది 100 సినిమాకు మంచి టాక్ రావడంతో దర్శకుడు రాఘవ్ ఓంకార్ మనసులోని భావాలు పంచుకున్నారు.

Published on: Jul 20, 2025, 07:07:58 IST
By , , Hyderabad
Prefer HTon Google
Advertisement

మొగలి రేకులు సీరియల్‌తో విపరీతమైన పాపులారిటీ తెచ్చుకున్న ఆర్కే సాగర్ చాలా కాలం గ్యాప్ తర్వాత సినిమాల్లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆర్కే సాగర్ హీరోగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ది 100. ఓ బాధ్యతాయుతమైన పోలీస్ డ్రామాగా ది 100 సినిమాను తెరకెక్కించి తన మొదటి చిత్రంతోనే దర్శకుడిగా ప్రేక్షకుల మన్ననలు పొందారు డైరెక్టర్ రాఘవ్ ఓంకార్ శశిధర్.

ది 100 మూవీ రెస్పాన్స్

కేవలం పోలీస్ కథ మాత్రమే కాదు.. మహిళలకు బాగా కనెక్ట్ అవడం సంతోషం.. డైరెక్టర్ రాఘవ్ ఓంకార్ శశిధర్ కామెంట్స్
కేవలం పోలీస్ కథ మాత్రమే కాదు.. మహిళలకు బాగా కనెక్ట్ అవడం సంతోషం.. డైరెక్టర్ రాఘవ్ ఓంకార్ శశిధర్ కామెంట్స్

జూలై 11న థియేటర్లలో విడుదలైన ఈ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌ ది 100 మూవీకి వస్తున్న ఆదరణపై డైరెక్టర్ రాఘవ్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు రాఘవ్ ఓంకార్ శశిధర్ తన మనసులోని భావాలను పంచుకున్నారు.

నీతితో కూడిన కథ

ది 100 డైరెక్టర్ రాఘవ్ ఓంకార్ శశిధర్ మాట్లాడుతూ.. "ఈ సినిమా కేవలం పోలీస్ కథ మాత్రమే కాదు. భావోద్వేగం, బాధ్యత, నీతితో కూడిన కథ. ఇందులో నిజాయితీ గల పోలీస్ అధికారి బాధ్యత, బాధ, న్యాయం కోసం పోరాటం చేసే విధానాన్ని చూపించాం" అని అన్నారు.

మంచి అప్లాజ్ వస్తోంది

"థియేటర్లలో సినిమాను చూసి, మమ్మల్ని ఆదరించిన ప్రేక్షకులకు, మాకు సపోర్ట్‌గా నిలిచిన మీడియాకు ధన్యవాదాలు. ముఖ్యంగా మహిళా ప్రేక్షకులు ఈ చిత్రంలోని ఎమోషన్స్‌కు బాగా కనెక్ట్ అవడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఆర్కే సాగర్ పోషించిన ఐపీఎస్ ఆఫీసర్ విక్రాంత్‌ క్యారెక్టర్‌కు మంచి అప్లాజ్ వస్తుంది. మిషా నారంగ్, ధన్య బాలకృష్ణ పాత్రలకు కూడా మంచి గుర్తింపు వచ్చింది" అని దర్శకుడు రాఘవ్ ఓంకార్ తెలిపారు.

నాగబాబు, పవన్ కల్యాణ్ ప్రశంసించడం

"ఈ చిత్రానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గారు, నాగబాబు గారు, అంజనా దేవి గారు, ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ వంటి ప్రముఖుల నుంచి ప్రశంసలు రావడం మరింత ఆనందాన్ని ఇచ్చింది" అని డైరెక్టర్ రాఘవ్ ఓంకార్ శశిధర్ పేర్కొన్నారు.

ఇంత ప్రోత్సాహం ఇచ్చినందుకు

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks