టైటిల్ మీకు ముందే తెలిసిపోయింది, 8 నిమిషాల లాంగ్ సీన్ చేయాలి.. రౌడీ జనార్ధన డైరెక్టర్ రవి కిరణ్ కోలా కామెంట్స్
విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ రౌడీ జనార్ధన. కీర్తి సురేష్ హీరోయిన్‌గా చేస్తున్న ఈ సినిమాకు రవి కిరణ్ కోలా దర్శకత్వం వహించారు. దిల్ రాజు నిర్మించిన రౌడీ జనార్ధన టైటిల్ గ్లింప్స్‌ను నిన్న రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ రవి కిరణ్ కోలా ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పారు.
స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ రౌడీ జనార్ధన. రవి కిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా కీర్తి సురేష్ చేస్తోంది. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

డైరెక్టర్ రవి కిరణ్ కామెంట్స్
తాజాగా డిసెంబర్ 22న రౌడీ జనార్ధన టైటిల్ గ్లింప్స్‌ను హైదరాబాద్‌లో చాలా గ్రాండ్‌గా విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో రౌడీ జనార్ధన డైరెక్టర్ రవి కిరణ్ కోలా సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ విశేషాలు పంచుకున్నారు.
డైరెక్టర్ రవికిరణ్ కోలా మాట్లాడుతూ.. "మీ అందరి లాగే నేను కూడా విజయ్ దేవరకొండ అభిమానిని. నేను అభిమానించే కీర్తి సురేష్, రాజు గారు వంటి వారితో కలిసి ఈ సినిమా చేస్తున్నాను. రౌడీ జనార్థన టైటిల్ మీకు నచ్చిందని అనుకుంటున్నా" అని అన్నారు.
ఆ తర్వాత టైటిల్ రివీల్
"రౌడీ జనార్థన ఎలా ఉంటాడో పరిచయం చేసి ఆ తర్వాత టైటిల్ రివీల్ చేయాలని అనుకున్నాం. కానీ, టైటిల్ మీకు తెలిసిపోయింది. సినిమా అనుకున్నది అనుకున్నట్లుగా వస్తోంది. అందుకు మా టీమ్ మెంబర్స్ చాలా కష్టపడుతున్నారు. ఇకపై మా మూవీ నుంచి రిలీజ్ చేసే కంటెంట్ కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తున్నా" అని రవి కిరణ్ కోలా తెలిపారు.
"ఈ కథ చెప్పిన కొద్దిసేపటికే విజయ్ ఆ క్యారెక్టర్‌లా మాట్లాడటం, చెప్పే సీన్‌కు రౌడీ జనార్థనలా రియాక్ట్ అవడం మొదలుపెట్టాడు. ఇన్‌స్టంట్‌గా క్యారెక్టర్‌ను ఓన్ చేసుకున్నాడు. నాకు ఎంకరేజింగ్‌గా అనిపించి మిగతా స్క్రిప్ట్‌ను ఉత్సాహంగా చెప్పేశాను. ఆ తర్వాత మేము చాలాసేపు మాట్లాడుకున్నాం. అలా ఈ ప్రాజెక్ట్ ఓకే అయ్యింది" అని దర్శకుడు రవి కిరణ్ కోలా వెల్లడించారు.
డైలాగ్స్ మొత్తం చెప్పేసాడు
"వర్క్ షాప్స్ అన్నీ చేసి ఫస్ట్ డే షూట్ కోసం సెట్ రెడీ చేస్తున్నాం. 8 నిమిషాల లాంగ్ సీన్ చేయాలి. ఆ ముందు రోజే విజయ్ సెట్‌లోకి వచ్చి ఆ డైలాగ్స్ మొత్తం చెప్పేస్తున్నాడు. అప్పుడు చాలా కాన్ఫిడెంట్‌గా అనిపించింది" అని చెప్పారు రవి కిరణ్ కోలా.
"ఈస్ట్ గోదావరి యాసలో విజయ్ గారు చాలా ఆక్యురేట్‌గా డైలాగ్స్ చెబుతున్నారు. నేను ఆ ఏరియాలో పుట్టి పెరిగిన వాడిని కాబట్టి సరిగ్గా మాట్లాడుతున్నారా లేదా అనేది తెలిసిపోతుంది. విజయ్ ఆ యాసలో మాట్లాడటం మేమంతా ఎంజాయ్ చేస్తున్నాం" అని రవి కిరణ్ కోలా అన్నారు.
గోదావరి యాసలో మాట్లాడటం
"కథ ఎంత బాగుందో, ఈస్ట్ గోదావరి యాసలో విజయ్ మాట్లాడటం అనేది కూడా అంతే బాగుందని రాజు గారు అనేవారు. అలాగే ఈ యాసలో డైలాగ్స్ ఫ్లేవర్ అలాగే రావాలని విజయ్, రాజు గారు పర్టిక్యులర్‌గా ఉండేవారు" అని రౌడీ జనార్ధన డైరెక్టర్ రవి కిరణ్ కోలా చెప్పుకొచ్చారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


