సరస్వతి దేవి తలెత్తుకుని చూసేలాంటి సినిమా ఇది.. అంత ఫ్రెష్‌గా ఉంటుంది.. హ్యాపీడేస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కామెంట్స్

హ్యాపీడేస్ సినిమాతో ఎంతో క్రేజ్ తెచ్చుకున్న డైరెక్టర్ శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ మూవీ తర్వాత దర్శకత్వం వహించిన సినిమా కుబేర. నాగార్జున, ధనుష్, రష్మిక మందన్నా నటించిన కుబేర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఆదివారం గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో శేఖర్ కమ్ముల చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Published on: Jun 16, 2025, 13:49:18 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆనంద్, గోదావరి, హ్యాపీ డేస్, లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఫిదా సినిమాలతో ఎంతో క్రేజ్ తెచ్చుకున్న టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల నాగ చైతన్య లవ్ స్టోరీ తర్వాత దర్శకత్వం వహించిన సినిమా కుబేర. నాగార్జున, రష్మిక మందన్నా, ధనుష్ కలిసి నటించిన కుబేర ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో దర్శకుడు శేఖర్ కమ్ముల చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

సరస్వతి దేవి తలెత్తుకుని చూసేలాంటి సినిమా ఇది.. అంత ఫ్రెష్‌గా ఉంటుంది.. హ్యాపీడేస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కామెంట్స్
సరస్వతి దేవి తలెత్తుకుని చూసేలాంటి సినిమా ఇది.. అంత ఫ్రెష్‌గా ఉంటుంది.. హ్యాపీడేస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కామెంట్స్

కుబేర ప్రీ రిలీజ్ ఈవెంట్

కుబేర ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో డైరెక్టర్ శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. నా 25 ఏళ్ల కెరీర్ ఏవీ చూడగానే ఇన్ని సినిమాలు చేశానా అనిపించింది. మీరు రావాలని పిలవగానే వచ్చిన రాజమౌళి గారికి థాంక్యూ. ఏదైనా చేయగలం అనే నమ్మకాన్ని ఇచ్చిన డైరెక్టర్ రాజమౌళి గారు. మీడియాకి ధన్యవాదాలు" అని అన్నారు.

"ప్రతి సినిమా కూతురు లాంటిది కొడుకు లాంటిదని చెప్తుంటాను. కుబేర మాత్రం తల్లి ప్రేమ లాంటిది. బిచ్చగాడు అయినా, కోటీశ్వరుడైన తల్లి ప్రేమ ఒక్కటే. అలాంటి ఐడియాలజీతో కథ రావడం అదృష్టంగా భావిస్తున్న. సినిమా చాలా బాగా వచ్చింది. సరస్వతి దేవి తలెత్తుకుని చూసేలాంటి సినిమా ఇది" అని కుబేర గురించి శేఖర్ కమ్ముల తెలిపారు.

అంత ఫ్రెష్‌గా ఉంటుంది

"ఇది చాలా కొత్త సినిమా. ఇంతకుముందు మీరు ఎప్పుడు చూడని సినిమా. అంత ఫ్రెష్‌గా ఉంటుంది. ఏ రాష్ట్రంలోని ఆడియెన్స్ అయినా ఇది మా సినిమా అనుకునేలా వచ్చింది. ట్రూ పాన్ ఇండియన్ మూవీ. ఇందులో నవ్వు, ఎమోషన్, ఏడుపు, థ్రిల్, ఆశ్చర్యం, బాధ అన్ని కలగలిపి ఉంటాయి" అని శేఖర్ కమ్ముల చెప్పారు.

"కుబేర ఫెంటాస్టిక్ ఫిల్మ్. మా డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌కి ప్రొడక్షన్ టీం అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు. నాగార్జున గారితో షూట్ చేస్తున్నప్పుడు నెర్వస్ ఫీల్ అయ్యాను. శివ షూటింగ్ టైంలో నాగార్జున గారిని చూశాను. ఆయన కెరీర్‌లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేశారు. నేను ఈ స్క్రిప్ట్ చెప్పిన వెంటనే రెడీ అన్నారు. అందుకు నాగార్జున గారికి ధన్యవాదాలు. నాకోసం ఏదైనా చేస్తానని చెప్పి ఈ సినిమాని చేశారు" అని శేఖర్ కమ్ముల పేర్కొన్నారు.

ఎంత చెప్పిన తక్కువే

"రష్మిక తను చాలా బ్యూటిఫుల్ పర్సన్. లోపల బయట ఒకేలా ఉండే అమ్మాయి. అద్భుతంగా పర్ఫామ్ చేసింది. జిమ్ సర్బ్ ఈ సినిమాలో చాలా అద్భుతంగా నటించాడు. ధనుష్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తను ప్రైడ్ ఆఫ్ ఇండియా. బిచ్చగాడిలా కనిపించాలంటే నిజంగా అలానే కనిపించి చూపించాడు. కెరీర్‌లో ఫస్ట్ టైమ్ ఒక డైరెక్టర్ సన్నబడమని చెప్పారని, నిజంగానే సన్నబడి చూపించాడు. తనకి ఎన్ని నేషనల్ అవార్డ్స్ వచ్చిన తక్కువే" అని శేఖర్ కమ్ముల వెల్లడించారు.

"తోట తరిణి గారు నాకు ఫాదర్ లాంటి వ్యక్తి. ఈ సినిమాకి అద్భుతమైనటువంటి వర్క్ ఇచ్చారు. దేవి శ్రీఈ సినిమాకి ఫెంటాస్టిక్ మ్యూజిక్ ఇచ్చారు. ఎప్పుడు ఎనర్జిటిక్‌గా ఉంటారు. అది మ్యూజిక్‌లో కనిపిస్తుంది" అని శేఖర్ కమ్ముల అన్నారు.

జంకకుండా నిర్మించారు

"సునీల్ గారు రామ్మోహన్ గారు ఇంత బిగ్ స్కేల్ సినిమాని ఎక్కడ జంకకుండా నిర్మించారు. ఈ సినిమా పట్ల చాలా హ్యాపీగా ఉన్నారు. కుబేర డబ్బులు తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాల్లో పని చేసిన అందరికీ పేరు పేరునా థాంక్యూ. కుబేర కచ్చితంగా మిమ్మల్ని అందరిని ఎంటర్‌టైన్ చేస్తుంది" అని శేఖర్ కమ్ముల స్పీచ్ ముగించారు.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More