స్పాయిల్ చేయడం ఇష్టం లేదు: ఓటీటీ మూవీపై త్రివిక్రమ్ ప్రశంసలు- 8.3 రేటింగ్- తెలుగులో స్ట్రీమింగ్- ఇక్కడ చూసేయండి!

మాటల మాంత్రికుడు డైరెక్టర్ త్రివిక్రమ్ మెచ్చిన ఓటీటీ థ్రిల్లర్ మూవీ ఒకటి ఉందని చాలా మందికి తెలియదు. ఆ సినిమానే అరువి. తమిళంలో తెరకెక్కిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీకి ఐఎమ్‌డీబీ నుంచి ఏకంగా 8.3 రేటింగ్ ఉంది. తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న అరువి ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: May 26, 2025, 17:24:12 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలకు, డైలాగ్స్‌కు ఉన్న క్రేజ్ తెలిసిందే. పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో తెరకెక్కించే ఆయన మూవీస్‌కు అభిమానులే కాదు తెలుగు ఆడియెన్స్ సైతం ఎదురుచూస్తుంటారు.

స్పాయిల్ చేయడం ఇష్టం లేదు: ఓటీటీ మూవీపై త్రివిక్రమ్ ప్రశంసలు- 8.3 రేటింగ్- తెలుగులో స్ట్రీమింగ్- ఇక్కడ చూసేయండి!
స్పాయిల్ చేయడం ఇష్టం లేదు: ఓటీటీ మూవీపై త్రివిక్రమ్ ప్రశంసలు- 8.3 రేటింగ్- తెలుగులో స్ట్రీమింగ్- ఇక్కడ చూసేయండి!

అదితి బాలన్ మెయిన్ లీడ్ రోల్

ఇక త్రివిక్రమ్ సినిమాలు అయితే ఫ్యామిలీ ఆడియెన్స్‌ను కట్టిపడేసేలా ఉంటాయి. అలాంటి డైరెక్టర్ త్రివిక్రమ్‌నే ఓ ఓటీటీ సినిమా కట్టిపడేసింది. ఆ మూవీనే అరువి. 2016లో తమిళంలో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామా చిత్రం అరువి. అదితి బాలన్ మెయిన్ లీడ్ రోల్‌లో నటించిన ఈ సినిమాకు అరుణ్ ప్రభు దర్శకత్వం వహించారు.

35 కోట్ల కలెక్షన్స్

కోటి రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 35 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. అంతేకాకుండా ఐఎమ్డీబీనుంచి పదికి ఏకంగా 8.3 రేటింగ్ దక్కించుకుంది. అలాగే, అరువి మూవీపై ఎంతోమంది సినీ పెద్దలు, ప్రేక్షకులు ప్రశంసల వర్షం కురిపించారు. ఇక ఫ్రెష్ కంటెంట్ ఎంతో చెప్పే రొట్టెన్ టొమాటోస్ సంస్థ 86 శాతం తాజా కంటెంట్ అని అరువి సినిమాకు సర్టిఫికేట్ ఇచ్చింది.

అరువి ఓటీటీ స్ట్రీమింగ్

అలాంటి అరువి ఓటీటీలో అందుబాటులో ఉంది. అది కూడా తెలుగు భాషలో అరువి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్‌లో అరువి ఓటీటీ రిలీజ్ అయింది. తమిళం, తెలుగు, మలయాళం మూడు భాషల్లో అమెజాన్ ప్రైమ్‌లో అరువి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అరువి అనే అమ్మాయి ఎదుర్కొనే మానసిక సంఘర్షణ చుట్టూ ఈ సినిమా సాగుతుంది.

అరువి క్లైమాక్స్ ట్విస్ట్

ఇక అరువి మూవీలోని క్లైమాక్స్ ట్విస్ట్‌కు మైండ్ బ్లాక్ అవుతుందని ఎంతోమంది రివ్యూవర్స్ చెప్పారు. ఊహించని ట్విస్టుతో, ఒక చిన్న పాయింట్‌తో క్లైమాక్స్ వరకు ప్రేక్షకులను చూసేలా చేయడం అనేది చాలా గొప్ప విషయం అన్నట్లుగా డైరెక్టర్ త్రివిక్రమ్ తెలిపారు.

చివరి 20 నిమిషాలు

ఓ ఇంటర్వ్యూలో అరువి సినిమా గురించి డైరెక్టర్ త్రివిక్రమ్ మాట్లాడుతూ.. "తమిళ్‌లో అరువి. అసలు ఏమాత్రం ఎక్స్‌పెక్టేషన్ (అంచనాలు) లేకుండా మొదలుపెడితే (చూస్తే).. వావ్ అనిపించేలా చేసింది. చివరికి వచ్చేసరికి అయితే ఇంటర్నేషనల్ సినిమాను దాటేసి వెళ్లిపోయింది. అసలు చివరి 15, 20 నిమిషాలు అన్‌బిలేవబుల్‌గా (నమ్మలేకుండా) ఉంటుంది" అని ప్రశంసలు కురిపించారు.

స్పాయిల్ చేయడం ఇష్టం లేదు

"ఆ సమస్య మీద అంతసేపు కూర్చోబెట్టడం అనేది.. మీకు (యాంకర్) తెలుసు కదా చెప్పడం ఇష్టం లేదు. ఎందుకంటే చాలా మంది చూడాలనుకుంటారు కదా. స్పాయిల్ చేయడం ఇష్టం లేదని" అని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వెల్లడించారు. త్రివిక్రమ్ మాటలకు యాంకర్ అవును అని అన్నారు.

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో

మరి డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు వావ్ అనిపించేంత నచ్చిన అరువి సినిమాను అమెజాన్ ప్రైమ్ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లో తెలుగులో చూసేయండి. ఇకపోతే అరువి మూవీలో అదితి బాలన్‌తోపాటు ప్రదీప్ ఆంటోనీ, లక్ష్మీ గోపాలస్వామి, శ్వేత శేఖర్, కవిత భారతి, మొహమ్మద్ అలీ బైగ్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More