Shahrukh Divya Dutta: విమానంలో హీరోయిన్లతో ప్రయాణం-షారుఖ్ ఖాన్ చేసిన పనికి షాక్ అయిన తెలుగు ఓటీటీ సిరీస్ నటి దివ్య దత్తా
Divya Dutta Remembers Shah Rukh Khan Flight Incident: షారుఖ్ ఖాన్ వెండితెరపై కాకుండా నిజ జీవితంలో ఎలా ఉంటారో తెలుగు ఓటీటీ సిరీస్ మయసభ నటి దివ్య దత్తా తాజాగా చెప్పుకొచ్చారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన దివ్య దత్తా ఓసారి విమానంలో హీరోయిన్లు, షారుఖ్ ఖాన్‌తో ప్రయాణించిన సంఘటనను తెలిపారు.
Divya Dutta Remembers Shah Rukh Khan Flight Incident: వెండితెరపైనే కాదు, నిజ జీవితంలోనూ షారుఖ్ ఖాన్ ఒక 'జెంటిల్‌మెన్' అని బాలీవుడ్ బ్యూటీ, తెలుగు ఓటీటీ సిరీస్ నటి దివ్య దత్తా కొనియాడారు. తోటి నటీనటుల పట్ల ఆయన చూపించే గౌరవం, సంస్కారం తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

షారుఖ్ అంటేనే ఒక పాజిటివ్ ఎనర్జీ
షారుఖ్ ఖాన్ వ్యక్తిత్వం గురించి దివ్య దత్తా మాట్లాడుతూ, ఆయన జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారని, కానీ వాటన్నింటి నుంచి ఆయన పాఠాలు నేర్చుకున్నారని పేర్కొన్నారు. తన చుట్టూ ఉన్నవారికి సంతోషాన్ని పంచడమే తన జీవిత లక్ష్యంగా షారుఖ్ మార్చుకున్నారని ఆమె ప్రశంసించారు. "షారుఖ్ చాలా సున్నిత మనస్కుడు. ఎవరికి ఏమి అవసరమో ఆయనకు బాగా తెలుసు" అని దివ్య దత్తా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ఆ ఫ్లైట్ జర్నీ.. మరువలేని జ్ఞాపకం
ఒకసారి ఐఫా (IIFA) అవార్డుల వేడుక ముగించుకుని తిరిగి వస్తున్నప్పుడు జరిగిన సంఘటనను దివ్య దత్తా గుర్తు చేసుకున్నారు. విమానంలో షారుఖ్ ఖాన్, హీరోయిన్లతో విద్యా బాలన్, దియా మీర్జాతో కలిసి దివ్య దత్తా 'డంబ్ షరాడ్స్' (Dumb Charades) ఆట ఆడుతున్నారు. ఆ సమయంలో దివ్య తల్లి కూడా అక్కడే ఉన్నారు. షారుఖ్ తన చేష్టలతో తన తల్లిని ఆటలో భాగం చేసిన తీరు, ఆమెను పలకరించిన విధానం చూసి దివ్య దత్తా మురిసిపోయారు.
అంతేకాదు, విమానం దిగిన తర్వాత షారుఖ్‌ను చూడటానికి అభిమానులు ఎగబడ్డారు. భారీగా సెక్యూరిటీ ఉన్నప్పటికీ, తనతో పాటు ఉన్న మహిళా నటీనటులందరూ క్షేమంగా తమ కార్లలో వెళ్లే వరకు షారుఖ్ అక్కడే వేచి చూశారని దివ్య దత్తా తెలిపారు. అంత పెద్ద స్టార్ హోదాలో ఉండి కూడా తోటి వారి భద్రత కోసం ఆయన చూపిన శ్రద్ధ చూసి అందరూ ఆశ్చర్యపోయారని దివ్య దత్తా చెప్పారు.
వీర్-జారా నుంచి చిరయా వరకు
అలా విమానంలో హీరోయిన్లతో ప్రయాణం తర్వాత షారుఖ్ ఖాన్ చేసిన పనికి షాక్ అయినట్లుగా దివ్య దత్తా చెప్పుకొచ్చారు. షారుఖ్ ఖాన్, ప్రీతి జింటా ప్రధాన పాత్రల్లో నటించిన 'వీర్-జారా' (2004) చిత్రంలో దివ్య దత్తా పోషించిన 'షబ్బో' పాత్ర ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది. ఆ సినిమాతోనే దివ్య దత్తాకు భారీ గుర్తింపు లభించింది.
ఇక ఇటీవల దివ్య దత్తా చిరయా ఓటీటీ సిరీస్‌తో పలకరించింది. జియో హాట్‌స్టార్‌లో తెలుగు భాషలో కూడా చిరయా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్ ఓటీటీలో మంచి విజయం సాధించింది. ఈ సక్సెస్‌ను దివ్యా దత్తా ఎంజాయ్ చేస్తున్నారు.
మయసభ ఓటీటీ సిరీస్‌తో
వైవాహిక అత్యాచారం (Marital Rape) అనే సున్నితమైన సామాజిక అంశంపై తెరకెక్కిన ఈ ఓటీటీ సిరీస్ జియో హాట్‌స్టార్‌లో మార్చి 20న విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ఇందులో కమలేష్ అనే గృహిణి పాత్రలో దివ్య దత్తా అద్భుతంగా నటించారు. అలాగే, మయసభ ఓటీటీ సిరీస్‌తో తెలుగులో డెబ్యూ ఎంట్రీ ఇచ్చి నటనతో ఆకట్టుకున్నారు దివ్య దత్తా.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


