మోస్ట్ వాంటెడ్ థ్రిల్లర్ ఫ్రాంఛైజీ నుంచి రాబోతున్న మూడో సినిమా.. దృశ్యం 3 షూటింగ్ ఎప్పటి నుంచి అంటే?
ఇండియన్ మూవీస్ లో సూపర్ హిట్ ఫ్రాంఛైజీలు చాలానే ఉన్నాయి. అయితే ఇందులో మలయాళ థ్రిల్లర్ ఫ్రాంఛైజీ దృశ్యం సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. దృశ్యం ఫ్రాంఛైజీ సినిమాలు థ్రిల్లర్ మూవీస్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచాయి. ఇప్పుడీ ఫ్రాంఛైజీ నుంచి మూడో సినిమా రాబోతుంది. ఈ ఫిల్మ్ షూటింగ్ పై అప్ డేట్ వచ్చింది.
అత్యంత ఫేమస్ థ్రిల్లర్ ఫ్రాంఛైజీ దృశ్యం నుంచి మరో సినిమా రాబోతోంది. ఫస్ట్ నుంచి లాస్ట్ సీన్ వరకూ క్షణక్షణం ఉత్కంఠ రేపే ఈ ఫ్రాంఛైజీ ఆడియన్స్ కు థ్రిల్ పంచిన సంగతి తెలిసిందే. ఈ ఫ్రాంఛైజీ నుంచి ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి. దృశ్యం 1, దృశ్యం 2 సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. ఇప్పుడు ఈ ఫ్రాంఛైజీలో మూడో సినిమాకు రంగం సిద్ధమైంది.

షూటింగ్ కు సై
దృశ్యం 3 మూవీ షూటింగ్ పై క్రేజీ అప్ డేట్ వచ్చింది. ఈ ఏడాది అక్టోబర్ నుంచి షూటింగ్ మొదలెట్టనున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది. అఫీషియల్ అనౌన్స్ మెంట్ తో పాటు స్పెషల్ వీడియోను కూడా రిలీజ్ చేసింది. ఈ వీడియోలో మోహన్లాల్ ఇంటెన్స్ లుక్ లో కనిపించారు. ‘‘గతమెప్పుడూ సైలెంట్ గా ఉండదు’’ అని పోస్టులో పేర్కొన్నారు.
జీతూ జోసెఫ్ మ్యాజిక్
దృశ్యం ఫ్రాంఛైజీ సినిమాలతో డైరెక్టర్ జీతూ జోసెఫ్ మ్యాజిక్ చేశారు. ఈ ఫ్రాంఛైజీ తొలి రెండు థ్రిల్లర్ సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. ఇప్పుడు మూడో సినిమాకు కూడా జీతు జోసెఫ్ డైరెక్షన్ చేయనున్నారు. ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్ పై ఆంటోనీ పెరుంబవూర్ ఈ మూవీని నిర్మించనున్నారు. మరోసారి ఈ కాంబినేషన్ స్క్రీన్ పై మ్యాజిక్ చేసేందుకు రెడీ అవుతోంది.
బ్లాక్ బస్టర్
దృశ్యం 1, దృశ్యం 2 సినిమాలు ఎంతటి ఘన విజయం సాధించాయో తెలిసిందే. ఒరిజినల్ మలయాళ భాషలో మోహన్‌లాల్, మీనా లీడ్ రోల్స్ ప్లే చేశారు. తెలుగు, హిందీలోనూ ఈ సినిమాలు రీమేక్ చేశారు. తెలుగులో వెంకటేష్, మీనా.. హిందీలో అజయ్ దేవగణ్, శ్రియ నటించారు. ఇప్పుడు హిందీలోనూ అజయ్ దేవగణ్ దృశ్యం 3 సినిమా తీస్తున్నట్లు ప్రకటించారు.
కథ ఏమిటంటే?
ఫ్యామిలీ కోసం పోలీస్ ఉన్నతాధికారిని ఎదురించే ఓ కామన్ మ్యాన్ కథే దృశ్యం. తన కూతురును వేధించే అబ్బాయిని హతమార్చే తండ్రి.. పోలీసులకు దొరకకుండా ఎత్తుల మీద ఎత్తులు వేస్తాడు. తన కొడుకును చంపిన వాళ్లను పట్టుకునేందుకు ఆ పోలీస్ అధికారి ఎంతకైనా తెగిస్తుంది. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులపై పోలీస్ ఇంటరాగేషన్ తో చేసే హింస, కేసులో దొరక్కుండా తప్పించే తండ్రి.. ఇలా సినిమా అంతా థ్రిల్ గా సాగుతుంది.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper













