రానా వాళ్లింట్లో అబ్బాయిలానే ఉంటాను.. తెలుగు ఆడియెన్స్ ఇచ్చే ఎనర్జీ నెక్ట్స్ లెవెల్.. హీరో దుల్కర్ సల్మాన్ కామెంట్స్

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, సముద్ర ఖని, రానా దగ్గుబాటి, భాగ్యశ్రీ బోర్సే ప్రధాన పాత్రలు పోషించిన లేటెస్ట్ సినిమాటిక్ థ్రిల్లర్ డ్రామా కాంత. నవంబర్ 6న రెబల్ స్టార్ ప్రభాస్ కాంత మూవీ ట్రైలర్‌ను విడుదల చేశాడు. కాంత ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో దుల్కర్ సల్మాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

Published on: Nov 7, 2025, 11:27:08 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ మోస్ట్ ఎవైటెడ్ పీరియాడికల్ డ్రామా చిత్రం 'కాంత'. దుల్కర్ సల్మాన్‌తోపాటు రానా దగ్గుబాటి, సముద్ర ఖని, భాగ్యశ్రీ బోర్సే, రవీంద్ర విజయ్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాకు డైరెక్టర్ సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు.

రానా వాళ్లింట్లో అబ్బాయిలానే ఉంటాను.. తెలుగు ఆడియెన్స్ ఇచ్చే ఎనర్జీ నెక్ట్స్ లెవెల్.. హీరో దుల్కర్ సల్మాన్ కామెంట్స్
రానా వాళ్లింట్లో అబ్బాయిలానే ఉంటాను.. తెలుగు ఆడియెన్స్ ఇచ్చే ఎనర్జీ నెక్ట్స్ లెవెల్.. హీరో దుల్కర్ సల్మాన్ కామెంట్స్

కాంత ట్రైలర్ రిలీజ్ చేసిన ప్రభాస్

నవంబర్ 14న థియేటర్లలో గ్రాండ్‌గా కాంత మూవీ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా నవంబర్ 6న కాంత మూవీ ట్రైలర్‌ను రెబల్ స్టార్ ప్రభాస్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కాంత ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో దుల్కర్ సల్మాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

గ్రేట్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చే మూవీ

కాంత ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. "అందరికి నమస్కారం. కాంత ట్రైలర్ మీ అందరికీ నచ్చడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాని కచ్చితంగా థియేటర్స్‌లో చూడండి. ఎందుకంటే ఇది గ్రేట్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చే సినిమా" అని అన్నాడు.

బెస్ట్ ఫ్రెండ్ రానాతో

"తెలుగు ఆడియన్స్ ఇచ్చే ఎనర్జీ నెక్ట్స్ లెవెల్‌లో ఉంటుంది. ఇది మాకు చాలా స్పెషల్ సినిమా. నా బెస్ట్ ఫ్రెండ్ రానాతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. నేను వాళ్లింట్లో అబ్బాయిలానే ఉంటాను. మేమిద్దరం కలసి సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది" అని దుల్కర్ సల్మాన్ తెలిపాడు.

భాగ్యశ్రీ డిఫరెంట్ పర్ఫామెన్స్

"సెల్వ అద్భుతమైన కథతో వచ్చాడు. సముద్రఖని గారితో కలిసి వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్‌పీరియెన్స్. ఇందులో ఆయన మెమొరబుల్ పర్ఫామెన్స్ చూస్తారు. కుమారి పాత్రలో భాగ్యశ్రీ గారు చాలా డిఫరెంట్ పర్ఫామెన్స్ ఇచ్చారు. ఇందులో అద్భుతమైన మ్యూజిక్ ఉంది. ఇది మంచి డ్రామా, థ్రిల్లర్. డెఫినెట్‌గా థియేటర్స్‌లో చూడండి. గ్రేట్ ఎక్స్‌పీరియెన్స్ ఉంటుంది" అని దుల్కర్ సల్మాన్ చెప్పుకొచ్చాడు.

నేను యాక్ట్ చేయడం చూస్తారు

హీరోయిన్ భాగ్యశ్రీ మాట్లాడుతూ.. "అందరినీ నమస్కారం. ఇప్పటివరకు నా సినిమాలు చూశారు. ఈ సినిమాలో నేను యాక్ట్ చేయడం చూస్తారు. కాంత నాకు చాలా చాలా స్పెషల్. మీ అందరి ప్రేమకు థాంక్ యూ. ఈ సినిమాని థియేటర్స్‌లో చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను" అని చెప్పింది.

ప్రౌడ్‌గా ఫీలయ్యే సినిమా

"అందరికి నమస్కారం. కాంత సినిమాలో నటించడం చాలా గర్వంగా ఉంది. ఇది చాలా ప్రౌడ్‌గా ఫీల్ అయ్యే సినిమా. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. మంచి ఇంటెన్స్ పెర్ఫార్మ్ చేసే అవకాశం దొరికింది" అని నటుడు సముద్ర ఖని తెలిపారు.

నట చక్రవర్తితో

"ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన మా డైరెక్టర్ గారికి థాంక్యూ. నట చక్రవర్తి దుల్కర్ సల్మాన్ , రానా దగ్గుబాటి గారితో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉంది. సినిమాని ఫ్యామిలీతో కలిసి చూడండి. చాలా ఎంజాయ్ చేస్తారు" అని స్పీచ్ ముగించారు సముద్రఖని.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More