ఈ నగరానికి ఏమైంది మూవీ సీక్వెల్ వచ్చేస్తుందోచ్.. టైటిల్ రివీల్.. మోషన్ పోస్టర్ రిలీజ్.. వీడియో వైరల్

యూత్ లో స్పెషల్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న మూవీ ‘ఈ నగరానికి ఏమైంది’. ఈ సినిమాలో కామెడీ, ఫ్రెండ్ షిప్ గోల్స్ ట్రెండ్ సెట్ చేశాయి. ఇప్పటికీ ఈ సినిమా క్లిప్స్, మీమ్స్ వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడీ సినిమా సీక్వెల్ కు టైమ్ ఆసన్నమైంది. పార్ట్ 2ను తెరకెక్కిస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. 

Published on: Jun 29, 2025, 14:40:16 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

యూత్ ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చి టాలీవుడ్ సినిమాల్లో ఓ ట్రెండ్ సెటర్ గా నిలిచిన మూవీ ‘ఈ నగరానికి ఏమైంది’. 2018లో రిలీజైన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో నలుగురు ఫ్రెండ్స్ గ్యాంగ్ చేసే అల్లరి, హంగామా వేరే లెవల్ ఎంటర్ టైన్ మెంట్ ను పంచింది. కేవలం రూ.2 కోట్ల బడ్జెట్ తో థియేటర్లకు వచ్చిన ఈ నగరానికి ఏమైంది సినిమా రూ.12 కోట్ల కలెక్షన్లు రాబట్టింది.

ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ పోస్టర్ (x/Suresh Productions)
ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ పోస్టర్ (x/Suresh Productions)

సీక్వెల్ రెడీ

ఈ నగరానికి ఏమైందిసినిమా 2018లో రిలీజైంది. తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఇప్పటికీ ఫ్యాన్స్ నోళ్లలో నానుతూనే ఉంది. ఈ మూవీ సీక్వెల్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు అభిమానులకు గుడ్ న్యూస్ వచ్చింది. ఈ నగరానికి ఏమైంది మూవీ సీక్వెల్ ను రెడీ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.

టైటిల్ ఇదే

ఈ నగరానికి ఏమైంది అనే టైటిల్ పెట్టినప్పుడే ఫ్యాన్స్ లో ఉత్కంఠ మొదలైంది. ఆ టైటిల్ తో మూవీ సక్సెస్ అయింది. ఇప్పుడు పార్ట్ 2 కూడా అదే టైటిల్ ను కొనసాగిస్తూ కాస్త వెరైటీగా ప్రజెంట్ చేస్తున్నారు. ఈ నగరానికి ఏమైంది రిపీట్ అనే టైటిల్ ను పట్టారు. అయితే ఈ నగరానికి ఏమైంది.. అనే అర్థం వచ్చేలా తెలుగులో ‘ఈ’ అక్షరం, మధ్యలో ఇంగ్లిష్ లెటర్ ‘ఎన్’, చివర్లో ‘ఈ’ అక్షరం రివర్స్ లో పెట్టారు.

మ్యాడ్ నెస్ రిపీట్

ఈ నగరానికి ఏమైంది రిపీట్ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ ను రిలీజ్ చేయడంతో పాటు మోషన్ పోస్టర్, వీడియోను సురేష్ ప్రొడక్షన్ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ‘‘గతంలో వాళ్లు ట్రిప్ ప్లాన్ చేశారు. అది కల్ట్ గా మారింది. ఇప్పుడు మ్యాడ్ నెస్ ను రిపీట్ చేసేందుకు, మీ రొటీన్ ను మార్చేందుకు వచ్చేస్తున్నారు. ఈఎన్ఈ రిపీట్ హ్యాంగ్ ఓవర్ ఇప్పటి నుంచే. ప్రి ప్రొడక్షన్ వర్క్ బిగిన్స్’’ అని పోస్టు చేశారు.

ఆ యాక్టర్స్

తరుణ్ భాస్కర్ డైరెక్షన్ లో వచ్చిన ఈ నగరానికి ఏమైంది సినిమాలో విష్వక్ సేన్, సాయి సుమంత్ రెడ్డి, అభినవ్ గోమటం, వెంకటేష్ కాకుమాను ఫ్రెండ్స్ గ్యాంగ్ గా నటించారు. ఇప్పుడు సీక్వెల్ లోనే ఆ నలుగురు కలిసి మరోసారి ఫుల్ ఎంటర్ టైన్ చేసేందుకు వచ్చేస్తున్నారు. ఫస్ట్ పార్ట్ లో మూవీ గోవాలో సాగింది. ఇప్పుడు కథ అమెరికాకు చేరినట్లు తెలుస్తోంది.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More