ఓటీటీలో బోల్డ్ రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్.. 8.2 రేటింగ్.. తెలుగులోనే స్ట్రీమింగ్.. ఫ్రీగా చూసేయొచ్చు!

ఓటీటీలో బోల్డ్ రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఏక్ థీ బేగం మంచి ఆదరణ దక్కించుకుంది. శృంగార, యాక్షన్, లవ్, రొమాంటిక్ సీన్లతో సాగే ఏక్ థీ బేగం ఐఎమ్‌డీబీ నుంచి 8.2 రేటింగ్ సాధించుకుంది. తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఏక్ థీ బేగం సిరీస్‌ను ఇక్కడ ఫ్రీగా చూసేయొచ్చు.

Published on: Jun 26, 2025, 13:31:25 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలో ఎన్నో రకాల కంటెంట్‌తో సినిమాలు, వెబ్ సిరీస్‌లు అలరిస్తుంటాయి. అయితే, అవి ఎలాంటి జోనర్ అయిన తెరకెక్కించే విధానం సరికొత్తగా ఉంటే వాటికి మంచి ఆదరణ లభిస్తుంది. అలా ఓటీటీలో మంచి ఆదరణ దక్కించుకున్న వెబ్ సిరీస్ ఏక్ థీ బేగం.

ఓటీటీలో బోల్డ్ రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్.. 8.2 రేటింగ్.. తెలుగులోనే స్ట్రీమింగ్.. ఫ్రీగా చూసేయొచ్చు!
ఓటీటీలో బోల్డ్ రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్.. 8.2 రేటింగ్.. తెలుగులోనే స్ట్రీమింగ్.. ఫ్రీగా చూసేయొచ్చు!

నవల ఆధారంగా

బోల్డ్ రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన ఏక్ థీ బేగం రెండు సీజన్స్‌తో ఓటీటీలో అందుబాటులో ఉంది. ఈ సిరీస్‌కు సచిన్ దారేకర్, జై తంక్ దర్శకత్వం వహించారు. సప్న దిది అనే నవల ఆధారంగా ఏక్ థీ బేగంను సచిన్ దారేకర్ రచించారు. ఈ సిరీస్‌లో అనూజ సాథే, అంకిత్ మోహన్, చిన్మయి మండ్లేకర్, రాజేంద్ర శిసాట్కర్, అభ్‌జీత్ చావన్ కీలక పాత్రలు పోషించారు.

శృంగార సన్నివేశాలు

శృంగార సన్నివేశాలు, యాక్షన్, వయోలెన్స్, లవ్ స్టోరీ, రొమాంటిక్ సీన్లతో ఏక్ థీ బేగం వెబ్ సిరీస్‌ను మలిచారు. నిజానికి ఇది ఒక మరాఠీ సిరీస్. కథ అంతా ముంబైలో జరుగుతుంది. ఇద్దరు భార్యాభర్తలు పెళ్లి చేసుకుని ముంబైకి వస్తారు. అయితే, భర్త మాత్రం ఒక గ్యాంగ్‌స్టర్ దగ్గర పనిచేస్తాడు.

చిదిమేసిన వారిపై పగ

డ్రగ్స్‌కు సంబంధించిన విషయంలో భర్తను రౌడీలు చంపేస్తారు. ఈ క్రమంలోనే భర్తను, కడుపులో బిడ్డను పోగొట్టుకుంటుంది భార్య. తన జీవితాన్ని చిదిమేసిన వారిపై పగ తీర్చుకోవాలనుకుంటుంది భార్య. సప్నగా పేరు మార్చుకుని బార్ డ్యాన్సర్‌గా అవతారం ఎత్తుతుంది.

అందంతో లోబరుచుకుని

ఒక్కొక్క గ్యాంగ్‌స్టర్‌ను, తన భర్త హత్యకు కారణమైన ఒక్కొక్కరిని తన అందంతో లోబరుచుకుని చంపుతుంది. మరి అలా తన భర్త ప్రాణాలు తీసిన వారిని కనిపెట్టి చంపగలిగిందా? గ్యాంగ్స్‌స్టర్స్ చేతిలో సప్న ఏమైంది? వంటి థ్రిల్లింగ్ అంశాలతో ఏక్ థీ బేగం తెరకెక్కింది.

8.2 ఐఎమ్‌డీబీ రేటింగ్

ఏక్ థీ బేగం రెండు సీజన్స్‌తో వచ్చింది. మొదట సీజన్‌లో 14 రెండో సీజన్‌లో 12తో మొత్తంగా రెండు సీజన్స్‌లో 26 ఎపిసోడ్స్‌ ఉన్నాయి. ఈ సిరీస్‌కు ఐఎమ్డీబీ నంచి పదికి ఏకంగా 8.2 రేటింగ్ వచ్చింది. అంటే, స్టోరీ రొటీన్‌గా ఉన్న టేకింగ్ ఆకట్టుకునేలా ఉంటుందని తెలుస్తోంది.

ఏక్ థీ బేగం ఓటీటీ

ఇక ఏక్ థీ బేగం ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. మరాఠీలోనే కాకుండా హిందీ, తెలుగు వంటి మూడు భాషలో ఏక్ థీ బేగం సీజన్ 1, సీజన్ 2 ఓటీటీ రిలీజ్ అయ్యాయి. ఓటీటీ ప్లాట్ఫామ్ ఎమ్ఎక్స్ ప్లేయర్‌లో ఏక్ థీ బేగం సిరీస్‌ను ఫ్రీగా చూసేయొచ్చు. ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ లేకుండా ఎమ్ఎక్స్ ప్లేయర్ ఒరిజినల్ సిరీస్ అయిన ఎక్ థీ బేగంను పెద్దలు ఉచితంగా చూడొచ్చు.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More