రెండు ఓటీటీల్లోకి తెలుగు క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్.. 7.9 రేటింగ్.. అదిరిపోయే ట్విస్టులు, థ్రిల్లింగ్ సీన్స్!
ఓటీటీలోకి తెలుగు క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ లెవెన్ డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ చంద్ర పోలీస్ ఆఫీసర్‌గా యాక్ట్ చేసిన ఈ సినిమాకు ఐఎమ్‌డీబీ నుంచి 7.9 రేటింగ్ వచ్చింది. ఇప్పుడు లెవెన్ ఓటీటీలోకి వచ్చేయనుంది. లెవెన్ ఓటీటీ రిలీజ్ ప్లాట్‌ఫామ్స్ ఏవో ఇక్కడ తెలుసుకుందాం.
టాలీవుడ్‌లో వర్సటైల్ స్టోరీలతో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరో నవీన్ చంద్ర. థియేట్రికల్ సినిమాల్లో నటుడిగా, విలన్‌గా మెప్పించిన నవీన్ చంద్ర ఓటీటీమూవీస్‌తో సూపర్ క్రేజ్ అందుకున్నాడు. డిఫరెంట్ థ్రిల్లింగ్ జోనర్స్‌తో తెలుగు రాష్ట్రాల్లో మంచి పాపులారిటీ సాధించుకున్నాడు నవీన్ చంద్ర.

బైలింగువల్ సినిమాగా
అలాంటి హీరో నవీన్ చంద్ర పోలీస్ ఆఫీసర్‌గా నటించిన రీసెంట్ తెలుగు క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ లెవెన్. తెలుగు, తమిళంలో బైలింగువల్ సినిమాగా వచ్చిన లెవెన్ సినిమాకు తమిళ పాపులర్ డైరెక్టర్ సుందర్ సి వద్ద అసిస్టెంట్ దర్శకుడిగా పనిచేసిన లోకేష్ అజిల్స్ దర్శకత్వం వహించారు.
ఏఆర్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అజ్మల్ ఖాన్, రేయా హరి నిర్మించిన లెవెన్ సినిమాలో నవీన్ చంద్రతోపాటు రేయా, అభిరామి, దిలిపన్, రిత్విక, ఆడుకాలం నరేన్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. లెవెన్ సినిమాను తెలుగులో రుచిర ఎంటర్‌టైన్‌మెంట్స్, ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ఎన్ సుధాకర్ రెడ్డి విడుదల చేశారు.
అదిరిపోయే ట్విస్టులు
మే 16న థియేటర్లలో విడుదలైన లెవెన్ సినిమాకు ప్రశంసలు వచ్చాయి. సినిమాలో ఊహించని ట్విస్టులు, అదిరిపోయే మలుపులు ఉన్నట్లు రివ్యూల్లో తెలిపారు. ఇంటర్వెల్ ట్విస్ట్ మైండ్ బ్లాక్ చేస్తుందని, అదిరిపోయే ట్విస్టులతో థ్రిల్లింగ్ సీన్లతో ఆద్యంతం లెవెన్ సినిమా కట్టిపడేస్తుందని కామెంట్స్ వినిపించాయి.
అలాంటి లెవెన్ ఓటీటీలోకి వచ్చేయనుంది. ఆహాలో జూన్ 13 నుంచి లెవెన్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. అంటే, మే 16న థియేట్రికల్ రిలీజ్ అయిన లెవెన్ నెల రోజులు కాకుండానే డిజిటల్ ప్రీమియర్ కానుంది. ఆహాతోపాటు మరో డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో లెవెన్ ఓటీటీ రిలీజ్ కానుందని సమాచారం.
రెండు ఓటీటీల్లో
జూన్ 13 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో తెలుగుతోపాటు తమిళ భాషల్లో లెవెన్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుందట. ఇలా రెండు ఓటీటీల్లో లెవెన్ డిజిటల్ ప్రీమియర్ కానుందని తెలుస్తోంది. అయితే, థియేటర్లలో మిస్ అయిన వాళ్లు ఓటీటీలో లెవెన్ సినిమాను ఎంచక్కా చూసేయొచ్చు.
లెవెన్ సినిమా కథ విషయానికొస్తే.. విశాఖపట్నంలో వరుసగా హత్యలు జరుగుతుంటాయి. హత్యలు ఎవరు చేశారు, ఎవరిని చేశారు అనేది అంతుచిక్కదు. ఈ హత్య కేసులను పరిశోధించే పోలీస్ ఆఫీసర్ రంజిత్ (శశాంక్) రోడ్డు ప్రమాదానికి గురికావడంతో స్మార్ట్ పోలీస్‌గా పేరున్న అసిస్టెంట్ కమిషనర్ అరవింద్ (నవీన్ చంద్ర) రంగంలోకి దిగుతారు.
ఊహించని నిజాలు
ఆ తర్వాత ఏమైంది? హంతకులను అరవింద్ పట్టుకున్నాడా? ఈ క్రమంలో తెలిసిన ఊహించని నిజాలు ఏంటీ? ట్విస్టులు ఏంటీ? అనేది తెలియాలంటే ఓటీటీ రిలీజ్ అవుతోన్న లెవెన్ సినిమా చూడాల్సిందే.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper



