4 ఓటీటీల్లోకి ఒకేరోజు వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్- అదిరిపోయే ట్విస్టులు- 7.9 రేటింగ్- ఇక్కడ చూసేయండి!

ఏకంగా నాలుగు ఓటీటీల్లోకి ఒకేరోజు తెలుగు క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ లెవెన్ వచ్చేసింది. ఊహించని థ్రిల్లింగ్ సీన్స్, అదిరిపోయే ట్విస్టులు, ఆశ్చర్యపరిచే ఇంటర్వెల్‌తో ఆద్యంతం థ్రిల్‌కు గురి చేసే లెవెన్ మూవీకి 7.9 రేటింగ్ ఉంది. మరి లెవెన్ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Jun 14, 2025 5:35 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలో ఎప్పటికప్పుడు ఫ్రెష్‌ కంటెంట్‌తో సినిమాలు డిజిటల్ ప్రీమియర్ అవుతూ సందడి చేస్తుంటాయి. ప్రతి వారం వైవిధ్యమైన ఓటీటీ సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుంటాయి. అయితే, వారంలో పదుల్లో ఓటీటీమూవీస్ రిలీజ్ అయితే ఒక్క శుక్రవారం మాత్రం అధిక మొత్తంలో సినిమాలు స్ట్రీమింగ్ అవుతుంటాయి.

4 ఓటీటీల్లోకి ఒకేరోజు వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్- అదిరిపోయే ట్విస్టులు- 7.9 రేటింగ్- ఇక్కడ చూసేయండి!
4 ఓటీటీల్లోకి ఒకేరోజు వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్- అదిరిపోయే ట్విస్టులు- 7.9 రేటింగ్- ఇక్కడ చూసేయండి!

తెలుగు క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్

అలా నిన్న అంటే శుక్రవారం (జూన్ 13) ఒక్కరోజే ఏకంగా నాలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో ఓ తెలుగు క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చేసింది. ఆ సినిమానే లెవెన్. థ్రిల్లర్స్ సినిమాలకు మంచి పేరు ఉన్న హీరో నవీన్ చంద్ర లీడ్ రోల్‌ పోషించిన సినిమానే లెవెన్.

బైలింగువల్ మూవీగా

లోకేష్ అజిల్స్ దర్శకత్వం వహించిన లెవెన్ సినిమా తెలుగు, తమిళం రెండు భాషల్లో బైలింగువల్‌గా తెరకెక్కింది. నవీన్ చంద్ర, రేయా, అభిరామి, దిలిపన్, రిత్విక, ఆడుకాలం నరేన్, కిరీటి దామరాజు, శశాంక్ లెవెన్ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.

లెవెన్ రివ్యూలు

డి ఇమ్మాన్ సంగీతం అందించిన లెవెన్ మూవీ థియేటర్లలో మే 16న విడుదలైంది. లెవెన్ మూవీలో అదిరిపోయే ట్విస్టులు, ఊహించని థ్రిల్లింగ్ సీన్స్, మైండ్ బ్లాక్ చేసే ఇంటర్వెల్ ఉందని పలు రివ్యూల్లో చెప్పారు. ఆద్యంతం థ్రిల్లింగ్ సీన్లతో లెవెన్ సినిమా ఎంగేజ్ చేస్తుందని ప్రశంసలు కురిశాయి.

నాలుగు ఓటీటీల్లో

అందుకే లెవెన్ మూవీ ఏకంగా నాలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో స్ట్రీమింగ్‌కు వచ్చింది. ముందుగా అమెజాన్ ప్రైమ్లో తమిళం, తెలుగు, మలయాళం, హిందీ, కన్నడ ఐదు భాషల్లో లెవెన్ ఓటీటీ రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్‌తో పాటు ఆహా తమిళ్‌లో తమిళ భాషలో లెవెన్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

తెలుగులో లేదు

ఈ రెండింటితోపాటు సింప్లీ సౌత్ ఓటీటీలో తెలుగు, తమిళం, మలయాళం వంటి 3 భాషల్లో లెవెన్ ప్రసారం అవుతోంది. మరో ఓటీటీ టెంట్‌కొట్టాలో కూడా తమిళ భాషలో మాత్రమే లెవెన్ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, ఆహా తమిళ్, టెంట్‌కొట్టా ఓటీటీల్లో తెలుగులో లెవెన్ అందుబాటులో లేదు.

అమెజాన్ ప్రైమ్‌ ఓటీటీలో మాత్రమే

ప్రస్తుతం కేవలం అమెజాన్ ప్రైమ్, సింప్లీ సౌత్ ఓటీటీలో మాత్రమే లెవెన్ తెలుగులో డిజిటల్ ప్రీమియర్ అవుతోంది. అయితే, సింప్లీ సౌత్ ఓటీటీ ప్రస్తుతం ఇండియాలో అందుబాటులో లేదని తెలుస్తోంది. దీంతో తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు అమెజాన్ ప్రైమ్‌లో మాత్రమే లెవెన్ సినిమాను తెలుగులో వీక్షించే అవకాశం ఉంది. ఇక మంచి రెస్పాన్స్ అందుకున్న లెవెన్ ఐఎమ్డీబీ నుంచి పదికి 7.9 రేటింగ్ అందుకుని సత్తా చాటింది.