ఈవారం ఓటీటీలోకి మనసుకు హత్తుకునే తెలుగు ఎమోషనల్ డ్రామా.. ట్రైలర్‌తోనే కంటతడి పెట్టిస్తూ..
ఓటీటీలోకి ఈ వారం తెలుగులో ఓ మంచి ఎమోషనల్ డ్రామా రాబోతోంది. ఇది థియేటర్లలో కాకుండా నేరుగా డిజిటల్ ప్రీమియర్ కానుంది. ఈమధ్యే రిలీజైన ట్రైలర్ మనసును హత్తుకునేలా ఎమోషనల్ గా సాగిపోయింది.
ఓటీటీలో ఓ మంచి ఎమోషనల్ డ్రామా చూడాలని అనుకుంటున్నారా? అయితే ఈవారం మీకోసం అలాంటి సినిమా ఒకటి ఈటీవీ విన్ ఓటీటీలోకి రాబోతోంది. ఈ సినిమా పేరు ఒక మంచి ప్రేమ కథ. టైటిల్ లో ఉన్నట్లుగా ఇది లవ్ స్టోరీయే. కానీ ప్రేమికుల మధ్య కాదు.. ఓ తల్లీకూతుళ్ల మధ్య సాగే ప్రేమ కథ ఇది.

ఒక మంచి ప్రేమ కథ ఓటీటీ రిలీజ్ డేట్
ఒక మంచి ప్రేమ కథ మూవీ ట్రైలర్ ను గత శనివారం (అక్టోబర్ 11) రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ను మంగళవారం (అక్టోబర్ 14) ఈటీవీ విన్ షేర్ చేస్తూ సినిమాను అక్టోబర్ 16 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలిపింది. “కలలు ఆమెను ఇంటికి దూరం చేస్తే.. విధి ఆమెను మళ్లీ ప్రేమకు దగ్గర చేసింది. ఒక మంచి ప్రేమ కథ ట్రైలర్ వచ్చేసింది.
అక్టోబర్ 16 నుంచి కేవలం ఈటీవీ విన్ లో ఈ ఎమోషనల్ జర్నీని చూడండి” అనే క్యాప్షన్ తో ట్రైలర్ షేర్ చేసింది. ఈ ట్రైలర్ చూస్తే సినిమా మొత్తం తల్లీకూతుళ్ల మధ్య బంధం, ఉద్యోగాలు, కెరీర్ అంటూ ఇంట్లో పెద్దవాళ్లను పట్టించుకోకుండా తిరిగే పిల్లల చుట్టూ తిరిగే స్టోరీగా కనిపిస్తోంది.
ఒక మంచి ప్రేమ కథ మూవీ గురించి..
ఒక మంచి ప్రేమ కథ మూవీ గతేడాది షూటింగ్ ప్రారంభించింది. ఈ సినిమాను అక్కినేని కుటుంబ రావు డైరెక్ట్ చేశాడు. ఇందులో రోహిణి హట్టంగడి, రోహిణి మొల్లేటి, సముద్రఖని, హిమాన్షు పోపూరి, సౌమ్య, అనన్య నన్నపనేనిలాంటి వాళ్లు లీడ్ రోల్స్ లో నటించారు. వోల్గా కథ అందించారు. పిల్లలను కని, పెంచి, ప్రయోజకులను చేసి, వాళ్ల కలలను తీర్చే తల్లిదండ్రులకు వాళ్లు అవసరమైన సమయంలో ఉద్యోగాలు, కెరీర్ పేరుతో దూరమవడం ఎలాంటి క్షోభకు గురి చేస్తుందో ఈ సినిమాలో చూపించారు.
ఇలాంటి కథతో వస్తున్న సినిమాకు ఒక మంచి ప్రేమ కథ అనే టైటిల్ పెట్టడం విశేషమే. అంతేకాదు ఈ కాలంలో ఇలాంటి కథలతో సినిమాలు చాలా అరుదుగా రూపొందుతున్నాయి. అలాంటి సినిమాను ఈటీవీ విన్ మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. అక్టోబర్ 16 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


