ఓటీటీలో దుమ్ము రేపుతున్న లేటెస్ట్ తెలుగు వెబ్ సిరీస్.. ఆరు రోజుల్లోనే అరుదైన స్ట్రీమింగ్ రికార్డు.. 8.8 ఐఎండీబీ రేటింగ్
ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న తెలుగు వెబ్ సిరీస్ దుమ్ము రేపుతోంది. గతవారం ఓటీటీలోకి అడుగుపెట్టిన ఈ సిరీస్.. రికార్డు వ్యూస్ తో దూసుకెళ్తోంది. పాజిటివ్ రివ్యూలు సొంతం చేసుకున్న ఈ వెబ్ సిరీస్ ఏదో చూడండి.
ఓటీటీలోకి ఈమధ్యే వచ్చిన తెలుగు వెబ్ సిరీస్ ఆల్ ఇండియా ర్యాంకర్స్ (AIR). ఈటీవీ విన్ ఒరిజినల్ సిరీస్ ఇది. జులై 3 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. కోర్ట్ మూవీ ఫేమ్ రోషన్ లీడ్ రోల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు తెలుగు ఓటీటీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఆరు రోజుల్లోనే 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినట్స్ రికార్డును అందుకుంది.

ఆల్ ఇండియా ర్యాంకర్స్ స్ట్రీమింగ్ రికార్డు
ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ గత వారం అంటే జులై 3న ఈటీవీ విన్ ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వచ్చింది. అంతకుముందే అనగనగా ఒరిజినల్ మూవీతో మంచి హిట్ అందుకున్న ఈ ఓటీటీకి ఈ ఆల్ ఇండియా ర్యాంకర్స్ రూపంలో మరో హిట్ దక్కింది. ఈ సిరీస్ ఆరు రోజుల్లోనే 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినట్స్ రికార్డు అందుకున్నట్లు ఆ ఓటీటీ బుధవారం (జులై 10) వెల్లడించింది.
“ర్యాంకు కాదు.. ర్యాంపు అంటాము.. 100 మిలియన్ ప్లస్ స్ట్రీమ్స్, కౌంటింగ్.. ఆల్ ఇండియా ర్యాంకర్స్ ఇప్పుడు ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆల్ ఇండియా ర్యాంకర్స్ ఎ విన్ ఒరిజినల్ సిరీస్” అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది. విజయ ప్రభంజనం 100 మిలియన్ ప్లస్ స్ట్రీమింగ్ మినట్స్ అనే ప్రత్యేక పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. దీనిపై ఐఎండీబీ రేటింగ్ 8.8 సాధించినట్లు కూడా తెలిపింది.
ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ గురించి..
ఆల్ ఇండియా ర్యాంకర్స్ (AIR) వెబ్ సిరీస్ ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ ముగ్గురు స్టూడెంట్స్ చుట్టూ తిరుగుతుంది. అర్జున్ (హర్ష రోషణ్), ఇమ్రాన్ (జయతీర్థ), రాజు (భాను ప్రకాష్) పదో తరగతి పాసవుతారు. వాళ్లు ఐఐటీలో సీటు సాధించాలన్నది వాళ్ల తల్లిదండ్రుల కోరిక. దీంతో వాళ్లను అలాంటి ఓ కాలేజీలో చేరుస్తారు. అయితే అక్కడ చదువు తప్ప మరో ప్రపంచం తెలియదు.
అలాంటి కఠినమైన పరిస్థితులు ఆ ముగ్గురికి సవాలు విసురుతాయి. అక్కడి నుంచి పారిపోవడానికి కూడా ప్రయత్నిస్తారు. కానీ ఓ సంఘటన వాళ్లను ప్రమాదంలో పడేస్తాయి. అదేంటి? ఆ తర్వాత ఏం జరిగిందన్నదే ఈ వెబ్ సిరీస్ స్టోరీ. ఈ సిరీస్ కు మొదటి నుంచీ పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. దీనిని ప్రత్యేకంగా థియేటర్లలోనూ ప్రదర్శించారు. ప్రస్తుతం ఈటీవీ విన్ ఓటీటీలో ఆల్ ఇండియా ర్యాంకర్స్ దూసుకెళ్తోంది. ఇప్పటి వరకూ మీరు చూసి ఉండకపోతే వెంటనే చూసేయండి.














