ఓటీటీలోకి సడెన్‌గా వచ్చేసిన సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్.. వెంట్రుకవాసు తప్పుతో చస్తారు.. 7 రేటింగ్.. ఎక్కడ చూడాలంటే?
ఓటీటీలోకి సడెన్‌గా సూపర్ హిట్ క్రేజీ హారర్ థ్రిల్లర్ మూవీ ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్‌లైన్స్ వచ్చేసింది. ఐఎమ్‌డీబీ నుంచి 7 రేటింగ్ సాధించిన ఫైనల్ డెస్టినేషన్ 6 మూవీ బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. మరి ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్‌లైన్స్ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ సిరీస్‌లో ఫైనల్ డెస్టినేషన్ ఫ్రాంచైజీ గురించి తెలియని మూవీ లవర్స్ ఉండరు. వెంట్రుక వాసు తప్పుతో ఎంతో మంది మరణిస్తుంటారు. నిర్లక్ష్యంతో చేసే ఒక చిన్న తప్పు ఎందరో ప్రాణాలను బలిగొంటుంది. ఆ ప్రమాదాల నుంచి బయటపడిన వాళ్లను కూడా మృత్యువు వెంటాడుతుంది.

ఇప్పటికీ ఐదు సినిమాలు
ఊహిస్తేనే ఎంతో భయంకరంగా ఉండే ఈ కాన్సెప్టుతో సినిమాలను తెరకెక్కించి సూపర్ హిట్ ఫ్రాంచైజీగా పేరు తెచ్చుకుంది ఫైనల్ డెస్టినేషన్. ఈ మూవీ సిరీస్‌లో ఇప్పటికీ ఐదు సినిమాలు వచ్చాయి. అన్ని మంచి సక్సెస్ సాధించాయి. రీసెంట్‌గా గత నెలలో ఫైనల్ డెస్టినేషన్ ఫ్రాంచైజీ నుంచి ఆరో మూవీ వచ్చింది.
ఒకరోజు ముందుగా ఇండియాలో
ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్‌లైన్స్ టైటిల్‌తో వచ్చిన ఈ సినిమా 2025 మే 16న వరల్డ్ వైడ్‌గా విడుదలైతే ఇండియాలో ఒకరోజు ముందే మే 15న థియేటర్లలో రిలీజ్ అయింది. అది కూడా తెలుగు భాషలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2011 తర్వాత సుమారు 14 ఏళ్ల తర్వాత ఈ ఫ్రాంచైజీ నుంచి కొత్త మూవీ రావడంతో అంచనాలు భారీగా పెరిగాయి.
బడ్జెట్-కలెక్షన్స్
ఆ అంచనాలను తగినట్లుగా ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్‌లైన్స్ ఆకట్టుకుంది. 50 మిలియన్ డాలర్లతో నిర్మించిన ఫైనల్ డెస్టినేషన్ 6 మూవీ బాక్సాఫీస్వద్ద దాదాపుగా 271.1 మిలియన్ డాలర్స్ కొల్లగొట్టి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అంతేకాకుండా ఐఎమ్డీబీ నుంచి పదికి 7 రేటింగ్ సాధించింది.
అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో
ఇలాంటి ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్‌లైన్స్ ఓటీటీలోకి సడెన్‌గా వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్‌లో ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్‌లైన్స్ ఓటీటీ స్ట్రీమింగ్అవుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోతోపాటు యాపిల్ ప్లస్ టీవీలో కూడా ఫైనల్ డెస్టినేషన్ 6 ఓటీటీ రిలీజ్ అయింది. అయితే, ఈ రెండింట్లో రెంటల్ విధానంలో ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ అవుతోంది.
ఇదే ట్విస్ట్
కానీ, ఇక్కడే ఓ చిన్న ట్విస్ట్, నిరాశ ఉంది. హారర్ థ్రిల్లర్ మూవీ ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్‌లైన్స్ ప్రస్తుతం ఇండియాలోని ఓటీటీల్లో అందుబాటులో లేదు. ఇతర దేశాల్లోని ప్రైమ్ వీడియో, యాపిల్ ప్లస్ టీవీ ఓటీటీల్లో ఫైనల్ డెస్టినేషన్ 6 డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. భారతదేశంలోకి మరో వారం రోజుల్లో వచ్చే అవకాశం ఉందని సమాచారం.
రన్ టైమ్
ఇదిలా ఉంటే, ఫైనల్ డెస్టినేషన్ 6 సినిమాకు జాక్ లిపోవ్స్కీ, అడమ్ స్టేయిన్ దర్శకత్వం వహించారు. సుమారు గంట 49 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్‌లైన్స్ చిత్రంలో బ్రెక్ బసింగర్, విలియమ్ బ్లడ్‌వర్త్, రిచర్డ్ హార్మోన్, క్యాథలీన్ శాంటా జువానా, టియో బ్రియోన్స్, ఓవెన్ జాయ్‌నర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper













