చీర‌లో సీరియ‌స్‌గా చూస్తూ స‌మంత‌-మా ఇంటి బంగారం నుంచి అదిరే ఫ‌స్ట్ లుక్‌-టీజ‌ర్ ఎప్పుడంటే? పెళ్లి తర్వాత ఫస్ట్ మూవీ

సమంత రుత్ ప్రభు త్వరలో 'మా ఇంటి బంగారం' అంటూ తెలుగు ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేయబోతుంది. రాజ్ నిడిమోరును రెండో పెళ్లి చేసుకున్న తర్వాత సమంత నుంచి వస్తున్న ఫస్ట్ సినిమా ఇది. ఈ మూవీ నుంచి సమంత ఫస్ట్ లుక్ ను ఇవాళ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాను భర్తతో కలిసి సమంత నిర్మిస్తుంది. 

Published on: Jan 7, 2026, 12:16:00 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా సాగిపోయిన సమంత రూత్ ప్రభు మరోసారి తెలుగు ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు వచ్చేస్తోంది. ‘మా ఇంటి బంగారం’ సినిమాతో థియేటర్లకు రాబోతుంది. ఈ సినిమా నుంచి ఇవాళ (జనవరి 7) సమంత ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. రాజ్ నిడిమోరును రెండో పెళ్లి చేసుకున్న తర్వాత సమంత చేస్తున్న ఫస్ట్ మూవీ ఇదే. భర్తతో కలిసి ఆమెనే మూవీని నిర్మిస్తుంది.

మా ఇంటి బంగారం నుంచి సమంత ఫస్ట్ లుక్
మా ఇంటి బంగారం నుంచి సమంత ఫస్ట్ లుక్

సమంత ఫస్ట్ లుక్

మా ఇంటి బంగారం సినిమా నుంచి సమంత ఫస్ట్ లుక్ ను బుధవారం రిలీజ్ చేశారు. ఓ బస్ లో చీరకట్టులో సీరియస్ గా చూస్తూ సమంత కనిపించింది. సమంత తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో సినిమా నుండి ఈ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ‘‘మీరు చూస్తా ఉండండి.. మా ఇంటి బంగారం మీ అందరీతో కలిసిపోతుంది’’ అని క్యాప్షన్ లో పేర్కొంది సమంత.

సినిమా పోస్టర్‌లో ఆమె గోధుమ రంగు చీరలో బస్సు లోపల నిలబడి కనిపిస్తుంది. ఆమె కఠినమైన రూపాన్ని బట్టి చూస్తే, సమంత రుత్ ప్రభు బస్సులో ఒంటరిగా గూండాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ఉంది.

టీజర్ రిలీజ్ డేట్

మా ఇంటి బంగారం మూవీ నుంచి తన ఫస్ట్ లుక్ తో పాటు ఈ సినిమా టీజర్ డేట్ ను కూడా సమంత అనౌన్స్ చేసింది. మా ఇంటి బంగారం టీజర్ జనవరి 10న ఉదయం 10 గంటలకు రిలీజ్ అవుతుందని పేర్కొంది. ఈ సినిమాను తన భర్త రాజ్ నిడిమోరుతో కలిసి సమంత నిర్మిస్తుంది.

డిసెంబర్ 1న డైరెక్టర్ రాజ్ నిడిమోరును సమంత రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కోయంబత్తూర్ లోని ఈషా ఫౌండేషన్ లోని గుడిలో వీళ్ల వివాహం జరిగింది. పెళ్లి తర్వాత రిలీజవుతున్న సమంత తొలి మూవీ మా ఇంటి బంగారం.

ఆ డైరెక్టర్ తో

ఆసక్తికరంగా సమంత భర్త, చిత్రనిర్మాత రాజ్ నిడిమోరు ఈ చిత్రానికి సృష్టికర్త. 'మా ఇంటి బంగారం'తో సమంత తెలుగు సినిమాకి తిరిగి వస్తుంది. 'ఓ! బేబీ' వంటి హిట్ చిత్రం తర్వాత ఈ ప్రాజెక్ట్ కోసం దర్శకురాలు నందిని రెడ్డితో ఆమె మళ్లీ కలిసింది. సమంతతో పాటు ఈ ప్రాజెక్ట్‌లో గుల్షన్ దేవయ్య, దిగంత్ కూడా నటిస్తున్నారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More