మరికొన్ని గంటల్లోనే ఓటీటీలోకి తొలి మలయాళం వెబ్ సిరీస్ రెండో సీజన్.. ఏడు భాషల్లో.. తొలి సీజన్‌లో ఏం జరిగిందో తెలుసా?

తొలి మలయాళం క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రెండో సీజన్ శుక్రవారం (జూన్ 20) నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్ తొలి సీజన్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. సరిగ్గా రెండేళ్ల కిందట తొలి సీజన్ స్ట్రీమింగ్ అయింది.

Published on: Jun 19, 2025, 16:03:45 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కేరళ క్రైమ్ ఫైల్స్.. మలయాళం నుంచి వచ్చిన తొలి వెబ్ సిరీస్ ఇదే. రెండేళ్ల కిందట వచ్చిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ తొలి సీజన్ కు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు రెండో సీజన్ రాబోతోంది. జియోహాట్‌స్టార్ ఓటీటీలో శుక్రవారం (జూన్ 20) నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో అసలు తొలి సీజన్ లో ఏం జరిగింది? రెండో సీజన్ లో ఏం జరగబోతోంది అన్నది చూడండి.

మరికొన్ని గంటల్లోనే ఓటీటీలోకి తొలి మలయాళం వెబ్ సిరీస్ రెండో సీజన్.. ఏడు భాషల్లో.. తొలి సీజన్‌లో ఏం జరిగిందో తెలుసా?
మరికొన్ని గంటల్లోనే ఓటీటీలోకి తొలి మలయాళం వెబ్ సిరీస్ రెండో సీజన్.. ఏడు భాషల్లో.. తొలి సీజన్‌లో ఏం జరిగిందో తెలుసా?

కేరళ క్రైమ్ ఫైల్స్ తొలి సీజన్ ఇలా..

కేరళ క్రైమ్ ఫైల్స్ వెబ్ సిరీస్ తొలి సీజన్ జూన్ 23, 2023లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లాల్, అజు వర్గీస్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇదొక వేశ్య హత్య చుట్టూ తిరిగే క్రైమ్ థ్రిల్లర్. అహ్మద్ కబీర్ దర్శకత్వం వహించాడు. సీఐడీ సిరీస్‌కు చాలా ద‌గ్గ‌ర‌గా కేర‌ళ క్రైమ్ ఫైల్స్ సిరీస్ సాగుతుంది. చిన్న క్లూ కూడా లేని ఓ మ‌ర్డ‌ర్ కేసును కొంద‌రు పోలీసులు ప‌ట్టుద‌ల‌గా ఆరు రోజుల్లోనే ఎలా సాల్వ్ చేశార‌న్న‌ది ఆరు ఎపిసోడ్స్ ద్వారా ఈ సిరీస్‌లో చూపించారు డైరెక్ట‌ర్ అహ్మ‌ద్ క‌బీర్‌.

కేర‌ళ క్రైమ్ ఫైల్స్ సిరీస్ ఇతర క్రైమ్ థ్రిల్లర్లకు భిన్నంగా సాగుతుంది. ఓ మ‌ర్డ‌ర్ కేసును పోలీసులు నిజంగా ఎలా ఇన్వేస్టిగేట్ చేస్తారు? ఈ క్ర‌మంలో వారికి ఎదుర‌య్యే స‌వాళ్ల‌ను చాలా స‌హ‌జంగా స్క్రీన్‌పై చూపించారు డైరెక్ట‌ర్‌. సిరీస్ చూస్తున్న‌ట్లుగా కాకుండా పోలీస్ జీవితాల్ని, వారి వృత్తిని వాస్త‌వికంగా క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లుగా చూపించిన ఫీలింగ్ క‌లుగుతుంది. ఉద్యోగ‌ బాధ్య‌త‌ల‌కు, వ్య‌క్తిగ‌త జీవితానికి మ‌ధ్య పోలీసులు ఎదుర్కొనే సంఘ‌ర్ష‌ణ‌ను అర్థ‌వంతంగా ఈ సిరీస్‌లో చూపించారు.

క్లైమాక్స్ ట్విస్ట్‌.. హైలైట్‌..

స్వ‌ప్న అనే వేశ్య మ‌ర్డ‌ర్‌తోనే కేర‌ళ క్రైమ్ ఫైల్స్ సిరీస్ మొద‌ల‌వుతుంది. ఈ మ‌ర్డ‌ర్ కేసు ఇన్వేస్టిగేష‌న్‌ను చేప‌ట్టిన ఎస్ఐ మ‌నోజ్ హంత‌కుడికి సంబంధించిన ఒక్కో ఆధారాన్ని ఛేదించేందుకు ప్ర‌య‌త్నించే సీన్స్ ఉత్కంఠ‌ను పంచుతాయి. కిల్ల‌ర్ షిజుకు సంబంధించిన ఆచూకీ దొరికిన‌ట్లుగానే అనిపించ‌డం, కానీ చివ‌రి నిమిషంలో పోలీసులు ఫెయిల‌య్యే సీన్స్‌తో చివ‌రి ఎపిసోడ్ వ‌ర‌కు సిరీస్ సాగుతుంది.

క్లైమాక్స్‌లో హంత‌కుడిని మ‌నోజ్ అండ్ టీమ్ ప‌ట్టుకునే సీన్ స‌ర్‌ప్రైజ్ చేస్తుంది. అలాగే హంత‌కుడే పోలీస్ స్టేష‌న్‌కు వ‌చ్చి త‌న అడ్రెస్ ఇచ్చి వెళ్లినా కూడా అత‌డిని మ‌నోజ్ టీమ్ గుర్తించ‌క‌పోవ‌డం లాంటి స‌న్నివేశాల‌ను ద‌ర్శ‌కుడు ఇంటెన్స్‌గా రాసుకున్నాడు. భార్య డెలివ‌రీ స‌మ‌యంలో కూడా డ్యూటీ కార‌ణంగా ఆమె స‌హాయంగా ఉండ‌లేక కానిస్టేబుల్ ప‌డే త‌ప‌న‌ను హృద్యంగా చూపించారు.

కేరళ క్రైమ్ ఫైల్స్ రెండో సీజన్

కేరళ క్రైమ్ ఫైల్స్ రెండో సీజన్ ఇప్పుడు రాబోతోంది. కొన్ని రోజుల కిందటే ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ కొత్త సీజన్లో పోలీసులు మరో పోలీసోడి కోసం వెతకడం చూడొచ్చు. సీపీవో అంబిలి రాజు కోసం పోలీసులు వెతకడం ట్రైలర్లో కనిపిస్తుంది.

అసలు అతడు చేసిన నేరం ఏంటి? ఎందుకు అతన్ని పోలీసులు వెంటాడుతున్నారన్నది మరికొన్ని గంటల్లోనే తేలనుంది. కేరళ క్రైమ్ ఫైల్స్ వెబ్ సిరీస్ రెండో సీజన్ శుక్రవారం (జూన్ 20) నుంచి జియోహాట్స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. మలయాళం, తెలుగు సహా మొత్తం ఏడు భాషల్లో స్ట్రీమింగ్ కాబోతోంది.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More