జెనీలియా పాత్రను దేశం మొత్తం అభిమానిస్తుంది.. శ్రీలీల నాకు చిన్నప్పటి నుంచి తెలుసు.. గాలి జనార్ధన్ రెడ్డి కామెంట్స్

ప్రముఖ వ్యాపారవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా పరిచయం అవుతున్న సినిమా జూనియర్. ఈ సినిమాలో కిరీటి రెడ్డికి జోడీగా శ్రీలీల హీరోయిన్‌గా చేయగా సీనియర్ టాలీవుడ్ బ్యూటీ జెనీలియా కీలక పాత్ర పోషించింది. జూనియర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో గాలి జనార్ధన్ రెడ్డి కామెంట్స్ చేశారు.

Published on: Jul 14, 2025, 10:47:49 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రముఖ వ్యాపారవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి టాలీవుడ్‌లో హీరోగా పరిచయం అవుతున్న సినిమా జూనియర్. ఈ మూవీకి రాధా కృష్ణ దర్శకత్వం వహించారు. యూత్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన జూనియర్ మూవీలో కిరీటి రెడ్డికి జోడీగా డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల హీరోయిన్‌గా చేసింది.

జెనీలియా పాత్రను దేశం మొత్తం అభిమానిస్తుంది.. శ్రీలీల నాకు చిన్నప్పటి నుంచి తెలుసు.. గాలి జనార్ధన్ రెడ్డి కామెంట్స్
జెనీలియా పాత్రను దేశం మొత్తం అభిమానిస్తుంది.. శ్రీలీల నాకు చిన్నప్పటి నుంచి తెలుసు.. గాలి జనార్ధన్ రెడ్డి కామెంట్స్

కీలక పాత్రలో జెనీలియా

అలాగే, టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ జెనీలియా జూనియర్ మూవీలో కీలక పాత్ర పోషించింది. వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజని కొర్రపాటి నిర్మించిన జూనియర్ సినిమా జూలై 18న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా బెంగళూరులో జూనియర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో గాలి జనార్ధన్ రెడ్డి ఇంట్రెస్టింగ్ విశేషాలు పంచుకున్నారు.

గాలి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి విచ్చేసి చిత్ర బృందాన్ని ఆశీర్వదించిన డాక్టర్ శివరాజ్ కుమార్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఈ సినిమాలో రవిచంద్రన్ గారు, కిరీటి నటించిన సీన్స్ అన్ని అద్భుతంగా ఉన్నాయి" అని అన్నారు.

ఎన్నో సినిమాలతో

"ఎన్నో సినిమాలతో ప్రేక్షకులను అలరించిన జెనీలియా గారు ఈ సినిమాలో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది. వారికి ధన్యవాదాలు. ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా అద్భుతంగా ఉంటుంది. జెనీలియా పాత్రని దేశం మొత్తం అభిమానిస్తుంది" అని గాలి జనార్ధన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

"బాహుబలి లాంటి అద్భుతమైన సినిమాలకు పనిచేసిన కెమెరామెన్ సెంథిల్ కుమార్ గారు ఈ సినిమాకి పనిచేయడం కిరీటి అదృష్టం. నేను సాయి గారు కర్ణాటకలో ఒకే స్కూల్లో చదువుకున్నాం. వారాహి బ్యానర్‌తో ఆయన దేశవ్యాప్తంగా చాలా అద్భుతమైన పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. కిరీటి చిన్న వయసులో ఉన్నప్పుడే తనతో సినిమా చేస్తానని ఆయన చెప్పడం గొప్ప ఆశీర్వాదం" అని గాలి జనార్ధన్ రెడ్డి తెలిపారు.

పునీత్ రాజ్ కుమార్ ఆశీస్సులు

"శ్రీలీల నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. తను దేశవ్యాప్తంగా చాలా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటున్నారు. పునీత్ రాజ్ కుమార్ గారి ఆశీస్సులు కిరీటిపై ఉన్నాయి. జేమ్స్ సినిమా సమయంలో కిరీటికి ఆయనతో సమయాన్ని గడిపే అదృష్టం దక్కింది" అని గాలి జనార్ధన్ రెడ్డి చెప్పారు.

"కిరీటికి చిన్నప్పటి నుంచి యాక్టింగ్, డాన్సింగ్ అంటే ఇష్టం. తను ఒక పాషన్‌తోనే ఈ పరిశ్రమలోకి వస్తున్నాడు. కిరీటిపై అందరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. చాలా మంచి సినిమా ఇది. మన ఇంట్లో జరిగే కథలాగా ఉంటుంది. తప్పకుండా సినిమాని చూసి మీరందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను" అని గాలి జనార్ధన్ రెడ్డి చెప్పుకొచ్చారు.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More