ఆరోజే గ్రాండ్‌గా గామా అవార్డ్స్ వేడుకలు- దుబాయ్‌లో థీమ్ సాంగ్ లాంచ్- పాల్గొనే హీరో హీరోయిన్స్ వీళ్లే!

గామా అవార్డ్స్‌ 2025 వేడుకలను ఆగస్ట్ 30న దుబాయ్‌లో గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా గామా 5వ ఎడిషన్ థీమ్ సాంగ్‌ను రీసెంట్‌గా రిలీజ్ చేశారు. ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించగా రఘు కుంచె కంపోజ్ చేసి ఆలపించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో పలువురు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Published on: Jun 25, 2025, 19:27:02 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రతిష్టాత్మకమైన గామా (గల్ఫ్ అకాడమీ మూవీ అవార్డ్స్) అవార్డ్స్ దుబాయ్‌లో ఇప్పటికీ నాలుగు ఎడిషన్స్ గ్రాండ్‌గా జరిగాయి. తాజాగా 2025- ఐదో ఎడిషన్ వేడుకలు దుబాయ్‌లోని షార్జా ఎక్స్‌పో సెంటర్‌లో ఆగస్ట్ 30న వైభవంగా జరగనున్నాయి. ఈ క్రమంలోనే దుబాయ్లో రీసెంట్‌గా జరిగిన కీన్‌ఫ్రా ప్రాపర్టీస్ (Keinfra Properties) ప్రారంభోత్సవ సందర్భంగా గామా 5వ ఎడిషన్‌ థీమ్ సాంగ్‌ను లాంచ్ చేశారు.

ఆరోజే గ్రాండ్‌గా గామా అవార్డ్స్ వేడుకలు- దుబాయ్‌లో థీమ్ సాంగ్ లాంచ్- పాల్గొనే హీరో హీరోయిన్స్ వీళ్లే!
ఆరోజే గ్రాండ్‌గా గామా అవార్డ్స్ వేడుకలు- దుబాయ్‌లో థీమ్ సాంగ్ లాంచ్- పాల్గొనే హీరో హీరోయిన్స్ వీళ్లే!

చంద్రబోస్ సాహిత్యం

ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ గారు ఈ పాటకు అద్భుతమైన సాహిత్యం అందించారు. రఘు కుంచె సాంగ్ కంపోజ్ చేయడంతో పాటు తానే స్వయంగా పాడిన తీరు అందరినీ అలరించింది. ఈ సంగీత ప్రదర్శనను యూఏఈలోని తెలుగు ప్రముఖులు ప్రత్యక్షంగా వీక్షించారు. ఇక ఆగస్టు 30న టాలీవుడ్ అవార్డ్స్‌తో పాటు ఆగస్టు 29న ఎక్సలెన్స్ అవార్డ్స్ వేడుకను నిర్వహించేలా భారీ సన్నాహాలు చేస్తున్నారు.

ఈ కార్యక్రమానికి టాలీవుడ్ హీరోలు సిద్దు జొన్నలగడ్డ, తేజ సజ్జా, కిరణ్ అబ్బవరం, శ్రీ విష్ణు, రోషన్, హీరోయిన్స్ మీనాక్షి చౌదరి, దక్ష నాగర్కర్‌తో పాటు తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుంచి అగ్ర కథానాయకులు, టాప్ టెక్నీషియన్స్ పాల్గొననున్నారు. అలాగే, అలాగే హీరోయిన్స్ ఊర్వశి రౌటేలా, కేతిక శర్మ, ఫరియా అబ్దుల్లా, ప్రియా హెగ్డే, శ్రీదేవి స్పెషల్ పర్ఫామెన్స్‌లతో అలరించనున్నారు.

ప్రత్యేక అతిథులుగా బ్రహ్మానందం, దర్శకులు సుకుమార్, బుచ్చిబాబు, బాబీ, సాయి రాజేష్, సంగీత దర్శకులు దేవీ శ్రీ ప్రసాద్, తమన్, నిర్మాతలు అశ్విని దత్, డీవీవీ దానయ్య, చంద్రబోస్, వెన్నెల కిశోర్తదితర ప్రముఖులు హాజరవనున్నారు. వీరితో పాటు పలువురు టాలీవుడ్ అగ్రశ్రేణి నటీనటులు సర్‌ప్రైజ్ గెస్ట్‌లుగా హాజరు కానున్నారు.

24 క్రాఫ్ట్స్‌కు అవార్డ్స్

అతిరథ ప్రముఖుల మధ్య అంగరంగ వైభవంగా జరగనున్న ఈ అవార్డ్స్ వేడుక కోసం చిత్ర పరిశ్రమతో పాటు ప్రేక్షకులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టాలీవుడ్ 24 క్రాఫ్ట్స్‌కు గామా అవార్డ్స్‌ను అందించనున్నారు. 2024లో విడుదలైన చిత్రాల్లో నామినేట్ అయిన విభాగాలకు పబ్లిక్ ఓటింగ్ ప్రక్రియ ద్వారా సెలెక్ట్ చేస్తున్నారు.

ఈ గామా అవార్డ్స్ 2025లో ఈ ఏడాది కూడా పలు పాపులర్ చిత్రాలు, స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్స్, టాప్ టెక్నీషియన్స్ పురస్కారాలు అందుకోనున్నారు. ఇక ఇటీవల ఈ కార్యక్రమానికి సంబంధించి గ్రాండ్ రివీల్ ఈవెంట్‌ను దుబాయ్‌లో నిర్వహించగా అద్భుతమైన స్పందన వచ్చింది. మైత్రి ఫార్మ్‌లో గామా అవార్డ్స్ 5వ ఎడిషన్‌ టిక్కెట్లను మహిళలు విడుదల చేశారు.

గామా అవార్డ్స్ 2025 జ్యూరీ చైర్ పర్సన్స్ ప్రముఖ సినీ దర్శకులు ఏ. కొదండ రామిరెడ్డి, ప్రముఖ సంగీత దర్శకులు కోటి, ప్రముఖ సినీ దర్శకులు బి. గోపాల్ ఆధ్వర్యంలో వివిధ రంగాలకు ఎంపిక అయిన టాలీవుడ్ కళాకారులకు, సినిమాలకు గామా అవార్ద్స్ బహుకరించనున్నారు.

తెలుగు వారందరూ

ఈ సందర్భంగా ‘గామా అవార్డ్స్’ చైర్మన్ త్రిమూర్తులు మాట్లాడుతూ.. "దుబాయ్‌లో జరిగే ఏకైక అతి పెద్ద వేడుక గామా అవార్డ్స్. గత నాలుగు ఎడిషన్లు ఘనంగా పూర్తి చేసుకున్నాం. ఆగస్ట్ 30న జరిగే 5వ ఎడిషన్‌ను కూడా మన తెలుగు వారు అందరూ ఈ కార్యక్రమానికి సహకరించి అధిక సంఖ్యలో హాజరు అయ్యి విజయవంతం చేయాలి" అని అన్నారు.

గామా అవార్డ్స్ సీఈవో సౌరభ కేసరి మాట్లాడుతూ.. "వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను గుర్తించి వారికి ది గామా ఎక్సలెన్స్ అవార్డ్స్ ఇచ్చి సత్కరించనున్నాం. విశాలవంతమైన పార్కింగ్ కలిగిన షార్జా ఎక్స్‌పో సెంటర్‌లో 10 వేల మంది ఆసీనులు అయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నాం" అని తెలిపారు.

"వినూత్న రీతిలో జరగబోయే ఈ అవార్డ్స్ కార్యక్రమంలో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసే అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌లు, అందర్నీ అలరించే వినోద కార్యక్రమాలు, అద్భుతమైన షోలు ఉంటాయి" అని సౌరభ్ కేసరి పేర్కొన్నారు.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More