ఓటీటీలోకి ఇవాళ సడెన్‌గా వచ్చేసిన తెలుగు సైకలాజికల్ హారర్ థ్రిల్లర్- 8 రేటింగ్- యాదార్థ ఘటనలతో- 20 రోజుల్లోనే ఓటీటీకి!

ఓటీటీలోకి ఇవాళ యాదార్థ హారర్ ఘటనలతో తెరకెక్కిన సినిమా ఘటికాచలం వచ్చేసింది. తెలుగులో సైకలాజికల్ హారర్ థ్రిల్లర్‌గా విడుదలైన ఘటికాచలం ఓటీటీలోకి 20 రోజుల్లోనే స్ట్రీమింగ్‌కు వచ్చింది. ఐఎమ్‌డీబీ నుంచి 8 రేటింగ్ సాధించిన ఘటికాచలం ఓటీటీ రిలీజ్ ప్లాట్‌ఫామ్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

Jun 20, 2025, 15:30:23 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీ హారర్ థ్రిల్లర్ సినిమాలకు ఉండే క్రేజ్ వేరే ఉంటుంది. అదనపు అంశాలు జోడించి పర్ఫెక్ట్ ఎంగేజింగ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తే ఆ సినిమా సూపర్ హిట్ అవుతుంది. హారర్ మూవీస్‌ను యాక్షన్, కామెడీ, అడ్వెంచర్, సైకలాజికల్ వంటి ఎలిమెంట్స్‌ యాడ్ చేసి చిత్రీకరిస్తుంటారు.

ఓటీటీలోకి ఇవాళ సడెన్‌గా వచ్చేసిన తెలుగు సైకలాజికల్ హారర్ థ్రిల్లర్- 8 రేటింగ్- యాదార్థ ఘటనలతో- 20 రోజుల్లోనే ఓటీటీకి!
ఓటీటీలోకి ఇవాళ సడెన్‌గా వచ్చేసిన తెలుగు సైకలాజికల్ హారర్ థ్రిల్లర్- 8 రేటింగ్- యాదార్థ ఘటనలతో- 20 రోజుల్లోనే ఓటీటీకి!

బాల నటుడిగా పేరు

అలా తెలుగులో తెరకెక్కిన సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీనే ఘటికాచలం. బాల నటుడిగా పేరు తెచ్చుకున్న నిఖిల్ దేవాదుల హీరోగా మారిన సినిమానే ఘటికాచలం. నిజ జీవితంలో జరిగిన యదార్థ హారర్ ఘటనలతో ఘటికాచలం సినిమాను రూపొందించారు.

బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్

అమర్ కామెపల్లి దర్శకత్వం వహించిన ఘటికాచలం సినిమాలో నిఖిల్ దేవాదులతోపాటు బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్, ఆర్వికా గుప్తా, సంజయ్ రాయ్ చుర, జోగి నాయుడు, దుర్గాదేవి, షాన్ కక్కర్, రంగధామ్, అర్జున్ విహాన్, శ్రీనివాస్ కామెపల్లి, సమ్యు రెడ్డి ఇతర కీలక పాత్రలు పోషించారు.

20 రోజుల్లోనే ఓటీటీలోకి

మే 31న థియేటర్లలో విడుదైలన ఘటికాచలం సినిమా పర్వాలేదనిపించుకుంది. అయితే, హారర్ అంశాలు బాగున్నప్పటికీ చిన్న సినిమా కావడంతో పెద్దగా రీచ్ కాలేదు. దాంతో పెద్దగా ఆదరణ పొందలేకపోయింది ఘటికాచలం. అయితే, థియేట్రికల్ రిలీజ్‌ తర్వాత 20 రోజుల్లోనే ఘటికాచలం ఓటీటీలోకి వచ్చేసింది.

ఐఎమ్‌డీబీ రేటింగ్ 8

ఇవాళ్టీ (జూన్ 20) నుంచి ఘటికాచలం ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్‌లో తెలుగులో నేడు ఘటికాచలం ఓటీటీ రిలీజ్ అయింది. ఐఎమ్డీబీ సంస్థ నుంచి ఘటికాచలం సినిమా పదికి 8.0 రేటింగ్ సాధించినట్లు అమెజాన్ ప్రైమ్ వీడియో తన ప్లాట్‌ఫామ్‌లో తెలిపింది.

అధికారిక ప్రకటన లేకుండా

అంతేకాకుండా భయపెట్టే హారర్ సీన్స్ ఉన్న ఘటికాచలం ఓటీటీలోకి సడెన్‌గా స్ట్రీమింగ్‌కు వచ్చి సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండానే ఇవాళ ఘటికాచలం డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చేసింది. మరి థియేటర్లలో మిస్ అయిన ఈ తెలుగు సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ ఘటికాచలంను ప్రైమ్ వీడియోలో ఎంచక్కా చూసేయండి.

ఘటికాచలం కథ

ఇక ఘటికాచలం కథ విషయానికొస్తే.. కౌశిక్ (నిఖిల్ దేవాదుల) తండ్రి కోరిక మేరకు మెడిసిన్ చదువుతాడు. కానీ, కాలేజ్‌లో ఇంట్రావర్ట్ అయిన కౌశిక్‌ను కొంతమంది ఏడిపిస్తుంటారు. హేళన చేస్తుంటారు. ఇదే సమయంలో కౌశిక్‌కు ఒక వాయిస్ భయంకరంగా వినిపిస్తుంటుంది. దాంతో పిచ్చి చేష్టలు చేస్తుంటాడు కౌశిక్.

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో

ఆ తర్వాత ఏమైంది? కౌశిక్ ఎందుకు వింతగా ప్రవర్తిస్తున్నాడు? కౌశిక్‌కు వినిపించే వాయిస్ ఎవరిది? ఎవరిని పడితే వారిని కౌశిక్ ఎందుకు చంపాడు? అనేది తెలిలాయంటే అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న ఘటికాచలం సినిమా చూడాల్సిందే.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More