...
...
Next Story

Godari Gattu Meeda Song Lyrics: గోదారి గట్టు మీద రామ సిలకవే సాంగ్ లిరిక్స్ ఇవే.. రొమాంటిక్ మూడ్‌లో ఉన్నప్పుడు పాడుకోండి

Godari Gattu Meeda Song Lyrics: సంక్రాంతికి వస్తున్నాం మూవీలోని గోదారి గట్టు మీద సాంగ్ తెలుగు రాష్ట్రాలను ఊపేస్తోంది. ఎక్కడ చూసినా ఈ పాటపై చేసిన రీల్సే కనిపిస్తున్నాయి. భార్యాభర్తలు మంచి రొమాంటిక్ మూడ్ లో ఉన్నప్పుడు పాడుకునే పాట లిరిక్స్ ఇక్కడ చూడండి.

Published on: Jan 2, 2025, 22:00:35 IST
By , , Hyderabad
Prefer HTon Google
Advertisement

Godari Gattu Meeda Song Lyrics: గోదారి గట్టు మీద రామ సిలకవే పాట లిరిక్స్ కోసం చూస్తున్నారా? అయితే ఇక్కడ చూసేయండి. సంక్రాంతికి వస్తున్నాం టైటిల్ తో అదే సంక్రాంతికి రిలీజ్ అవుతున్న మూవీలోని ఈ పాట తెగ వైరల్ అవుతోంది. వెంకటేశ్, ఐశ్వర్య రాజేష్ పై చిత్రీకరించిన ఈ పాటకు సంబంధించిన ఎన్నో రీల్స్ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. జనవరి 14న రిలీజ్ కాబోతున్న సంక్రాంతికి వస్తున్నాం మూవీలోని ఈ సాంగ్ లిరిక్స్ చూస్తూ మీరూ పాడండి.

గోదారి గట్టు మీద సాంగ్.. ఇన్‌స్టాంట్ హిట్

గోదారి గట్టు మీద రామ సిలకవే సాంగ్ లిరిక్స్ ఇవే.. రొమాంటిక్ మూడ్‌లో ఉన్నప్పుడు పాడుకోండి
గోదారి గట్టు మీద రామ సిలకవే సాంగ్ లిరిక్స్ ఇవే.. రొమాంటిక్ మూడ్‌లో ఉన్నప్పుడు పాడుకోండి

సంక్రాంతికి వస్తున్నాం మూవీలోని గోదారి గట్టు మీద సాంగ్ యూట్యూబ్ లో ఓ సెన్సేషన్ గా మారింది. గత నెల రిలీజైన ఈ పాటకు ఇప్పటికే సుమారు 7 కోట్ల వరకూ వ్యూస్ రావడం విశేషం. రమణ గోగుల, మధుప్రియ పాడిన ఈ పాటకు భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించాడు.

భాస్కరభట్ల రవి కుమార్ లిరిక్స్ అందించాడు. ఈ సాంగ్ ఇన్‌స్టాంట్ హిట్ లా నిలిచింది. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వెంకీ మామతోపాటు ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి నటించిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఎంతో ఆసక్తి రేపుతోంది. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఈ సంక్రాంతి విజేతగా నిలుస్తుందన్న అంచనాలు ఉన్నాయి.

గోదారి గట్టు మీద సాంగ్ లిరిక్స్

గోదారి గట్టు మీద రామ సిలకవే

గోరింటా కెట్టుకున్న సంద మామవే

ఊరంతా సూడు ముసుగే తన్ని నిద్దరపోయిందే

ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుందే

నాకంటూ ఉన్నా ఒకే ఒక్క ఆడ దిక్కువే

నీతోటీ కాకుండా నా బాధలు యెవరుకు చెప్పుకుంటానే

గోదారి గట్టు మీద రామ సిలకనే

గీ పెట్టి గింజుకున్నా నీకు దొరకనే

హే .. విస్తరి ముందేసి.. పస్తులు పెట్టావే

ఛీ ఛీ ఛీ సిగ్గే లేని మొగుడు గారొండోయ్

గుయ్ గుయ్ గుయ్ గుయ్ మంటూ మీదికి రాకొండోయ్

ఒయ్ ఒయ్ గంపెడు పిల్లల్తో.. ఇంటిని నింపావే

సాప దిండు సంసారాన్ని మేడెక్కించావే

ఇరుగు పొరుగు ముందు సరసాలొద్దండోయ్

గురకెట్టి పొడుకోరే గూర్కాల్లాగా మీ వాళ్ళు

ఏం చేస్తాం ఎక్కేస్తాం ఇట్టాగే డాబాలు

పెళ్ళైయి సాన్నాల్లే అయినా కానీ మాస్టారు

తగ్గేదే లేదంటూ నా కంగెనకే పడుతుంటారు

గోదారి గట్టు మీద రామ సిలకవే

గోరింటాకెట్టుకున్న సంద మామవే

కొత్త కోకేమో కన్నే కొట్టిందే

తెల్లారేలోగా తొందర పడమని చెవిలో చెప్పిందే

ఈ మాత్రం హింటే ఇస్తే సెంటే కొట్టేయనా

ఓ రెండు మూరల మల్లెలు చేతికి చుట్టేయినా

ఈ అల్లరి గాలేమో అల్లుకుపొమ్మందే

మాటల్తోటి కాలక్షేపం మానెయ్ మంటుందే

అబ్బా కబడ్డీ కబడ్డీ అంటూ కూతకు వచ్చెయ్నా

ఏవండోయ్ శ్రీవారు మళ్లీ ఎప్పుడో అవకాశం

ఎంచక్కా బాగుంది చుక్కల ఆకాశం

ఓసోసి యిల్లాలా బాగుందే నీ సహకారం

ముద్దులతో చెరిపెద్దాం నీకు నాకు మధ్యన దూరం

గోదారి గట్టు మీద రామ సిలకనే

నీ జంట కట్టుకున్న సంద..మామనే

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe