తమిళ్ ఒరిజినల్ సిరీస్.. కానీ తెలుగులో ట్రెండింగ్.. ఓటీటీలో ఈ కోర్టు డ్రామా థ్రిల్లర్ చూశారా?

ఓటీటీలో తమిళం ఒరిజినల్ వెబ్ సిరీస్ అదరగొడుతోంది. రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన గుడ్ వైఫ్ సిరీస్ దూసుకెళ్తోంది. ఇది తెలుగు ఒరిజినల్ సిరీస్ అయినప్పటికీ తెలుగులో ట్రెండింగ్ లో కొనసాగుతుండటం విశేషం.  

Jul 6, 2025, 20:20:07 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలోకి రీసెంట్ గా వచ్చిన తమిళ్ ఒరిజినల్ వెబ్ సిరీస్ అదరగొడుతోంది. ఒరిజినల్ లాంగ్వేజ్ తమిళం కంటే కూడా ఇతర డబ్బింగ్ భాషల్లో సత్తాచాటుతోంది. ఆ సిరీసే.. ‘గుడ్ వైఫ్’. కోర్టు డ్రామా థ్రిల్లర్ గా వచ్చిన ఈ సిరీస్ ను ఆడియన్స్ ను ఎంగేజ్ చేస్తోంది. ఓటీటీలో ట్రెండింగ్ లో కొనసాగుతోంది.

ఓటీటీలో ట్రెండింగ్ లో వెబ్ సిరీస్ (x/JioHotstar Tamil)
ఓటీటీలో ట్రెండింగ్ లో వెబ్ సిరీస్ (x/JioHotstar Tamil)

ఆ ఓటీటీలోకి

జియోహాట్స్టార్ ఒరిజినల్ వెబ్ సిరీస్ గా గుడ్ వైఫ్ రిలీజ్ అయింది. ఈ సిరీస్ జూలై 4న డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఒరిజినల్ తమిళంతో పాటు తెలుగు, కన్నడ, హిందీ, మలయాళం, బెంగాలీ, మరాఠి భాషల్లోనూ ఈ సిరీస్ ఓటీటీలో అడుగుపెట్టింది. ఇతర భాషల్లోకి డబ్ అయింది.

తెలుగులో టాప్

గుడ్ వైఫ్ వెబ్ సిరీస్ తెలుగులో టాప్ నంబర్ వన్ గా ట్రెండ్ అవుతోంది. జియోహాట్‌స్టార్‌ ఓటీటీలో ఈ కోర్టు డ్రామా థ్రిల్లర్ సిరీస్ తెలుగులో టాప్ ప్లేస్ లో ఉంది. ఆ తర్వాత కూకు విత్ జాతిరత్నాలు అనే కుకింగ్ కామెడీ షో ఉంది. అదే హిందీలో అయితే టాప్-5లో కొనసాగుతోంది గుడ్ వైఫ్ సిరీస్. మరో కోర్టు థ్రిల్లర్ క్రిమినల్ జస్టిస్ సీజన్ 4 టాప్ లో ఉంది.

తమిళంలో ఇలా

తమిళ్ ఒరిజినల్ వెబ్ సిరీస్ గా గుడ్ వైఫ్ ఓటీటీలోకి అడుగుపెట్టింది. కానీ తమిళంలో మాత్రం సెకండ్ ప్లేస్ లో ట్రెండ్ అవుతోంది. కుకింగ్ షో టాప్ ప్లేస్ లో ఉంది. ఇక మలయాళంలో నాలుగో ప్లేస్ లో, బెంగాలీలో టాప్ ప్లేస్ లో, మరాఠీలో మూడో ప్లేస్ లో, కన్నడలో టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవుతోంది ఈ సిరీస్.

ఆరు ఎపిసోడ్లు

గుడ్ వైఫ్ వెబ్ సిరీస్ సీజన్ 1లో ఆరు ఎపిసోడ్ లు ఉన్నాయి. సెక్స్ టేప్ కుంభకోణంలో చిక్కుకున్న భర్త నిజంగానే తప్పు చేశాడా? అతణ్ని భార్య ఎలా కాపాడిందన్నదే కథ. భార్యభర్తలు, పిల్లలతో ఉన్న కుటుంబంలో ఓ వీడియో కలకలం రేపుతోంది. తన భర్త సెక్స్ వీడియోను ఆన్ లైన్ లో ఆ భార్య చూస్తుంది. ఫ్యామిలీ మొత్తం చూస్తారు. బయటి వ్యక్తులు కూడా చూస్తారు. దీంతో ఓ వైపు అవమానాలు.. అయినా భర్త కోసం, నిజం కోసం మళ్లీ నల్లకోటు వేసుకుని ఆ భార్య కోర్టులో అడుగుపెడుతుంది.

మరి భర్త నిజంగానే సెక్స్ టేప్ లో ఉన్నాడా? అసలేం జరిగింది? ఆ భార్య నిజాలను ఎలా బయటపెట్టిందన్నదే కథ. ఇందులో లాయర్ గా ప్రియమణి నటించింది.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More