...
...
Next Story

ట్రెండింగ్ లో ఇమ్రాన్ హష్మి యాక్షన్ థ్రిల్లర్.. థియేటర్లో ఫ్లాప్.. ఓటీటీలో అదుర్స్.. ప్రైమ్ వీడియోలోని టాప్-5 మూవీస్ ఇవే

ఓటీటీలోకి రీసెంట్ గా వచ్చిన ఓ యాక్షన్ థ్రిల్లర్ అదరగొడుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో సత్తాచాటుతోంది. ట్రెండింగ్ నంబర్ వన్ గా కొనసాగుతోంది. ఆ ఓటీటీలో టాప్-5లో ఏ సినిమాలు ఉన్నాయో ఓ లుక్కేయండి.

Published on: Jun 25, 2025, 09:00:13 IST
By ,
Prefer HTon Google
Advertisement

అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఓ యాక్షన్ థ్రిల్లర్ అదరగొడుతోంది. కశ్మీర్ లో ఉగ్ర స్థావరాలను అంతం చేయడమే టార్గెట్ గా కొనసాగించే ఆర్మీ ఆపరేషన్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఓటీటీని ఊపేస్తోంది. ఆ సినిమా పేరే ‘గ్రౌండ్ జీరో’. రీసెంట్ గా ఓటీటీలోకి అడుగుపెట్టిన ఈ సినిమా ఆడియన్స్ ను ఆకట్టుకుంటోంది. మోస్ట్ అండర్ రేటెడ్ మూవీ ఇది అని మూవీ లవర్స్ కామెంట్లు చేస్తున్నారు.

థియేటర్ రెస్పాన్స్

ఓటీటీ ట్రెండింగ్ లో థ్రిల్లర్ (x)
ఓటీటీ ట్రెండింగ్ లో థ్రిల్లర్ (x)

ఇమ్రాన్ హష్మిలీడ్ రోల్ ప్లే చేసిన గ్రౌండ్ జీరో మూవీ థియేటర్లలో అంచనాలను అందుకోలేకపోయింది. ఈ హిందీ సినిమా అనుకున్న స్థాయిలో ఆడియన్స్ కు రీచ్ కాలేకపోయింది. ఏప్రిల్ 25న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా రూ.10.5 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. ఈ మూవీ జూన్ 20న ఓటీటీలోకి వచ్చింది.

ఓటీటీలో హిట్

థియేటర్లలో ప్లాఫ్ గా నిలిచిన గ్రౌండ్ జీరో మూవీ ఓటీటీలో మాత్రం అదుర్స్ అనిపిస్తోంది. ఈ మూవీని ఓటీటీ లవర్స్ తెగ చూసేస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇండియాలో నంబర్ వన్ గా ట్రెండ్ అవుతోంది ఈ మూవీ. బీఎస్ఎఫ్ సెకండ్ ఇన్ కమాండ్ ఆఫీసర్ గా ఇమ్రాన్ హష్మి యాక్ట్ చేశాడు. 2011లో భారత పార్లమెంట్ పై దాడి వెనుకు మాస్టర్ మైండ్ ను హంతం చేయడమే టార్గెట్ గా సాగే ఆపరేషన్ థ్రిల్ పంచుతుంది. ఈ థ్రిల్లర్ ఆడియన్స్ ను అట్రాక్ట్ చేస్తోంది.

ట్రెండింగ్ లో ఇవి

ప్రైమ్ వీడియో ఓటీటీలో ఇండియాలో గ్రౌండ్ జీరో నంబర్ వన్ ప్లేస్ లో కొనసాగుతోంది. ఆ తర్వాత విజయ్ సేతుపతి తమిళ్ సినిమా ఏస్ ఉంది. ఈ మూవీ కూడా యాక్షన్ థ్రిల్లరే. ఇక టాలీవుడ్ యాక్టర్ నవీన్ చంద్ర కు ప్రైమ్ వీడియోలో తిరుగులేదు. అతని రెండు సినిమాలో టాప్-5లో ట్రెండ్ అవుతున్నాయి.

రెండు థ్రిల్లర్లు

టాప్-5లో చివరగా బాలీవుడ్ కామెడీ ఫ్యాంటసీ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ భూల్ చుక్ మాఫ్ ఉంది. థియేటర్లలో ఉండగానే ఈ సినిమా ఓటీటీలోకి రావడం గమనార్హం. తన పెళ్లి రోజు టైమ్ లూప్ లో చిక్కుకునే హీరో కథే ఈ సినిమా.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks